ఆకృతి రచనా సూత్రములు
రోమ్ లోని సెంటుపీటరు యొక్క కేతిడ్రల్ (Cathedral) దీనికొక ఉదాహరణము. దాని నిజపరిమాణమును కనుగొనుటకు కావలసిన లక్షణములు కొరతవడియున్న విధముగా దాని లోపలిభాగము యొక్క ప్రణాళికాకృతి రచన గావింపబడి యున్నది.
వాస్తు రచన చిత్రరచన కంటెను, శిల్పరచన కంటెను న్భిన్నమైనదిగా నున్నది. చిత్రరచన రెండు పరిమాణములతో గూడినది మాత్రమేయై యున్నది. శిల్ప, వాస్తు రచనలు రెండును, మూడు పరిమాణములతో గూడి యున్నవై నను, కొన్ని విషయములలో తిరిగి పరస్పరము వేరుపడునవిగా నున్నవి. వాస్తు రచయిత కట్టడమును నిర్మించుటకు పూర్వము ప్రణాళికలు, తదితరములైన పటములును సిద్ధపరుపవలసియుండును. అట్లే అతడు కట్టడపు వివిధ భాగముల యొక్కయు అంతఃప్రదేశములను పరిశీలింపవలసి యుండును. రచన యొక్క ఈ అంశము వాస్తుకళకు మాత్రమే ప్రత్యేక లక్షణమైయున్నది. ప్రణాశికా రచనను గూర్చియు, ప్రణాళికకును, ఎత్తున(Elevation) కు గల సంబంధమును గూర్చియు ఇప్పుడు పరిశీలింతముగాక ! కేవల ఊహ్యావసరముల దృష్టి తోడను కార్యనిర్వహణార్థకములైన ప్రత్యక్షా వసరముల దృష్టితోడను, ప్రణాళిక యోచింపబడవలసినదై యుండును. నిజమునకు ప్రణాళిక అన్నది ఒక కావలసిన మట్టము లేక మట్టముల వద్ద ఒక కట్టడముగుండా తీసికొనబడిన క్షితిజ సమాంతరమైన (horizontal) భాగము. ఒకే సూత్రావళి ఎట్టి ఆకృతిరచనకై నను వర్తించుచున్నను. ఎత్తు, భూతలదృశ్యము, రంగువేయుట, లేక శిల్పము... వీనిననుసరించి 'ప్రణాళిక' యొక్క అంతర్గత స్వభావము వేరు వేరగుచున్నది. ప్రణాళిక విషయములో దానిని చూచు వానిదృక్పథము కేవలబాహ్యమునకు చెందినదిగా మాత్రమే యుండదు; ‘ప్రణాళిక' అనగా నిజముగా క్రింది అంతస్తు యొక్క ఆకృతి అని అర్ధము; 'వాస్తువేత్త భావన యొక్క సామాన్య ధోరణులను అది ఎల్లప్పుడును వెల్లడించును; అంతేకాక, పై అంతస్తులకు ఆధారముగా నుండగల ప్రయోజనాత్మక భాగములనుగూడ నది వ్యక్తీకరించును. కాని ప్రణాళిక ఒక్కటియే వాస్తువేత్త భావననుగూర్చి సంపూర్ణాభిప్రాయము నిచ్చుటకు సరిపోదు, ఆవరింపబడిన వివిధ భాగములు ఎట్లు కనబడునో అన్న విషయమును, చూచువానికి వివిధ అంతర్భాగములు ఎట్టి అభిప్రాయమును కలిగించునో అన్న విషయమును వాస్తు వేత్త మనస్సులో నుంచుకొనవలసి యుండును. ప్రణాళిక అనగా గోడలు, చెత్త గోతులు (Tooms), వసారాలు మొ॥ వాటిని కాగితముమీద రచింపగా నేర్పడు ఒకానొక మాదిరి రూపము. ఈమాదిరి రూపముకూడ ఆకృతుల విషయములో సమ్మేళనమును, సమత్వ భావమును, కలిగియుండవలయును. కాని ప్రణాళికలు స్వతంత్ర విషయములు కావు. ఎత్తులతోను, విభాగములతోను, (Elevations and Sections) అవి అనుబంధితములై యున్నవి. ప్రణాళికారచనలు కూడ పొందికను కలిగి యుండవలెను. సామాన్యములైన అవిభక్త భాగములను అవి కలిగియుండవచ్చును. అప్రధానములు లేక సహాయార్థకములు అగు ప్రత్యేకావయవములు వాటికి ఉండవచ్చును, లేకపోవచ్చును; లేదా, సామాన్య భాగములు తిరిగి తిరిగి వచ్చు క్రమము, ప్రధానములు మరియు సహాయక అనుబంధములు అను క్రమములో గూడిన పరినిష్ఠితత్వమును కల్గియుండవలెను (Climaxes). స్మారక చిహ్నములుగా నిర్మింపబడెడి కట్టడముల ప్రణాళికలు ఉన్నతస్థాయికి చెందిన విధముగను, మహనీయతా లక్షణముతోగూడిన శైలిలోను, యోచింప బడవలెను. కట్టడము యొక్క అవసరములు జాగరూకతతో పరిశీలింపబడవలెను. మరియు ఆ అవసరముల యొక్క ప్రధానభావమును కల్పించెడి ముఖ్యభాగములకు ప్రణాళికలో ప్రత్యేక ప్రాముఖ్యము నొసంగవలెను. తక్కిన భాగములు దానికి లోబడిన ప్రధానత గలవిగా జేయబడవలెను. సరియగు పరిమాణ సంబంధము నుపయోగించుట, భేదమును చూపుట, ప్రత్యేక ప్రధానతను చూపుట (Accentration) అను లక్షణములను ప్రణాళికను సిద్ధపరచుటలో ప్రణాళికా రచయిత గమనింపవలెను. ప్రత్యేక భాగముల సాధారణ రూపమును, ప్రణాళికలో వర్గీకరణమును, పైనుదహరింపబడిన సూత్రముల సహాయముతో నిర్ణయింపనగును.
కట్టడముల యొక్క బాహ్యభాగములు అంతర్గత రూపముల కొక ఆవరణము మాత్రమే. ప్రణాళికలోని