Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రవాహముతో కదలుచుండును. "అఫ్లైటిస్" (Aplitis) అను బహిశ్చర్మమును, జీర్ణాశయబిలమును తరువాత కనుపించును. ఆ డింభము నీటి అడుగుభాగమునకు మునిగి ఒక కొనతో అంటుకొనియుండును. ఇంకొక చివర నోరు, మీసములు ఏర్పడి ఆ జీవి "పుర్వగకము"గా మారును. పై రీతిగా గాక అండము నేరుగా మెడూసాగా పెరుగగల జీవులును కొన్ని గలవు. ఉదా:- జలీయకము (Hydra); ఒబిలియా (Obelia); మోనోసొసిస్ట్ (Monosocyst), పునరుత్పత్తి:- వీటిలో పునరుత్పత్తి రెండు రకము లుగా జరుగును. ఒక జీవి యొక్క ఒక జీవియొక్క దేహకుడ్యముపై తొలుత పార్శ్వములయందు మొటిమలవంటి 'మొగ్గలు' బయలుదేరును. ఈ మొటిమలవంటి మొగ్గ తనకు కారణ భూత మైన తల్లి జీవివంటి రూపమును పొందువరకు పెరుగు దల నొందును. దానిచుట్టును మూలమందు ఒక విధమగు నొక్కు ఏర్పడిన తర్వాత ఈ క్రొత్తజీవి, స్వతంత్రముగా జీవించుటకు తల్లినుండి వేరుపడుటగాని, లేక ఆ జీవ సమూహ నిర్మాణమున రెండవజీవిగా కలిసి వుండుట గాని జరుగును. ఇదేవిధముగా ఆ సంఘమునందలి మిగి లిన జీవులు ఉత్పత్తి అగుచుండును. చాలరకముల అంత ర్గుహాకములలో లైంగిక పునరుత్పత్తి మరియొక విధా నము. ఈ విధానమున స్త్రీవీజములు (Ovum), శుక్ల బీజములు ఉత్పత్తియగును. శుక్లకణ మొకటి స్త్రీ బీజ ఈ ముతో కలియుటవలన పిండము తయారగును. పిండము మొదట క్రిమిగా ఏర్పడి తరువాత క్రొత్త జీవిగా రూపొందును. కొన్ని రకములలో కణవిభజనము లేక నిలువున విభజనము నొందుట సంభవించును. కొన్ని రూపములలో పునరుత్పత్తి (ఖండిలనము) (Strobila- tion) అడ్డముగ విభజనము నొందుటచే జరుగును. అంతర్గుహాకములు లింగసహితదశ మెడూసా (ఛత్రిక) వలెను ఉండుటచే ఈ మార్పు ఇంకను క్లిష్టముగా నుండును. ఈ జీవులలో ఒకదానినుండి మరి యొకదానికి ఒక చక్కని క్రమము కనిపెట్టబడినది. 'మొదట హైడ్రా అను ప్రాణియు, దాని నుండి సెర్టులేరియా వంటి రూపములద్వారా 'ఓబీలియా' ప్రాణులకును, ఎరియోప్ వంటి ప్రాణులకును, జెరియో నియా రూపములకును ఈ క్రమము వ్యాపించుచున్నది. హైడ్రా (ఉలీయకము) ప్రాణియందు 'ఛత్రిక' కాన బడదు. సెర్టులేరియాయందు ఛత్రికరూపము తక్కువగను, అప్రధానముగను కనబడును. ఓబీలియాలో జలీయకము, ఛత్రిక సమప్రాధాన్యములో నుండును. జిరియోప్ నందు జలీయకరూపము తగ్గుదలనొంది ఉండును. జెరియోని ఁయాలో జలీయక రూపము మృగ్యమై యుండును. బహురూపత (Polymorphism): బహురూపతతో కూడిన సమూహరూపముల అభివృద్ధి అంతర్గుహాక జాతి యొక్క చక్కని లక్షణము. కొన్నిటిలో సమూహము ఒకేపోలికగల జలీయక రూపములను కలిగియుండును. ఛత్రికలు ఫలదీకరణమునొందిన అండములను తయారు చేయును. ఈ అండములనుండి తగిన పరిసరములో ఒక్కొక్కటి ఒక క్రొత్త సమూహరూపముగా రూపొంద గల క్రిములు ఏర్పడును. కొన్ని సమూహరూపములలో ఆహారమును పట్టుకొనుటకు కొన్నియు, ఆహారమును జీర్ణించుకొనుటకు కొన్నియు వ్యక్తులు ఏర్పడియుండును. అత్యుత్త మమగు బహురూపత గొట్టములవలె నుండు జెల్లి చేపలలో (సై ఫోనోఫోరో) ఏర్పడును. ఒక సమూహమున కొన్ని వ్యక్తులు చలనమునకును, కొన్ని నీటిలో తేలి యుండుటకును, కొన్ని ఆహారమును జీర్ణించుకొనుటకును, కొన్ని బలముగా గ్రుచ్చుకొను పొడుగైన దారములతో కూడిన మీసములవంటి అవయవములుగా ఏర్పడుటకును. ప్రత్యేకింపబడి యుండును. ఇవి ఆ సమూహమును రక్షిం చుటకును, శత్రువును బలహీన పరచుటకును ఉపయోగింప బడుచుండును. కొన్ని పొలసులవంటి రక్షణాంగములను గలిగి సమూహమందున్న కడుసున్నితమగు జీవులను కప్పియుండును. కొన్ని ప్రాణులు సమూహము యొక్క పునరుత్పత్తి కొరకు లింగసంబంధమగు కణములను వికల్ప ఉత్పత్తి విధానము (Alternation of Gene- ration):= అంతర్గుహాక ములలో వికల్ప ఉత్పత్తివిధానము ఒక విశేషలక్షణము. మొగ్గల రూపమున పునరుత్పత్తి జరుగు లింగరహితదళయును, ఫలదీకరణమును చెందిన అండముద్వారా పునరుత్పత్తి జరుగు లింగసహిత దళ యును, ఒకటి విడిచి ఇంకొకటి సంభవించుచుండును. లింగరహితదళ హైడ్రా (మంచినీటి పుర్వగకముల వలెను, మాత్రమే ఉత్పత్తి చేయును. 39