Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/817

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఫ్రికా ఖండపు భాషలు


“ర*=కొనుట; “ఓ-ర"=కొనువాడు. 'షిల్లక్' (Shilluk) భాష: 'బుగో' =గాలి తిత్తులను ఒత్తుట. 'ఓ-బుక్'= గాలి తిత్తులు.

4. బహువచన నామవాచకమును లేక సర్వనామమును చేర్చుటచే నామవాచకముల బహువచనము లేర్పడుట :— 'యు' (Ewe) భాష: 'అటి' = చెట్టు, 'అటి ఓ' = చెట్లు; 'న్యుయర్' (Nuer) భాష: 'చాక్'='టిక్ ' అను ధ్వని; 'కే-చాక్ '= 'టిక్ ' అను ధ్వనులు.

5. నామవాచకములు బహువచనము 'ఇ' లేక 'ఆ' చేర్చుటచే ఏర్పడుట ఇబో (Ibo) భాష' 'ఓ-య' = మనుష్యుడు. 'ఆ-య'= మనుష్యులు; 'ఓ రు' = బానిస ' ఇ-రు' = బానిసలు.

6. నిర్జీవ వస్తువులకు సజీవ వ్యక్తులకు భేదము : సజీవుల విషయములో 'ఓ' అను ఉపసర్గ తరుచు చేర్పబడు చుండును. 'టుయి' (Tui) భాష' 'ఓ-నిపా'=మనుష్యుడు; 'పిల్లక్' భాష: 'ఓ' అనునది ఇతరుల సంతతివారని సూచించును: 'నాయో' = మేనమామ'; 'ఓ-నాయో' = మేనమామ బిడ్డ. వ్యాకరణ రీత్యా స్త్రీ పురుష భేదము లేదు.

7. షష్ఠీ విభక్తిలో ఒక వస్తువును కలిగియున్నవాడు కలిగి యుండబడినదానికి ముందువచ్చును :- 'ట్వి' (Twi) భాష : 'నిపొ=దు ఆ'=ఒక మనుష్యుని బొమ్మ; 'కునామా' భాష: 'ఇలా మాసా = ఇలా యొక్క బల్లెము .

8. విభక్తి భేదము లేదు :- చతుర్థీ విభక్తి (Dative) రూపము 'ఇచ్చుట' అనుక్రియచే పరివృతమై యుండును. 'యు' (Ewe) భాష: 'ఎది గా నో ఫో ఫో 'తండ్రికిచ్చు ధనము కోరెను' = అతడు తండ్రికొరకు ధనము కోరెను.

9. తర్వాతచేర్పబడు ప్రత్యయములు (Post Positions) అనగా స్థలమును సూచించు నామవాచకములు విభక్తి ప్రత్య యములకు బదులుగా వాడబడును; 'యు' (Eve) భాష: 'అటిటా'= చెట్టుతల= తలమీద; 'నూబా' (Nuba) భాష: 'కాటు'= ఇంటి గర్భము = ఇంటిలో

10. క్రియాసంయోగములు తరుచుగా వాడబడును; 'యు' (Ēwe) భాష: ట్సో నా'=తీసికొని వచ్చి ఇచ్చుట.

11. క్రియ కాలభేదమునుబట్టి మారదు: కాలములు వ్యాకరణ ప్రత్యయములు చేర్చుటచే ఏర్పడును. ప్రత్యయములు చాలవరకు నామవాచకములకు గాని, క్రియలకుగాని సంబంధించియుండును. 'ట్వి' (Twi) భాష: 'బా' ('బయా' నుండి) వచ్చుట చేర్చుటచే ఏర్పడును; 'నూబా' (Nuba) భాష: 'బై' = వచ్చుట; చేర్చుట చే భవిష్యత్తు ఏర్పడును.

12. ఓష్ఠ్యకంఠ్యములు (Labia Velar) అగు 'క్ప' 'గ్స్' అనుధ్వనులు సూడానిక్ భాషలలో తరుచు వినవచ్చు చుండును.

13. పెక్కు పదధాతువులు సమానముగా నుండును; విభాగములు :- భూగోళ స్థితిననుసరించి సూడానిక్ వర్గమును మూడు అంతర్విభాగములు చేయవచ్చును: 1. తూర్పు శాఖ 2. మధ్యశాఖ 3. పడమటిశాఖ.

తూర్పుశాఖ :- వీనిలో అధిక సంఖ్యాకములు నిలోటొ, సూడానిక్ భాషలుగా ఉన్నవి. షిల్లక్, డిన్కా, నూయర్ (Nuer), నూభా (Nuba) వీనిలో కొన్ని భాషలు.

2. మధ్యశాఖ : 30° తూ. రేఖాంశమునుండి 10° తూ, రేఖాంశము మధ్య ఈ భాషలు మాటాడబడు చున్నవి. డెలఫోస్ (Delefosse) వీనిని ఆరు అంతర్విభాగములుగా చేసియున్నాడు. (1) నైల్-కాంగో వర్గము (2) ఉబంగి (Ubangi) వర్గము. (8) పరీ. వడ్డే వర్గము. (Shariwadai) (4) షరీవర్గము (Shari) (5) నైగర్ ట్షాడ్ వర్గము (Niger-Tshad) (6) నైగర్. కేమరూన్స్ వర్గము. (Niger-comeroons)

3. పడమటి సూడానిక్ శాఖ  :- వీనిని గూర్చిన వివరములు మనకు బాగుగా తెలియును. ఇవి ఈ క్రింది అంతర్విభాగములుగా చేయబడినవి. (1) క్వా' (Kwa) భాషలు; వీనిలో చాల పదధాతువులు ఒక హల్లును. ఒక అచ్చును కల్గియున్నవి. ఉ॥ ఆకాన్ (Akan) భాష 'క' = ఉండుట; 'వు' = మరణించుట, సంబోధ ప్రథమా విభక్తి ప్రత్యయములను (Vocative) మరియు అనునాసికములగు ప్రత్యయములను ముందు చేర్చుట ఇందు క్రియలనుండి నామవాచకము లేర్పడును.

2 బెనూక్రాస్ నదీభాషలు  : సూడానిక్ బంటూ సరిహద్దులలో నుండి, వీనిలో కొన్ని ఈ వర్గముల రెండింటి