Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/756

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదిమజాతుల సంస్కృతులు


తము, నృత్యము, కవనము నాటకము, వాఙ్మయము ఇవన్నియు అతి ప్రాచీనకాలపు సమాజములందును, నాగరకతా విశేషముతో కూడిన సమాజములందును గూడ మరికొన్ని కళారూపములై ఉన్నవి.

మానవుడు వృద్ధిపొందుచున్నకొలది మానవాతీతములగు భౌతిక అద్భుత దృశ్యములు, రూపములు మొదలగు వాటితో సంబంధము పొందుచున్నాడు. వాటికి గూర్చి తెలిసికొనుటకు ప్రయత్నించుచున్నాడు. వాటిని తన ఆధీనములో (చెప్పుచేతలలో) నుంచుకొనుటకో వాటిని ప్రసన్నము చేసికొనుటకో ప్రయత్నించు చున్నాడు. ఆదిమానవుడు ప్రకృతి పరిణామములన్నియు దుష్టశక్తులచే పరిపాలితము లని విశ్వసించి, వాటిని తన చెప్పుచేతలలో నుంచుకొనగోరును. ప్రతికి ప్రతి (like produces like) జనించు నను సిద్ధాంతమును పురస్కరించుకొని భౌతిక సంఘటన (Natural phenomina) లపై ఆధిపత్యము వహించు శక్తులను తన యాజ్ఞానువర్తులనుగా చేసికొనుటకు యత్నించును. ఈ సంబంధమున సంకేత విధానము (Symbolism) ప్రముఖపాత్రను వహించుచున్నది. సూర్యుడు, వర్షము, మేఘములు, పంటలు, భూసారము (Fertility), ఉత్పత్తి (Growth) మొదలగు వాటి సంకేతరూపములు ముఖ్యములైనవి. ఇందు వలన, వర్షము కురియించు ఇంద్రుని (Sky-God), విత్తులకు దోహదమిచ్చు భూదేవతను, పైరులను పండింపజేయు సూర్యదేవతను, వీరేగాక ధాన్యదేవతను, ఉత్పత్తిదేవతను ఆదిమజనుడు పూజింపవలసి యుండెననుట స్పష్టము. నైరృతి ఆఫ్రికాలోని "నామా హటంటాట్సు" జాతివారు (Nama Hottentots), ఆరిజోనా ప్రాంతమందలి “హోపి" జాతివారు (Hopi), ఛోటానాగపూర్ ప్రాంతమందలి "ముండాహో” జాతులవారు వర్షపాత దృశ్యము ననుకరించుటచే వర్షము పడునట్లు చేయుదురు. దేశీయ సమాజముల అన్ని రంగములయందును కర్మకాండ వ్యాపించి యుండును. వేట, కళ, విహారములు ప్రధానముగ కర్మ కాండతో సంబంధించియుండును. విత్తులు నాటిననాటి నుండి పంటలకోత ముగియువరకు అన్ని సందర్భము లందును మతకర్మలు కలవు. మనుజుని యొక్కగాని, సమాజము యొక్కగాని జీవితరంగములందలి ప్రధాన ఘట్టములందు మతకర్మ ప్రత్యక్షమగుచుండును. కొన్ని తెగలలో జబ్బువచ్చిన యెడల అది సహజకారణ. సంభవమగు వ్యతిక్రమమని భావించక, క్షుద్రదేవతా ప్రభావమలితమని భావించెదరు. దక్షిణ పెనామాలోని "శాన్ ల్లోను ఇండియను”లలో (San Blఒs Indians), ఒక వ్యక్తి రోగియగుటకు వానియొక్కగానీ, ఆమెయొక్క గాని ఆత్మను లేక పర్బాను (Purban) ను రాక్షసులు దొంగిలించుటయే కారణమని తలంపబడును. చెరపట్టబడిన ఆయాత్మను మరల సంపాదించుట "వైద్యుడు - పురోహితుడు" అగు వాని కర్తవ్యమైయున్నది. అదే విధముగా మధ్య ఆస్ట్రేలియాలో నివసించు "అరాండా" (Aranda) జాతివారు సహజముగా మృత్యువు వాతబడుట ఊహింపజాలరు. అదంతయు శత్రువు యొక్క మంత్ర తంత్ర ప్రభావమే యని వారి నిరంతర దృఢవిశ్వాసము. మంత్రప్రభావమున మరణ మాపాదిల్ల జేయుటకు వారి కెన్నో మార్గములు తెలియును.

అయితే మంత్రవిద్యకు మరణము కల్గించుటకంటె ఇతరప్రయోజనములును కలవు. ఉదాహరణముగా రోగములను కుదుర్చుట, భార్యను సంపాదించుట, నేరస్థులను శిక్షించుట, స్త్రీలను లొంగదీయుట పేర్కొనవచ్చును. సర్ బాల్డ్విన్ స్పెన్సర్ దక్షిణాస్ట్రేలియా అరాండా లనుగూర్చి మాట్లాడు సందర్భమున "జీవయాత్రయందు తనకు ప్రముఖముగా నుండు ప్రతి విషయము - అది ఆనందాత్మకముగానీ, దుఃఖాత్మకముగాని, మంచిదిగాని, చెడ్డదికాని—నిస్సంశయముగ మంత్రవిద్యకు సంబంధించినదే. కామము, వరదలు, ఋతుక్రమమున జంతువృద్ధి, భూమిలోనుండి చెట్లు అద్భుతముగా మొలచుట, చివరకు తనయొక్క జనన, మరణవిషయములు, తనచుట్టునుండు జనానీకపు జనన మరణ విషయములు - ఇవన్నియు మనము భావించినట్లు సహజ కారణ ఫలితములుగాక ఏదో యొక రూపమయిన మంత్రవిద్యా ప్రభావమున జనించినవే యని ఆతని మనో నిశ్చయము" అని చెప్పిన మాట మిక్కిలి సత్యము. ఈ వాక్యాలు ప్రపంచములోని పెక్కు తెగలకు అన్వయించగలవు.

రాజకీయ పరిపాలనా విధములు : రాజకీయ పరిపాలనా విధానములలో పెక్కు ఖండములందును, కొన్ని నాగరకతా (సభ్య) మండలముల యందుము కూడ భిన్న