Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/748

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆటవిక నృత్యరీతులు


మెడలందు గవ్వల మాలలను, చెవులకు గజ్జెల వెండి జూకాలను ధరించి, లంబాడీభాషలో గీతములను పాడుచు చప్పట్లు తట్టుచు గుండ్రముగ తిరుగుచు, వీరు చేయు నృత్యము. మన దేశములో స్త్రీలు జేయు కుమ్మి, బతకమ్మలాట, గొబ్బి మొదలైన జానపద నృత్యములకు పోలియుండును. వీరి నృత్యమందు పెద్ద పెద్ద డప్పులు మాత్రము సుగాలీ పురుషులు వాయింతురు.

'వర్లీ' తెగవారి నృత్యరీతులు : వీరు మహారాష్ట్ర ప్రాంతములోని అరణ్యములలో నివసించువారు. వీరి నృత్యము లన్నింటిలో 'ఆత్మయాత్ర' నృత్యము ముఖ్యమైనట్టిది. చనిపోయిన మనుష్యుని భూమిలో పూడ్చిపెట్టి జీవాత్మ నదులను, అరణ్యములను దాటి అలసటలేకుండ ప్రయాణము సాగించి పరమాత్మను జేరుటకు, ఆ సమాధి చుట్టు స్త్రీపురుషులు చేరి, నృత్యగీతములతో సాగనంపుదురు వారి కంఠములలో విషాదము ప్రతిధ్వనించు చుండును. వారి అంగచలనము అతిసున్నితమై, విలంబిత లయగలిగి కరుణరస మొలుకుచుండును. ఇట్లు సంధ్యా సమయము వరకు నృత్యముసల్పి వారిండ్లకు బోవుదురు.

'కోలుల' నృత్యములు  : వీరి నృత్యము లన్నింటిలోను వరికోతల నృత్యము ముఖ్యముగ చూడదగినది. వీరు ముఖ్యముగా ఛోటానాగపూరునకు సింగభూమికి మధ్య భారతమునకు చెందిన అరణ్యములలో నివసించెదరు. వీరికి నృత్యమనిన అత్యంత ప్రీతి. ఈ తెగవారందరు ఒక చోట గూడినప్పుడుగాని, ఒక వల్లే వారింకొక పల్లెలోని తమ బంధువులు జూడపోయినప్పుడుగాని నృత్యగానములతో కాలము గడుపుదురు. వీరి నృత్యములు విలంబితముగా, స్వాభావికమై అతి సుకుమారముగా నుండును.లయ తాళములందు వీరికి మంచి ప్రావీణ్య మున్నది. వీరి వరికోతల నృత్యము హృదయరంజక మైనది,తాళ గతి ననుసరించిన వేణుగానముతో స్త్రీలు వరుసగా నిలిచెదరు. వారొక గీతము నాలపించుచు లయతాళముల ననుసరించి అడుగులు వేయుచు, అందరు ఒకేసారి వంగి చేతులతో కొన్ని ముద్రలు ప్రదర్శింతురు. ఆ ప్రదర్శనము అచ్చముగా పొలములలో వరినారు నాటినట్లుగా మనకండ్లకు తోచును. తరువాత కోయుట, కోసిన పైరు కట్టగట్టుట, కొట్టి దులిపి కుప్పలు వేయుట మున్నగునవి తాళ లయల ననుసరించి మధురముగా పాడుచు అభినయింతురు. ధాన్యమును వేర్పరచి, చేటలతో చెరుగుచు శుభ్రపరచి, కుప్పలుగా బోసి యేడాదిగా నొనర్చిన ఫలితమును కన్నులార జూచి, ఆనందముతో త్వరితగతిని, నాట్యమాడుదురు. ఇట్లు వారు వర్షఋతు ప్రారంభమున పొలము దున్నుట మొదలు ఆ ఏటి కృషిఫలిత మైన క్రొత్తవడ్ల విందారగించు వరకును జరిగెడు దృశ్యములను, వివిధ ఘట్టములుగా గైకొని నృత్యమాడుదురు.

కోరువాల నృత్యము  : మృదంగములు రణభేరీలవలె గర్జించుచుండగా పురుషులు చక్రాకారముగా నిలబడెదరు. స్త్రీలు, ఆ పురుషుల మధ్య మఱోక వలయముగా నిలువబడెదరు. వారొకరినొకరు అంటి పెట్టుకొని చుట్టుచుట్టుకొని నిద్రించుచున్న పాములవలె నిలబడెదరు.అందరిమధ్యన 'భోర్ గస్' కూర్చుండి తన తంత్రీవాద్యమును వాయించుచు, పాడుచు నర్తకులకు ఉత్సాహమును కలిగించును. పురుషులు తమ నిడుపైన వెండ్రుకలను ముడివేసి, అందు అమ్ముల నుంచుటచే వారు నృత్యమాడునప్పుడు వారి సిగలు, జడలు వానితో పాటు అమ్ములు లయానుగుణముగా కదలును. వారొకరి చేతుల నొకరు పట్టుకొని గుండ్రముగా తిరుగుచు నృత్య మాడుచుండ చుట్టలుగా పడుకొనియున్న పాములు తాళ లయకు కదులుచున్నట్లు భ్రమగొల్పును.

వీరు 'ఖర్మ' నృత్యము గ్రీష్మఋతువులో జేయుదురు. వర్షములు లేనిచో ఈ నృత్యమును వీరు ప్రతి రాత్రి చేయుదురు. 'ఖర్మ' ఆరాధన నృత్యమగుటచే భగవంతునికి ప్రీతి గల్గించవచ్చునని వారి యుద్దేశము.

'కవురు'లు కోలాటము వేయుదురు. ఏక తారలను చేతులతో పట్టుకొని గీతములను పాడుచు, నృత్యమాడుదురు. వీరి నృత్యములకును పంతాలుల యొక్కయు, కోలుల యొక్కయు నృత్యముల కెట్టి సంబంధము లేదు.

బైగాలు అనువారు'సేల', 'రేవా' అను రెండురకములైన ప్రత్యేక నృత్యములను జేయుదురు. 'సేల' అను నృత్యము బైగా పురుషులు చేయునట్టిది. "రేనా" అనునది బైగా స్త్రీలు చేయునట్టిది. స్త్రీలు ఒకరికిదగ్గరగా ఒకరు నిలబడి, చేతులను మాత్రము పట్టుకొనక ముందుకు