ఆర్థికఖనిజములు
మును గ్రహింపజాలని రోమను సైనికుడొకడు, ఆర్కి మెడీసును కలిసికొని అతనిని తన వెంట రావలసినదిగా ఆజ్ఞాపించెను. కాని మహామహుడగు ఆర్కి మెడీసు శూన్యమనస్కుడై కొంతతడవుండెను. ప్రేపితుడైన సైనికుడు ఆతని శూన్య మనస్కతను అర్థము చేసికొన లేదు. అతడు దానిని ఆజ్ఞా తిరస్కారముగా భావించి వెంటనే అతనిని కత్తితో పొడిచి చంపెను. పిదప ఆర్కిమెడీసు యొక్క దుర్మరణమునకై ఆ రోమను - సేనానాయకుడు మిక్కిలి దుఃఖించెను. సుప్రసిద్ధుడగు ఆ శాస్త్రజ్ఞుని భౌతిక దేహము గౌరవపూర్వకముగా పాతిపెట్టబడెను. అతని సమాధి పై ఒక శిల స్థాపింప బడెను. ఆశిలపై నొక చిత్రము వ్రాయబడెను. అందు ఒక స్తూపము, దానిలో నొక గోళము లిఖింపబడెను. ఎందుచేతననగా ఆర్కిమెడీసు గోళము యొక్కయు దానిని ఆవరించియుండు స్తూపము యొక్కయు ఘనపరిమాణములకు గల సంబంధములో తాను కసిపెట్టియున్న వి శేషము అన్ని విధముల ముఖ్యమైన దానినిగా భావించెను.
త.స.న
ఆర్థిక ఖనిజములు*:- ఉపోద్ఘాతము :- భూమిపై దొరకు ఖనిజ సంబంధమైన వస్తువులను మానవులనాదిగా నుపయోగించుచుండి రను విషయ మెల్లరకు విదితమే. మొట్టమొదట వాడిన వస్తువులలో గొడ్డండ్లు, కత్తులు మొదలగు సామగ్రిని తయారుచేయుట కుపయుక్తమైన చెకుముకి రాయి (flint, chert etc.), స్పటికపురాయి, పలుగురాయి, లేక పిండిరాయి (quartz) మొదలైన వాటిని పేర్కొనవచ్చును. బలపపురాయి (steatite) సున్నపురాళ్ళు (lime stones) మొదలైన మెత్తనిరాళ్ళు చిప్పలు, తోట్లు మొదలైనవి చేయుట కుపకరించిరి. తదుపరి పలురకములగు మన్నులతో కుండలు, పెంకులు చేయబడినవి. క్రమక్రమముగా రంగుమన్నులు, బంగారు, రాగి, మొదలగు లోహములు కూడ ఉపయోగింపబడుచు వచ్చినవి.
వివిధ దేశపు ప్రజలలో నాగరకత ప్రబలుచు వచ్చిన కొలది అంతకంతకు ఖనిజములు అత్యధికముగా ఉపయోగింప బడుచు వచ్చినవి. ఖనిజముల ఉపయోగము లెక్కువైనకొలది, వాటిని వెదకి, భూమినుండి త్రవ్వి తీయుపద్ధతులు గూడ క్రమముగా నభివృద్ధి చెందసాగినవి. ఖనిజములను గురించిన సమస్యలు, వాటి సాధనలు విజ్ఞాన శాస్త్రములలో నొక భాగముగా పరిణమించినవి. ఇదియే ఆర్థిక ఖనిజములకు సంబంధించిన భూగర్భ శాస్త్రము (Economic Geology).
భూగర్భశాస్త్రరీత్యా భూమి పైభాగము సుమారు 40 మైళ్ళ లోతువరకు, రాతిమయమై యున్నది. దీనిలో చాలభాగము లక్షలాది సంవత్సరముల క్రితము శిలాద్రవము (magma) ఘనీభవించుట వలన నేర్పడిన రాళ్ళు (Igneous rocks). ఇవిగాక యిసుక, ఒండుమట్టి మొదలైన పదార్థములు నీటి ప్రవాహములద్వార సముద్రములలోనికి కొట్టుకొనిపోయి అచ్చట చాల కాలము తరువాత గట్టిపడి శిలలుగామారి, యుగాంతము లందు వచ్చు భూచలనములలో నీటి పైభాగమునకు వచ్చిన రాళ్ళుగూడ ఉన్నవి (Sedimentary rocks). పై రెండురకముల రాళ్ళు శీతోష్ణ పరిణామముల వలనను పీడనము (pressure) చేతను మార్పుచెంది పలురకములగు ఇతర శిలలు గూడ నేర్పడినవి (metamorphic rocks).
ఇట్లు భూమిపై నున్న శిలలన్నిటిని ముఖ్యముగా మూడు రకములుగా విభజింపవచ్చును. ఈ శిలలన్నియు చాలవరకు పలువిధములగు ఖనిజనముదాయములే. ఈ ఖనిజములలో పారిశ్రామికముగ నుపయోగపడునవి చాల తక్కువ. అవిగూడ పలురకములగు శిలలతోగూడి యనేకచోట్ల నున్నను ప్రకృతిలో కొన్ని కొన్ని చోట్లనే అవి కేంద్రీకరింపబడి యున్నవి. అట్లు కేంద్రీకరింపబడి లాభదాయకముగా నుపయోగింప బడగలిగినప్పుడే వానిని 'ఆర్థిక ఖనిజము' లనదగును. ప్రస్తుతము తెలిసి యున్న సుమారు 1400 ఖనిజములలో 200 మాత్రము ఆర్థిక ఖనిజములుగా పరిగణింపబడుచున్నవి.
ఆర్థిక ఖనిజములు - వాని విభజన - ఆర్థిక ఖనిజములను, ముఖ్యముగా మూడురకములుగా విభజింపవచ్చును (1) ధాతు ఖనిజములు (metallic ores). (2) అలోహ ఖనిజములు (non-metallic minerals). (3) ఆంగారిక ఖనిజములు (minerals of organic origin). ధాతు ఖనిజ
- భారతీయ భూతాత్త్విక సమీక్ష డైరెక్టరుగారి అనుమతితో.