Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టేపువలెనుండు జీవులు. శరీరము ప్రకాశవంతమగు వర్ణ ములతో పారదర్శక ముగా నుండును. ఆహారము :- జెల్లి చేపలును, సముద్రపు 'అనిమోన్సు' అనబడు గాలిపువ్వులవంటి పెద్ద జీవులును పెద్ద పరి మాణముగల ఎరను మ్రింగి వేయగల శక్తిని కలిగి యున్నవి. చురుకుగా నుండు టెనిఫోరాలు ఒకదానితో మరియొకటిగాని, చిన్న జంతువులకు గాని కణ సహా యముచే అతుకుకొనియుండి మాంసాహారులుగా నుండును. అంతర్గుహాక ములలో ఎక్కువ రకములు అతి సూక్ష్మజీవులను ఆహారముగా చేసికొనును. అవి వాని ఎరను పట్టుకొనుటకును, చంపుటకును 'దంళఘటములు' (Cnidobcosts) అను (కుట్టుటచే నొప్పి కలుగ జేయు) కణ ములను, మీసములను ఉపయోగించుకొనును. సూచ్యం గములు (Endoblasts) అనబడు గ్రుచ్చుకొను కణము లను కలిగియుండుట అంతర్గుహాక జాతి యొక్క సహజ లక్షణము. కంకతినముల (టినోఫోరా) తరగతియందు తప్ప మిగిలిన అన్ని జాతులకును సూచ్యంగములు కలవు. ప్రతి దంశ ఘటమునకును సూచ్యంగము అనబడు నొక గుల్ల యుండును. గుల్లలో విషసంబంధమగు జిగురు పదార్థముండును. పదార్థమున సున్నితమై బోలుగా నుండు సూత్రమొక్కటి చుట్టలుగా నుండును సూచ్యంగము కణమునందలి ఎక్కువభాగమును ఆక్ర మించును. ఈ కణము యొక్క చివర (Cnidocil) అను మీటగాని, ముతకగానుండు వెండ్రుకల కుచ్చుగాని ఆ యుండును. దంశఘటము ముడుచుకొనుట వలన కలిగిన ఒత్తిడిచే సూచ్యంగము బ్రద్దలగును. దారము రాసాయ నికముగను, యంత్రమువలెను పనిచేయును. ఈ కటారులు ఆహార కీటకము యొక్క శరీరమునందు నాటబడి, అప్పుడు వెడలు స్రావము గాయమును విషపూరితముగా చేయును. ఈ విధముగా చిన్నచిన్న జంతువులు కదల కుండ చేయబడి చంపబడును. అప్పుడప్పుడు ఆ స్రావము కరిగించు ద్రావకము (Solvent) గా కూడా పనిచేయును. ఏది ఎట్లున్నను, 'సూచ్యంగములను' (నిమాటోసిస్టు Nematocysts) ఆయుధములనుటకన్న పట్టుకొనుటకు తగిన పాఠములు వల వలె వ్యాపించి యుండు నాడీ మండలము శరీరమం దంతటను సరిసమానముగా అంతర్గుహాకములు వ్యాపించి యుండును అనుట ఎక్కువ తగియుండును. నాడీమండలము :- అంతర్గుహాకముల నాడీమండలము అతిప్రాచీన దశకు చెందినది. కేంద్ర నాడీమండలము వానికి లేదు. మేధస్సుకూడా లేదు. ఎత్తైనను త్వరీతముగ ప్రేరణములను నిర్ణీతమైన దిక్కునకు తీసికొనిపోవు నాడీ మార్గము వీనిలో కలదు. అది ఉన్నత జీవులందు స్థానికము గాను, స్థిరముగను ఉండు నాడీ పద్ధతిని సూచించును. పారస్ధిక విషయములు:- ఇంచుమించు అంతర్గుహాకము లన్నియు సముద్రజీవులు. సామాన్యము జరియకము (హైడ్రా) మీసములేని సూక్ష్మాతిసూక్ష్మమైన జకీయకము (మైక్రోహైడ్రా) ప్రారంభదశయందు మత్స్య అంద ములపై పరాన్న భుక్కుగా నుండిన 'పాలిపోడియం', (Poly Podium) సంయోగ జీవులుగా నుండు 'కార్డి లోఫోరా' (Cardylophora) మంచినీటి యందుండు ఛత్రికలు మొదలగునవి, మంచినీటి అంతర్గుహాక ములకు ఉదాహరణములు. వీటిలో మిక్కిలి చురుకుగా ఈదు పెక్కుజీవులు లోతులేని నీటిలో నుండును. కొన్ని లోతైన నీటిలో కూడ కనబడును. చాలరకముల పుర్వగక ములు ఇతరజంతువుల శరీరపుచిప్పలను ఆధారము చేసి కొని పెరుగుచుండును. అప్పుడప్పుడు అవి ఆ చిప్పలనుపూర్తిగా కప్పి వేయుచుండును. 'మునీశ్వరపీత'కును, సముద్ర 'కుసు మాభముల'కును ఎడ తెగని భాగస్వామ్యము అంతర్గుహాక ములయందు విచిత్రమైనదృశ్యము. మునీశ్వరపీతసముద్ర కుసుమాభముచే కప్పబడి, దాని గ్రుచ్చుశక్తి చే రక్షింపబడు చుండును. సముద్ర కుసుమాభమును మునీశ్వరహీత మోసి కొని తిరుగుచుండును. ఇట్టి పరస్పర లాభకరమగు బాహ్య భాగస్వామ్యమునే 'సహభోజనము' (Commensalism) అందురు. 'సహజీవనము' (Synbiosis) అను శారీ రక భాగస్వామ్యము చాలరకములగు 'కుసుమారము'ల యందును, 'ఆల్సి యొ నేగియన్సు' (Alcyonarians) యందును కలదు. అతిసూక్ష్మమైన ఏకకణ శైవలములు ఈ జంతువుల యొక్క శరీరకణములలో నివసించును. అంతర్గువోకముల ప్రసృష్టిలో దాదాపు 9,000 జాతులు గలవు. వాటిని మూడు తరగతులుగా విభజించిరి. 1. జలీయకవర్గము ( హైడ్రోజోవా Hydrozoa) మంచినీటియందుండు పుర్వగకములు చాలా చిన్నవిగా 6 41