ఆనువంశికము
యుండుట సంపృక్తము (లింకేజ్ Linkage) అనబడును. ఈ కలిసి యుండుటను సామాన్య పద్ధతిలో వేరు జేయుటకు వీలుగారు. దీనినే పన్నెట్, బేట్ సన్ మొదలగువారు బలపరచినారు. వీరి పరిశోధనములందు ' ఫలమక్షికము ' (Fruit fly) అను ఒక విధమగు ఈగను పరిశోధన ద్రవ్యముగ గైకొన్నారు. ఇందులో తెల్లని కండ్లతోబాటు పసుపు పచ్చని దేహముగల వాటిని, ఎఱ్ఱని కండ్లతోబాటు బూడిద వర్ణపు దేహము గల వాటితో సంపర్కము గావించినచో అన్నియు ఎఱ్ఱని కండ్లు, బూడిదవర్ణపు దేహము గలిగియున్న సంతతి లభించెను. అనగా ఈ రెండు గుణములు ఒకే పిత్య్ర సూత్రము పైనుండుటచే ఇట్లు సంభవమగును. అట్లుగాకున్న బూడిద వర్ణమును, పసుపు వర్ణమును వేరు వేరుగా సంపర్కము గావించినచో పసువువర్ణమే వ్యక్తమగును. కానీ ఇచట ఎరుపురంగు కండ్లతో కలిసియున్నందున బూడిద వర్ణము వ్యక్తమైనది. ఇట్లే మానవులయందు అధిరక్తస్రావము (Haemophilia) అను రోగమునకు సంబంధించిన జీన్
ఎల్లప్పుడు పురుషులందు 'X' అను లింగజాతి పిత్య్ర సూత్రముతో కలసియుండును. ఇది బలీయమైనదికాదు
కావున 'X' పిత్య్ర సూత్రము వెంబడి స్త్రీ సంతతి జేరును. అచట అది వ్యక్తముగాదు. ప్రచ్ఛన్న ముగా నుండిపోవును.
రెండవసారి స్త్రీయె రోగముగల 'X' సృజనిని తన మగ సంతతి కిచ్చును. అప్పుడది వ్యక్తమగును. ఇట్టివానిని
లింగసంపృక్త పిత్ర సూత్రము అందురు.
పరో సగమనము (Crossing over) : ఫలదీకరణమునకు పూర్వము పునరుత్పత్తి కణములలో పిత్య్రసూత్ర సంఖ్య ఎల్లప్పటికంటే సగముగా నుండును. ఫలదీకరణము తరువాత సంఖ్య పూర్తి యగును. పునరుత్పత్తి కణముల అభివృద్ధికాలమునందు ఒక విభజన పిత్య్రసూత్ర సంఖ్యను సగముచేయును. ఇది మియోసిస్ (meiosis) అర్థసూత్ర భాజనము అనబడును. ఇట్టి విభజన జరుగునప్పుడు ఒకప్పుడు సరూప పిత్య్రసూత్రములు (సిమిలర్ క్రోమో జోమ్స్) జతలుగా జేరుకొనును. దీనిని సై నాప్సిస్ (Synopsis). యుగ్మానుబంధముందురు, ఒక్కొక్కప్పుడు ఇవి మెలిపడును (twist). ఆ మెలివడినచోట్ల యందివి విరిగి ఒకదానితో నొక్కొక్కటి అతుకుకొనిపోవును.
పటము 4
1. క్రోమోజోము 2. క్రోమోజోమ్సు 3. క్రోమోజోమ్సు నైనాప్సిసుకు పూర్వము మెలివడు నైనాప్సిన్ తరువాత
దీనివలన పిత్య్రసూత్రము పైనున్న గుణముల క్రమము మారును. ఈవిధముగా ముందుగా తల్లివై పునుండి వచ్చిన పిత్య్ర సూత్రము పైనున్న గుణములు తండ్రివై వునుండి వచ్చిన పిత్య్రసూత్రములతో కలిసిపోవును. అట్లే రెండవ దానిలో మార్పువచ్చును.
ఈవిధముగ పరోపగమనముచేత సంతతియొక్క గుణ లక్షణములలో మార్పులు గలిగి, ఒకదానితో నింకొకదానికి చాల భేద మేర్పడును. ఒక జాతికి చెందిన రెండ జీవులలో లేక ఒకే తల్లి సంతతియందు భేదముండుటకు ఇదియే కారణభూతమై యున్నది.
ఉత్పరివర్తనములు (Mutations): సృజన (Gene) శాస్త్రము క్రమక్రమముగా ప్రపంచమంతట ప్రఖ్యాతి గాంచుటయే గాక పరిశోధనములకు కేంద్రమై నిలిచినది. సృజని (Genes) అనువంశికము (Heredity) నకు భౌతి కాధారము (Physical Basis) అను భావము ధ్రువతరమైనది. కదళీ మక్షికజాతి (Drosophyla) ఈగయందు పిత్య్ర సూత్రము ' యొక్క ఉనికి, ఆకారమును గూర్చి పూర్తి పరిశోధనలు జరిగినవి. ఈ పరిశోధనముల మూలమున అప్పుడప్పుడు ఒక పిత్య్ర సూత్రములోగల సృజనుల యందు అకస్మాత్తుగా మార్పు (Sudden change) వచ్చునని డీ వెరేస్ (D'Vries) అను నాతడు కనుగొనెను. ఇట్టి మార్పును ఉత్పరివర్తనము (Mutation) అందురు. ఇట్టి మార్పులవలన జీవి యొక్క స్వభావము, ఉనికి మొదలగ వాటియందు కొన్ని మార్పులు సంభవించును. ఈ మార్పులు వాతావరణమునకు అనుకూలముగనుండి లాక్