ఆధునిక వాస్తువాదములు
ణామమే భిన్న రీతులలో అమెరికాలో జరిగినది. ఐరోపా వాస్తువుయొక్క ప్రభావము గ్రోపియస్, బ్రీవర్, లెస్కేజ్, నూటరా అనువారి ద్వారమున అమెరికా యొక్క నిర్మాణ చైతన్య సంప్రదాయముపై పడినది. అమెరికాలోని చైతన్య వాస్తు ప్రభావము గూడ ఐరోపా వాస్తువుపై అధికముగనే ప్రసరించినది.
ప్రఖ్యాత అమెరికన్ వాస్తుకారుడగు ఫ్రాంక్ లాయడ్ రైట్ (Frank Lloyed Wright) అను నాతనిచే చైతన్య వాస్తువు (Organic Architecture) అను పదముపయోగింప బడినది. పెక్కుమంది చారిత్రకులు, విమర్శకులు ఈ పదమును నిర్వచించుటకు ప్రయత్నించిరికాని దీనిని పరిపూర్ణముగా నిర్వచించిన వారెవరును లేరు. పర్యవసన్నమైన వాస్తువు అనిర్వచనీయముగా నుండుటే సహజమేమో! చైతన్య వాస్తువును అనుష్ఠించు వాస్తుకారుల కళను, వారి దృష్టిని, పరిశీలించుట ఎక్కువ ఉపయోగకరముగ నుండగలదు. జీవవాస్తువు వాస్తు సౌందర్య తత్త్వమునగాక దీని నారాధించువారి మనస్తత్త్వమునందును, వారి సామాజిక జ్ఞానమునందును, వారి మానసిక ప్రవృత్తులందును, చక్కని స్థాన మేర్పరచు కొన్నది. అమెరికా, ఐరోపా వాస్తుకారులు వాస్తువు నెడ కలిగియుండు మౌలికదృష్టినిబట్టి చైతన్య వాస్తువననేమో నిరూపింప వచ్చును. ఐరోపా దేశస్థుడైన ఒక రైతు తన ఇంటిని నిర్మింపవలసి వచ్చినపుడు అతడు దానిని ఘనరూపము గనో, లేక మరొక రేఖాగణిత స్వరూపముగనో భావించును. ఈతడు తన యవసరముకన్న పెద్దగా గృహమును నిర్మించును. కొన్ని గదులను తన సంతానము పెరిగినప్పుడు భవిష్యత్తులో వాడుకొనుటకై మూసియుంచును. తన ఇంటి పెరుగుదల ఒక నిర్ణీత క్రమమున ఒక రేఖా గణిత స్వరూపమును కలిగియుండవలెనని ఈతని యభి ప్రాయము. ఇక నొక అమెరికా కార్మికుడు దీనికి భిన్నముగా వ్యవహరించును. ప్రథమమున నాతడొక గదిని మాత్రమే నిర్మించి తన యవసరమును బట్టి కాలము గడచినకొలది దానిని విపులీకరించుచు ఒక గదికి మరొక గదిని చేర్చుచు, పోవును. ముందు పేర్కొనినది సిద్ధాంతితము లేక నిర్జీవవాస్తువు. రెండవది పరిణామ శీలము, సహజ వికాసవంతము, చైతన్య సహితము (Organic) ఆని చెప్పదగును, బాహ్య స్వరూపములన్నియు అంతరములైన ప్రదేశముల కనుగుణముగ ప్రభవించినవియే.
పెక్కుమంది విమర్శకులు ప్రకృతికిని, ఫ్రాంక్ లాయన్ రైట్ రచనలకును పోలికలను అన్వేషింతురు. ప్రకృతిపై దృష్టి నుంచుట మంచిదేకాని ప్రకృతిని (Art Nonvean) నవకళారీత్యలంక రణము అనుకరించునట్లు- ఇందు అనుకరణము తగదు. ఇటులే భవనములకును, మనుష్యులకును పోలికలు చూపుదురు. కాని యివి రూపక ప్రాయములు మాత్రమే ; భవనములు భావస్ఫోరకములును, మానసిక స్థితులను, మనోగతిని సూచించునవియు కావలెనను సిద్ధాంతము క్షీణ వాదమునే ప్రదర్శించును. చైతన్య వాస్తువునం దిట్టి ఆత్మేతర విషయ విచారణలేదు. దీనికొక గతి శీలము, చలన భావము కలవు. ఇవి సాధింపబడినవి కూడ. కాని ఈగతిశీలము దుర్భలానుభూతి సూచకమగు రేఖామాత్ర చిత్రాలంకరణ రీతులచే సాధితముకాదు. ఈ భవనములందు నివసించి, వానినుపయోగించు మనుష్యుని వాస్తవికావసరములను మూలముగా జేసికొన్న ఏర్పాటులచే ఇది సాధ్యమైనది. "గదికిగాని, ఇంటికిగాని,నగరమునకుగాని మానవుని సంతోషమును దృష్టియందుంచుకొని ప్రత్యేకపుటేర్పాట్లు గావించిననే యది జీవనాస్తువగును. ఈ సంతోషము మానవుని భౌతిక, మన స్తత్త్వ, ఆధ్యాత్మిక సంబంధములలో నేదైన కలిగినది కావచ్చును. అందుచే నిది ఆలంకారిక కల్పన పైగాక సామాజిక అవసరములపై నాధారపడినది. మానవ కరుణాశీలమగుటకు బూర్వము, నిర్మాణము మానవ స్వభావమును కలిగి యున్నపుడే దానిని మనము జీవ వాస్తు వనగలుగుదుము." భవనము యొక్క అంతర సన్నివేశము మిక్కిలి ముఖ్య మైనది. ఇది వెచ్చదనము కలిగి సొగసయి, గంభీరతగలదియై యుండవలెను. అవసరమునుబట్టి మారుటకు వీలు కలదై, విశ్రాంతికి రావలమై ఉచితాలంకృతమై యుండదగును, వీలున్న యెడల ఉల్లాస ప్రదమై, వలసినట్లు దిద్దుకొనుట కత్యంత ముపయుక్తమై యుండునట్లు ఉండదగును.
ఫ్రాంకు లాయడ్ రైట్ నకు బూర్వము లూయీ సల్లివాన్ (1856-1954) అను నాతడు వాస్తువునకు అకృత్రిమ మైనదియు, సులభగ్రాహ్య మైనదియు,