ఆఫ్రికా ఖండపు భాషలు
వచ్చిన తెల్లవారు భూమి నాక్రమించుకొనుట మిక్కిలి తీవ్రమైన సమస్యగా పరిణమించినది. (బ్రిటిషు) ఉగాండా ఆఫ్రికా యొక్క పరిపాలన విషయమున ముందంజవైచినది. అచ్చట దేశీయ న్యాయస్థానములకు ఎన్నదగినంత న్యాయాధికారము (legal power) కలదు. టాంగనీకాలో బ్రిటిషువారు ఒక శాసనముద్వారా దేశీయ ప్రజా సమూహమునకు తగినంత ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రము నొసంగియుండిరి. 46 వేల మంది ఆసియావాసులు (ముఖ్యముగా భారతీయులు) వచ్చి స్థిరపడుట టాంగనీకాలోని సాంఘిక పరిస్థితిని కొంతవరకు క్లిష్టము కావించినది. ఉత్తర ప్రదేశములతో పోల్చినచో ఉత్తర రొడీషియాలో తెల్ల వారి సంఖ్య చాల తక్కువే. వారు గని పరిశ్రమలందు మగ్నులై యుందురు. దక్షిణ రొడీషియాలో తెల్ల వారి సంఖ్యకంటే దేశీయుల సంఖ్య 20 రెట్లెక్కువ. బసుటోలాండు, బెచునాలాండు, స్వాజిలాండు అను ప్రదేశములం దొక్కొక్కచోట ఒక్కొక్క కమీషనరు కలడు. అతడు దక్షిణాఫ్రికా హైకమీషనరు ద్వారా బ్రిటిషు ప్రభుత్వమునకు బాధ్యత వహించి యుండును.
మధ్య కాంగో ప్రదేశమున బెల్జియనుకు విస్తృతమైన భూభాగము కలదు. అందు ఖనిజ జంతు సంపద విస్తారముగా కలదు. అచ్చట పామ్ నూనె, కాఫీ, కోకో, పంచదార, రబ్బరు, కోపలీ మున్నగునవి కూడ లభ్యములగును.
ఉత్తర ఆఫ్రికా యందలి ఫ్రెంచి రక్షిత స్థలములు మిక్కిలి సంపన్నములై నవి. ఆల్జీరియాలోని ఖనిజ వృక్ష సంపదలు ముఖ్యముగా ఫ్రాన్సున కెగుమతి చేయబడు చున్నవి. ప్రతి సంవత్సరమును రెండు మిలియనుల టన్నుల ఇనుప యినుక ఫ్రాన్ సునకు ఎగుమతి కావలయుట ఆల్జీరియాపై ఫ్రాన్స్ సునకు గల గొప్ప ఆకర్షణకు కారణము,
ఆఫ్రికాలో పోర్చుగీసువారికి మూడు ప్రదేశములు కలవు. అవి దూర పశ్చిమాఫ్రికాలోని పోర్చుగీసుగినియా వాయవ్య భాగము నందలి అంగోలా, తూర్పు ఆఫ్రికా యందలి మొజాంబిక్. అంగోలాలో యూరోపియనుల స్థిరనివాసమునకు తగిన శీతోష్ణ స్థితిగల ఉన్నత ప్రదేశము కలదు.
జి.స
ఆఫ్రికా ఖండపు భాషలు :- ప్రధాన భాషలు - వర్గీకరణము : ఇటీవలి కాలమున వలస వచ్చిన ఐరోపావారిని వదలి పెట్టినచో ఆఫ్రికా ఖండములోని ప్రజలను నాలుగు ప్రధాన జాతులుగా విభజింపవచ్చును.
1. పిగ్మీ - బుష్ మన్ 2. నీగ్రో 3. హెమిటిక్ 4. సెమిటిక్. వీరికి సంబంధించి ఆఫ్రికా ఖండపు భాషలను కూడ నాలుగు వర్గములుగా విభజింపనగును. కాని యిందలి నీగ్రో వర్గము 1. సూడానిక్ 2. బంటు అని తిరిగి రెండు అంతర్వి భాగములుగా తరువాత విడివడినది,
ఇట్లు ఆఫ్రికా ఖండ భాషలు ఐదు వర్గములుగా విభజింపవచ్చును :- 1, బుష్ మన్ 2. సూడానిక్ 3. బంటు 4. హెమిటిక్ 5. సెమిటిక్.
స్ట్రక్ (struck) యొక్క వివరణ ననుసరించి, ఆఫ్రికా భాషల సంఖ్య ఈ విధముగా నున్నది :—
(1) బుష్ మన్ వర్గము: 11 భాషలు (2) సూడానిక్ వర్గము: 264 భాషలు (3) బంటువర్గము: 182 భాషలు (4) హెమిటిక్ వర్గము : 47 భాషలు (5) సెమిటిక్ వర్గము : 10 భాషలు.
పెక్కు భావలు కొలది వైశాల్యముగల ప్రదేశములో మాత్రమే మాట్లాడబడుచున్నవి. సుమారు 12 భాషలు మాత్రము 10 లక్షల కంటే ఎక్కువ మందిచే మాట్లాడ బడుచున్నవి.
ప్రత్యక్షోపయోగము ననుసరించి, ఈ క్రింది ఆఫ్రికా భాషలు తక్కినవాని కంటే ఎక్కువ ముఖ్యమైనవిగా ఉన్నవి :- - 1. సెమిటిక్ భాషలు : అమ్ హరిక్ అరబిక్ 2. హెమిటిక్ భాషలు: హౌసా 3. బంటు భాషలు: గండా, కికు యూ, కాంగో, లుబా-లులువా, మ్యుండు (Mbundu), న్గాలా (Ngala), న్యాన్జా, సుకుమాన్యాంవెజీ, రుఆన్డా రున్డీ, సోథో- పెడిఛ్వానా, స్వాహాలీ, స్వీనా- కారన్గా న్హా ఓ (Swina - Karanga - Ndao), జులూ - క్సో సా 4. సూడానిక్ భాషలు : ఆకాన్, డిన్కా - నూయర్, ఎఫిక్ - ఇబిబియో. యు - ఏన్ హోదహోం, ఇబో, కనూరీ, క్పెల్ - మెండ్, మాలిన్కే డ్జురా - బంబారా, మోసీ - డాగోమ్బా, నూ పేగ్యారీ, టెంనె (Temne), వోలోఫ్, యోరుబా, జన్డే. -