Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్కిమెడీసు


మందు నీటిపారుదలకు గల అవశ్యకతను గుర్తించెను.

ఇడియే ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము (Archemedian Screw) ను కనిపెట్టుటకు కారణమయ్యెను.

హైరోరాజుకొరకు తయారు చేయబడిన పెద్ద నౌక నుండి నీరు తొలగించుటకుగాను ఇతడు నీరు పైకెత్తునట్టి ఈ పరికరమును కనుగొనేనని మరియొక ప్రతీతి కలదు. ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము మిక్కిలి స్థూల రూపములో ఒక లోహముతో చేయబడిన గొట్టము అది ఒక గట్టి స్తూపము చుట్టు సర్పిల ఆకారములో వంచబడి ఉండును. కడ్డీ స్తూపాకారపు చివరలయందు మొత్తము పరికరమును దాని ఇరుసుచుట్టును త్రిప్పుటకు వీలుగా భ్రమణ కీలకములు అమర్చబడియుండును. మెలికలు 'తిరిగిన గొట్టపు క్రింది చివరి పైకెత్తబడవలసిన నీటిలో నుంచి స్తూపాకారముగల గొట్టమును దిఙ్మండలమునకు (Horizon) ఏటవాలుగా నుంచి, ఆ పరికరమును త్రిప్పిన యెడల, క్రమముగా నీరు ఒక సర్పిలము (Spiral) నుండి మరియొక సర్పిలములోనికి ఎక్కును. ఇదే సూత్రము నేడు గోధుమలు మున్నగు ధాన్యముల విషయములో వాటిని పైకి చేరవేయు యంత్రములలో ఉపయోగించ బడుచున్నది.

ఆర్కి మెడీసుచే కనుగొనబడిన అనేక యంత్రములలో ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము ఒకటియై యున్నది. అతడు తులాదండము (Lever) యొక్క సూత్రమును కనుగొనెను. కప్పీలను (Pulleys), తులాదండములను ఉపయోగించి రోమన్ దండయాత్రికులకు భయమును కలిగించునట్లు అతిభారముతో నుండు పెద్ద పెద్ద నౌకలను గూడ పై కెత్త గలి గెనని చెప్పబడుచున్నది. "ఒక తులా దండమును దానిని నిలువబెట్టుటకు కొంత స్థలమును ఇచ్చినచో, నేను యావత్ప్రపంచమును కదిలింతును." అని ఆర్కిమెడీసు చేసిన సుప్రసిద్ధమగు ప్రతిజ్ఞ వలన ఈ సూత్రమునుగూర్చి అతనికిగల స్పష్టజ్ఞానము తేటపడు చున్నది. గెలిలియో కాలమువరకు తిరిగి ఇతని సిద్ధాంతములను అందుకొనగల ప్రయోగ శాస్త్రవేత్త వేరొకడు జన్మించలేదు.

ఆర్కి మెడీసు తన పేరుతో వ్యవహరింపబడు ఈ దిగువ సూత్రముతో మిక్కిలి ప్రఖ్యాతిగాంచెను :

“ఒక పదార్థము ద్రవములో మునిగినపుడు అది నష్టపోవుభారము దానిచేత తొలగింపబడిన ద్రవభారమునకు సమానము." ఆర్కిమెడిస్ కనుగొనిన సూత్రములలో నిది మిక్కిలి ప్రసిద్ధమగు సూత్రము. ఈ సూత్రమును కనుగొనుటకు ఏర్పడిన పరిస్థితులు వివరించు ఒక చక్కని గాథ కలదు. హీరోరాజు తన కొరకు ఒక కంసాలి చేసి యిచ్చిన బంగారు కిరీటము యొక్క పారిశుధ్యమును నిర్ణయించవలసినదిగ విజ్ఞాన సమస్యలయందు ఆసక్తుడగు ఆర్కి మెడీసును ఆజ్ఞాపించెను, ఆర్కి మెడీసు ఆ శాస్త్రీయ సమస్యయందు నిమగ్నుడై యుండెను ఇట్లుండ ఒక వేసవిలో ఒకనాటి సాయం కాలమున ఆర్కి మెడీసు పౌర స్నానాలయమునందు స్నానము చేయు చుండెను. అట్టి సమయమున అతనికి ఆ సమస్యాపరిష్కా రము స్ఫురించెను. తత్ క్షణమే అతడు నగరవీధులగుండా వివస్త్రు డై ‘యురేకా', 'యురేకా' (నేను కనుగొంటిని నేను కనుగొంటిని) అని అరచుచు పరుగెత్తెను. అప్పుడతనికి స్ఫురించిన ఆ సమస్యా పరిష్కారము పై సూత్రము ననుసరించి ఇట్లుండి యుండవచ్చును. ఆ కిరీటముతొ