ఆయుర్వేద గ్రంథములు
రెండు గ్రంథములను రచించెనని చెప్పుదురు. ఇవి లభ్యములు. ఇతనిచే రచింపబడిన రసేంద్రమంగళ మను
గ్రంథమునందు ఎనిమిది అధ్యాయములు కలవు. కాని ప్రస్తుతము 3 అధ్యాయములు మాత్రమే దొరకు చున్నవి. దీనిని ఆంధ్రభాషలోనికి పరివర్తనమొనర్చిరి.
రసహృదయతంత్రము :- దీనిని శంకరాచార్యుల గురువగు గోవింద భగవత్పాదులు రచించిరి. ఇది లభ్యము.
రసార్ణవతంత్రము :- ఇది ఈశ్వరునిచే పార్వతికి ఉపదేశింపబడినది. బహు ప్రాచీనమైనది. ఇది లభ్యము.
వాణీకరణతంత్రములు; కుచుమారతంత్రము :- - ప్రాచీనమైన తంత్రము. లభ్యము కాదు.
నందితంత్రము :-నంది అనువానిచే ప్రథమమున వేయి అధ్యాయములలో నీ సంహిత వ్రాయబడెనని తెలియు చున్నది.
శ్వేతకేతుతంత్రము :- ఉద్దాలకుని పుత్రుడగు శ్వేతకేతునిచే నందిసంహిత ప్రతి సంస్కరింపబడి 5 వందల అధ్యాయములలోనికి సంక్షిప్తము గావింపబడి శ్వేతకేతు తంత్రమని వ్యవహరింపబడిన తంత్రము.
పాంచాళతంత్రము :- బబ్రుకుమారుడగు పాంచాళునిచే శ్వేతకేతు సంస్కృతమగు నందిసంహితావ్రతి సంస్కరింపబడి, మరికొంత సంక్షి ప్తము కావింపబడి 7 భాగములలో రచింపబడినది.
వాత్స్యాయమని కామసూత్రములు:- వాత్స్యాయన కృతము. వాత్స్యాయనునిగూర్చి భిన్నాభిప్రాయములు కలవు. కొందరు ఋషి యనియు, కొందరు చంద్రగుప్తుని మంత్రియగు చాణక్యుడనియు అందురు.
3. అనార్ష వైద్యగ్రంథములు; అష్టాంగ సంగ్రహము:- ఇదియును సూత్ర, శారీర, నిదాన, చికిత్సా కల్ప, ఉత్తరస్థానము లను ఆరు స్థానములను కల్గియున్నది. అందు సూత్రస్థానమున 40, శారీర స్థానమున 12, నిదాన స్థానమున 16, చికిత్సా స్థానమున 24. కల్ప స్థానమున 8, ఉత్తరస్థానమున 50 అధ్యాయముల చొప్పున మొత్తము 150 అధ్యాయములు కలవు. ఈ గ్రంథమును వృద్ధ వాగ్భట మని వ్యవహరింతురు. వృద్ధవాగ్భట మను పదముచే కొందరు పండితులు వాగ్భటు లిరువురుండెడి వారని నిరూపించుచున్నారు. దీనినిగూర్చి లోగడ వివరింపబడి యున్నది.
అష్టాంగహృదయము :- ఈ గ్రంథ ప్రాధాన్యమును బట్టి ఇది మొదటనే వివరింపబడినది.
మాధవనిదానము :- ఇది రోగనిర్ణయమున కుపయోగించు ప్రమాణ గ్రంథము. మహారాష్ట్ర దేశజాతుడును, ఇందుకరుని పుత్రుడు నగు మాధవకరునిచే రచింపబడినది. ఇదికూడ బహు పఠన పాఠన ప్రచారములో నున్నది. ఈ గ్రంథక ర్త క్రీ. శ. 7, 8 శతాబ్దములలో జన్మించెను. ఈ గ్రంథకర్త వేదవ్యాఖ్యాతయగు మాధవాచార్యుడని కొందరు వ్రాసిరి. కాని అది నిరాధారము. మాధవాచార్య ప్రణీతమగు గ్రంథము వేరొండు కలదేమోకాని అది ప్రస్తుతము సులభముగ దొరకుటలేదు. ఈ మాధవ నిదానము ననుసరించి పెక్కు గ్రంథము లుద్భవించినవి.
యోగరత్నాకరము :- ఇందును మాధవ నిదానమందలి యనుక్రమము, శ్లోకములు గాన్పించును. ఈ గ్రంథకర్త నామ ధేయము అవిదితము. కాలముకూడ తెలియదు.
శార్ణోధరసంహిత:- ఇదికూడ శారీర నిదాన చికిత్సా విషయములతో విలసిల్లుచు వైద్యులు యాదరమును పొందుచున్నది. ఇందు మూలికౌషధములు, రసౌషధములు కూడ కలవు. పంచకర్మలు వర్ణింపబడినవి. ఇందు మూడు ఖండములు కలవు. అవి పూర్వ, మధ్యమ, ఉత్తర ఖండము లనునవి. దీనిని శార్ణధరాచార్యులు రచించెను.
భావప్రకాశము :- ఇదియు అష్టాంగములను బోధించుట కుద్దేశింపబడినది. ఇది ద్రవ్యగుణ విజ్ఞానమును ప్రధానముగ గల్గించుచు నిదాన చికిత్సలను పరిపూర్ణముగ వివరించు గ్రంథము. ఇది భావమిశ్రకృతము. ఉత్తరదేశము నందు దీనికి విస్తృతమగు ప్రచారము కలదు. ఇందు ఫిరంగరోగమును గూర్చి వర్ణించియున్నాడు. ఫిరంగి చెక్క మొదలగు వస్తువులను గూడ వర్ణించెను. ఇతడు క్రీ. శ. 16వ శతాబ్దపు పూర్వభాగమున జనించెనని నిర్ణయింపబడెను,
పిమ్మట గదనిగ్రహము, సిద్ధయోగము మొదలగు గ్రంథములు రచింపబడినవి. భైషజ్య రత్నావళి, ఆయుర్వేద విజ్ఞానము ఇంకను అర్వాచీనములగు ప్రత్యక్ష