ఆనువంశికము
దాయకములైనచో మార్పుగల సంతతి యంతయు అభివృద్ధి చెందును. మార్పు నష్టదాయకమైనచో సంతతి
క్షీణింప నారంభించును. ఇట్టి సృజన ఉత్పరివర్తనములు అనాదినుండి జీవులలో సంభవించుచు వచ్చినవి. కావుననే
జీవము కాలక్ర మేణ ప్రపంచమునందు అభివృద్ధి చెందుచు పరిణామము పొందినది. ఇట్లు జరుగు ఉత్పరివర్తనములు
వాతావరణములోని మార్పులవలన నేమి, ఆహారము వలననేమి ప్రకృతి సిద్ధముగ జరుగుచుండును. కాని తరుచుగా మారవు. మార్పు సంభవించినపుడు మాత్ర మొక క్రొత్త తెగను సృష్టింపచేయును. ముల్లర్, స్టాడ్ లర్ అనువారలు పరిశోధనములు జరిపి ఉత్పరివర్తనములు క్ష -కిరణముల (x Rays) మూలమున తేవచ్చునని తెలియజేసినారు. ఇట్టి మార్పులను పరిశోధనముల మూలమున కలుగజేసి పరిణామ వేగమును ఎక్కువ చేయవచ్చును. ఇంతియేగాక ఆహారమునందు మార్పుతో సహితము ఇట్టి సృజన మార్పులు సంభవింపచేయవచ్చునని తెలిసినది. ప్రతి సృజని సూచించు గుణము దాని వలన జరుగు రాసాయనిక ప్రతిక్రియకు అనుగుణముగ నుండును. దీని నాధారముగా జేసికొని ఈగలయందు స్పర్శసూత్రము (Antenna) లేక యుండు గుణమును విటమిన్ బి ఆహారముగ నిచ్చి సృజనియందు స్పర్శసూత్రమును (Antenna) పెంచు గుణముగలదానినిగా మార్చగలిగినారు.
లైసింకో (Lysenko) : మెండెల్ సిద్ధాంతములు ప్రపంచమంతట వ్యాపించి పరిశోధింపబడినవి. రష్యాలో సయితము సృజన శాస్త్రము ఇతర దేశములతో సరి సమానముగ అభివృద్ధి చెందినది. ఈ శాస్త్రమునందు పలువురు శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతమున ప్రఖ్యాతిగాంచినారు. వీరిలో వావిలోవు (Vovilov) అనువాని పేరు మొదట పేర్కొనవలసి యుండును. కాని దాదాపు 1930 నుండి రష్యాదేశమున మెండెల్ సిద్ధాంతమునకు వ్యతిరేకత మొదలయినది. దీనిని ప్రతిపాదించినవాడు లైనింకో. ఈతడు మి ష్యూరిన్ అను నొక ఉద్యానపాలకుని (Horticulturist) అనుభవముల నాధారముగా చేసికొని మ్ఒక కొత్త సిద్ధాంతమును ప్రవేశ పెట్టెను. దీనిని మిష్యూరిన్ సిద్ధాంతము అందురు. ఈ సిద్ధాంతమునకు రష్యా దేశమున నేర్పడిన గొప్ప ప్రచారము కారణముగా ఇది మెండెల్ సిద్ధాంతము యొక్క స్థానము నాక్రమించినది. మిష్యూరిన్ అను వాడు వారసత్వమును గురించి లామార్కు యొక్క అభిప్రాయముల ననుసరించినాడు. దానినే లై సింకో బలపరచి ప్రచారములోనికి తెచ్చెను. మిష్యూరిస్ కు వృక్షవర్ధి ప్రసంకరణము (Vegetative hybri- disation) నందు ఎక్కువ నమ్మకముండెను. ఒక జాతి వృక్షము యొక్క కొమ్మను ఇంకొకజాతి వృక్షము యొక్క కొమ్మతో అంటు పెట్టినచో (Grafting) ఆ అంటు నందు రెండవదాని ప్రభావము పడును. ఈ ప్రభావము అంటుచెట్టు యొక్క సంతతిలో కూడ కనబడునని తెలిపెను. ప్రభావ గుణములు మొదట అస్థిరములుగా నుండును. తరువాత గట్టిపడును. గుణములను మార్చుశ క్తి వాతావరణమునందు గలదని చాటెను. మిష్యూరిన్ సిద్ధాంతములో ఆనువంశికము విషయమున ఒకజీవిపై బడు వాతావరణ ప్రభావము కొన్ని తరముల (Generations) వరకు కొనసాగుటచే స్థిరపడిపోవును. ఈ ప్రభావములో లేక గుణములలో మార్పు ఒక్క పునరుత్పత్తికణము (germ cells) లందు జరుగుటవలన గాక దేహ కణములన్నిటి యందును అనగా దేహమునందు జరుగు ఉపచయాపచయ క్రియలన్నిటియందును (Metabolic activities) మార్పు సంభవించుట వలన సంప్రాప్తమగు నవి చెప్పబడినది. ధాన్యములలో వసంతీకరణ (Vernalisation) పద్ధతిచే శీత కాలపు (Winter) జాతిని వసంతకాలపు (Spring) జాతిగా మార్చవచ్చును. ఈ విషయము ఒక సంతతివరకే వసంతీకరణ (Vernalisation) పద్ధతితో మార్పులుకల్పించి ఆనువంశికముగా ఈ క్రొత్త గుణముండునటుల చేయవచ్చునని తెలుపబడినది. ఇంతేగాక ఇదే పద్ధతిలో గోధుమలను నీవారము (Rye) గా గూడ మార్చవచ్చునని అనబడెను. ఇంతవరకు ఇట్టి పరిశోధనములు రష్యావరకే పరిమితములై యున్నవి. రష్యనులు ప్రకటించినట్టి ఫలములను పొందజాలకుండుటచే ఇతర దేశస్థులు పై సిద్ధాంతములు శాస్త్రవిరుద్ధమని తిరస్కరించినారు.
ఆర్థిక ప్రాముఖ్యము (Economic Importance) : ఈ శాస్త్ర పరిశోధనముల ఫలితముగ ప్రపంచమునందు గల జంతువుల యొక్కయు, వృక్షముల యొక్కయు సంత