ఆయుర్వేద గ్రంథములు
ములు కలవు. ఈ గ్రంథమును పఠించినవో చరక-సుశ్రుతముల యావశ్యకత యుండదని ఇతడు వ్రాసియుండెను.
అనుభవములో గూడ ఈ విషయము రుజువగుచున్నది.
అంజననిదానము :- ఇదియును అగ్ని వేశ కృతమని యే తెలియుచున్నది. శ్లోకరూపముగ నున్నది. వ్యాధుల యొక్క సంఖ్యను, నామధేయములను తెలియబరచును. ఈ గ్రంథము లభ్యమగుచున్నది.
భేడసంహిత :- ఇది భేడఋషి ప్రణీతము. ప్రస్తుతమిది తంజావూరు ప్రభుత్వ పుస్తక భాండాగారమున ఖండిత ప్రాయముగ నున్నది. దీనిని ఇటీవల ముద్రించి నట్లు తెలియవచ్చినది. ఈ గ్రంథముకూడ ప్రమాణముగ గ్రహింపదగియున్నది. చక్రపాణి వ్యాఖ్యానములో దీని యుద్ధారములు కనిపించును. కొందరీతంత్రమునే బాలుకి తంత్రమని అనుచున్నారు. కాని అది సరికాదు. రెండును భిన్న తంత్రములుగనే యున్నవి.
జతూకర్ణసంహిత : ఇదియును ప్రమాణ గ్రంథమే చక్రపాణి పెక్కు స్థలములలో విషయ నిర్ధారణకై దీనినుండి వాక్యముల నుదహరించియున్నాడు. ఇది శివదాసుడను వ్యాఖ్యాత కాలమువరకు లభ్యమగుచుండెనని అతని వ్యాఖ్యానముల యందిది యుదహరింపబడుటచే తెలియుచున్నది.
పరాశరసంహిత; క్షారపాణి సంహిత :- ఇవికూడ శివదాసుని నాటికి లభ్యమగుచు నిప్పుడు దొరకుటలేదు.
హరీత సంహిత :- ఇదియును చక్రపాణి, విజయ రక్షిత, శ్రీకంఠ, శివదాసాది వ్యాఖ్యాతలు కాలములో దొరకుచు నిపుడు లుప్త ప్రాయమైనది. ప్రస్తుతము హరీత సంహితయని అచ్చుబడి ప్రచారమునందున్న ప్రతి యథార్థమైన హరిత సంహితకాదు. దీనియందు చాల దోషములు కానవచ్చుచున్నవి.
ఖరనాదసంహిత :- దీనిని అరుణదత్త, చక్రపాణి, విజయ రక్షితాదులు ప్రమాణముగ గ్రహించియుండుటచే ఇది ప్రమాణ గ్రంథమని తెలియుచున్నది. ఇప్పుడిది దుర్లభము.
విశ్వామిత్రసంహిత :- ఇది చాల ప్రాచీనతంత్రము. చరక సుశ్రుత వ్యాఖ్యానములలో చక్రపాణి దీనిని స్మరించెను. ఇప్పుడిది దుర్లభము.
అగస్త్యసంహిత :- ఇది అగస్త్యునిచే రచింపబడినది. ఈ పేరుగల ఒక ఋషి ధన్వంతరి శిష్యుడు కలడని దక్షిణా పథమున నొక ప్రచారము కలదు. అగస్త్యుని యీ గ్రంథమును పురస్కరించుకొని ఒక సంప్రదాయము ఆ దేశమునందు అగస్త్య వైద్యమనుపేర వృద్ధినంది యున్నది. ఇది రసతంత్రౌషధములను గూర్చి బహుళముగ బోధించినను కాయచికిత్సా ప్రధానముగ నుండుటచే నిట నుదహరింపబడెను. ఈ తంత్ర ప్రవర్తకులు 23 మంది అని కొందరు, 33 మంది అని కొందరు, 44 మంది అని కొందరును చెప్పుచున్నారు. వారిలో నొకడగు వంగ సేనాచార్యుడు ఈ తంత్రమును సంస్క రించి తన పేర “వంగసేన" యని ప్రసిద్ధినొందిన యొక గ్రంథమును ప్రకటించెను. ఇది ముఖ్యముగ గ్రహింపబడు చున్నది. హేమాద్రి తన వాగ్భట వ్యాఖ్యానములో దీనిని ఎక్కువగా గ్రహించియున్నాడు.
అత్రిసంహిత :- ఇది మిక్కిలి ప్రాచీన గ్రంథమని కొందరును, ఆధునికమని కొందరును, నుడువుచున్నారు. దీని యందలి వచనములు ఏ వ్యాఖ్యానములలోను కన్పట్టక పోవుటచే, దీని యార్షత్వము సంశయింపబడు ·చున్నది. ఇది లభ్యమగుచున్నది. పంచనదమందు ఇంత కన్న పెద్దదియగు నొక గ్రంథము ఈ పేరుతో ప్రచారము నందున్నదని తెలియుచున్నదిగాని ఆ గ్రంథము హస్తగతము కాలేదని. మహా మహోపాధ్యాయ గణనాథ సేన్ గారు వ్రానీయున్నారు. కాయచికిత్సా గ్రంథములలొ ఆర్షము లనదగినవి యింతకుమించి ప్రచారము నందు లేవని చెప్పవచ్చును.
శల్యతంత్ర గ్రంథములు :- శల్యతంత్రమనగా శరీరము నందు చేరి బాధించెడి శల్యముల నుద్ధరించి చికిత్స చేయు విధానము, శల్యములు బాహ్యములగు బాణములు మొదలగునవిగా నుండవచ్చును. లేదా ప్రణాదుల యందలి పూయము మొదలగు నభ్యంతరములుగ నుండ వచ్చును. కనుక శస్త్రములచే చేయబడు ప్రణాదుల చికిత్సయు, బాహ్యముగ శరీరమునందు చేరిన ములుకులు మొదలగువానిని యంత్రాదులచే నాకర్షించి చికిత్సించుటయు కూడ శల్యతంత్ర మనబడుము, దీనిని బోధించు తంత్రములు శల్యతంత్రములు, ఈ తంత్ర