Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

" అంతర్గుహాకములు పునఃసృష్టి (Regeneration):- అంతర్గుహాకములలో పునరుత్పత్తిచేయు రక్తి గమనించ దగినది. లోపించిన భాగములను తిరిగి సృష్టించుకొనుటలోను, ఆ జీవి యొక్క ఒకానొక శరీరభాగము సంపూర్ణమైన జీవిగా పెరుగుట యును గూడ, వానికిగల పునరుత్పాదక శక్తిచే జరుగు చుండును. ఉదా॥ జలీయకము యొక్క మీసములలో నొకటి తెగిపోయినచో, దానిస్థానమున క్రొత్త మీన మొకటి బయలుదేరును. లేక జలీయకము కొన్ని ముక్కలుగా తెగిపోయినచో ప్రతిముక్కయును సంపూ ర్ణమైన క్రొ త్తజీవిగా వృద్ధిజెందును. పగడము:- సమూహములుగా జీవించు అంతర్గుహాక ములయొక్క ఖటిక (కాల్షియ) పంజరమే పగడము . పగడములు ఒకప్పుడు మొక్కలవలె శాఖోపశాఖలుగను, మరి యొకప్పుడు పక్షి ఈకవలెను, ఇంకొకప్పుడు మెదడు వలె గట్టి ఉపరితలములు గలిగిన అర్ధగోళము లేక పూర్ణ గోళము వలెను, వివిధరూపములతో నుండును. పగడ ములు అందమైన రంగులతోనుండును. ప్రత్యేకము విలువగల పగడములు అనబడునవి సామాన్యముగా కొంత ఎరుపురంగును కలిగియుండును. అవి ఆభరణములలో ఎక్కువగా ఉపయోగింపబడుచున్నవి. ఎక్కువవిలువైన పగడపు రాళ్ళు, మధ్యధరా సముద్రము నుండి లభించు చున్నవి. ముగ్గా పగడములు, మహాసముద్రములలో వెచ్చని భాగ ములయందు పగడపు దీవులుగా నేర్పడును. ఉదా॥ బహ మియాదీవులు, ఫిజీదీవులు, బెర్ముడా, ఆస్ట్రేలియా, క్యూబా, హావాయి, ఫ్లోరీడా, యుకటాను మొదలగునవి ఇట్టివి. నీటిముంపులో నుండు గట్టులపై పగడపుదీ వులు నిర్మిత మగును. అవి భూమిదగ్గర సన్నని రాతి గట్టువలె ఏర్పడును. పగడపు గట్టులు చేపలు, ఎండ్రకాయలు మొదలగు సముద్రపు జీవులు దాగి యుండుటకు అను కళాలముగా నుండును. కంకఠినములు (టెనోఫోరా) :- టెనోఫోరాను, అప్పు డప్పుడు అంతర్గుహాకములలో ఒక తరగతిగా పరిగణిం తురు. కానీ కొన్ని ప్రధానమగు వ్యత్యాసములను చూపుచుండుట వలన ఇది మరియొక ప్రసృష్టిగా వ్యవహ శింప బడుచున్నది. కంకఠినములకు (టెనోఫోరా) శరీ 40 రముపై దువ్వెనలవంటి పలకలను కలిగియుండుట వలన దువ్వెన ఛత్రికలు అనియు (Jelleys), నిడివి వై పున కట్లు కట్లుగా నుండుటవలన సముద్ర అదోటములు (Sea- walnuts) అనియు అందురు. ఛత్రికలు సున్నితమైన శరీరము కలిగి పారదర్శకములై యుండును. వాటి శరీర ములు కొన్నిటిలో స్తంభాకారముగాను, కొన్నిటిలో గోళాకారముగాను, కొన్నిటిలో రిబ్బనువలె చదునుగాను ఉండును. వీటిలో కొన్ని రకములు అధిక సంఖ్యలలో మహాసముద్రములయందు నివసించుచు, తరుచుగా అంద మైన వర్ణములను కలిగియుండును. వీటి శరీరమున ఒక చివర నోటిని, రెండవ చివర జ్ఞానప్రదమైన స్థితికోష్ఠము (Statocyst) అను దానిని కలిగియుండు రెండు కొన లగ పడును. కొన్ని కంకతినములు లోనికి ముడుచుకొనిపోవు రెండు మీసములను కలిగియుండును. ఈ మీసములు 'లాసో' కణములతో కప్పబడి యుండును. లాసోకణము లందలి దారమువంటి పదార్థము ఆహార కీటకములను పట్టుకొని బంధించుటకు ఉపయోగపడును. వీటి శరీర ముపై నూగుతో ఏర్పడిన ఎనిమిది కట్లు తలనుండి తోక వరకును (Meridional) వ్యాపించియుండును. అవి చలన మునకు ఉపయోగించును. కంకతినములకు సంబంధించిన కొన్ని సామాన్య ఉదాహరణములు :- 'సముద్రపు గోలీ' అనబడు పూరోబ్రేహియా:- దీని శరీరము సున్నితమై, పారదర్శక మై యుండును. దేహవర్ణము గులాబిరంగు. దీనికి నూగు కలిగిన పొడవైన రెండు మీసము లుండును ఇది గోళీకాయ పరిమాణములో నుండును. ఇవి న్యూ ఇంగ్లాండు సముద్ర తీరము పొడుగునను విస్తారముగా నుండును. సముద్ర అక్షోటములు (Sea-walnuts):- అ న బ డు బొలినాప్సిస్, నెమియాప్సిస్:- వీటికి మీసము లుండవు. ఇవి స్తంభాకారముగాగాని, శంఖాకారముగా గాని ఉండును. ఇవి పారదర్శకమైన శరీరముగల జీవులు. అవి అధికసంఖ్యలలో గుంపులు గుంపులుగా నుండును. వానిలో కొన్ని రకములు రాత్రులయందు భాస్వరపు కాంతులను ప్రసరించుచు వింతగా ప్రవర్తించుచుండును. 'సెస్టస్ వెనెరిస్' (Cestus veneris) అను జీవులు ఒకటి రెండు అంగుళముల వెడల్పుతో పొడుగైన చదునైన