ఆర్కిమెడీసు
సమానమగు భారముకల స్వచ్ఛమగు బంగారము నీటిలో ముంచబడిన పుడెంత భారమును నష్టపోవునో కిరీటము
కూడ నీటిలో ముంచబడినపుడు అంతేభారమును నష్టపోవలెను. అపుడే ఆ కిరీటములోని బంగారము పరిశుద్ధ
మగునదిగా గ్రహింపబడును. కాని అవి నష్టపోవు భారము ఎట్టి వ్యత్యాసమున్నను అది కల్మషమగు బంగారముగా గ్రహింపబడును.
గరిమనాభి, (Centre of Gravity) తులాదండము, (Levers), ఉత్ల్పవనము (Buoyancy), అను మూడు విషయములలో నితడొనర్చిన పరిశోధనలు విజ్ఞానశాస్త్రాభివృద్ధి కెంతయు తోడ్పడినవి. రేఖాగణిత శాస్త్రమునందు కూడ వివిధవిషయములను గూర్చి అతడు వివవరించెను. అతడు ఈ క్రింది విషయములపై గ్రంథములు వ్రాసెను.
1. 'గోళము, స్తూపము' ఇందు గోళములు, శంఖులు, ఘన సమచతుర్భుజములు, స్తూపములు- అను వాటియొక్క కొలతలు శుద్ధ రేఖాగణిత విధానము ననుసరించి చూపబడినవి. ఈ గ్రంథము రెండు భాగములుగా నున్నది.
2. వృత్తము యొక్క కొలత.
3. ఘనశంఖులు; ఘనగోళములు ఇందు 32 ఆకాంక్షా సిద్ధాంతములు ప్రతిపాదింపబడినవి.
4. సర్పిలములు; ఇందు 28 ప్రతిపాదనలు కలవు.
5. సమతలముల యొక్క గరిమనాభిత్వము. ఇది రెండు భాగములుగా నున్నది. లోగడ అరిస్టాటిలు చే వివరింపబడిన విషయములు సాపేక్షముగా అనుమానాస్పదములుగాను అశాస్త్రీయములుగాను ఉండెను. అందుచే అర్కి మెడీను ఇందు వివరించిన విషయములు సిద్ధాంత పూర్వకములై యాంత్రిక శాస్త్రమునకు పునాదులుగా భావింపబడుచున్నవి. ఈ గ్రంథమునందలి మొదటి భాగములో పదునేను ప్రతిపాదనలును, ఏడు సిద్ధాంతములును (Postulates) కలవు. రెండవ భాగ మందు పది ప్రతిపాదనలు కలవు. (1) రెండు భారములు, (2) సమానాంతర చతుర్భుజము, (3) త్రిభుజము. (4) సమలంబ చతుర్భుజము, అను వాటి యొక్క గరిమ నాభినిగూర్చి నేడు వాడుకలోనున్న నిరూపణలతో ఇతని నిరూపణలు సమానముగా నున్నవి.
6. పరవలయ (Parabola) వైశాల్యము. ఇందు ఇరువదినాల్గు ప్రతిపాదనములు కలవు. “పరవలయము యొక్క ఖండవైశాల్యము, ఆ ఖండమునకు సమానమైన కొలతలతో కూడిన ఆధారము, లంబముగల త్రిభుజము యొక్క వైశాల్యములో 4/5 వంతు ఉండును" అనుటకు రెండు నిరూపణములు ఇయ్యబడినవి.
7. తేలెడివస్తువులు; ఇది రెండు సంపుటముల గ్రంథము.
8. సొమ్నైటిసు (Psamnites) ఇసుకను లెక్కించు సాధనము (Sand reckoner). ఇది సంఖ్యా పరిభాషలతో కూడిన గ్రంథము.
9. విధానము (Method): ఇది 1906 లో కనుగొనబడినది. ఇది ఒక ముఖ్యమైన గ్రంథము. ఇందు ఆర్కి మెడీసు యాంత్రిక పద్ధతులను వివరించెను. వీటిచే ఆతడు అనేక నిర్ణయములు చేయగలిగెను.
10. సమతల రేఖాగణిత శాస్త్రమునందలి ప్రతిపాదనములు.
ఆర్కిమెడీసు పైన పేర్కొనబడిన విషయమునేకాక త్రాసు, కప్పీలు, ఖగోళశాస్త్రము, కాంతియొక్క వక్రీభవనము మొదలగు విషయములలో కూడ కృషి సల్పినట్లు తెలియుచున్నది.
పూర్వకాలపు యాంత్రిక నాగరకతకు ఆర్కిమెడీసు స్థాపకుడై యున్నను, సైరకూసు రక్షణ సంస్థను ఆయత్త పరచుట వలన అతనికీర్తి నల్దిక్కుల వ్యాపించియున్నను ఆతనికి యాంత్రికసాధనములపై ప్రబలమైన అనాదరము ఉండెడిది. కావున వాటియెడ ఆతనికి గల ద్వేషము -ఆతడు వాటిని ఎక్కడను వ్రాసి పెట్టియుండకపోవుటచే విదితమగుచున్నది. ఇట్టి యాంత్రిక పరిశోధనలు కేవల శాస్త్రజ్ఞుని కీర్తిప్రతిష్ఠలకు లోపము నాపాదించు నని అతడు తలంచెను.
రోమను సేనానాయకుడగు మార్సిలను సైరకూసు నగరమును జయించునాటికి ఆర్కి మెడీను తన అవసాన దశ యందుండెను. విజయమునొందిన రోమను నాయకునకు ఆర్కిమెడీసుపై గాఢాభిమానము ఉండెను, అతడు ఆర్కిమెడీసును తీసికొని రావలసినదిగా ఆజ్ఞాపించెను. మార్సిలను ఆర్కిమెడిసును ఆదరించు తలపుతోనే అతనీ పిలిపించెను. కాని మార్సిలను ఆజ్ఞయందలి సద్భావ