Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంతర్విద్యుత్ప్రతిష్ఠ హము స్ఖలనము (Leakage) నొందినపుడు, తంత్రులపై నున్న లోహపు తొడుగులు కూడ విద్యుద్వాహకములుగ పనిచేసి, తీవ్రమైన అపాయములకు హేతువులగును. కాని తొడుగు అతుకులవద్ద (Joints) శక్తిమంతమైన బంధనము నేర్పరచి స్ఖలనమువలన కాండ్యూట్ లోని విద్యుత్ప్ర వాహిమ ను త్రెంపులేనిదిగా చేసి, ఏదో ఒక స్థలమునుండి భూసంబంధమును కల్పింపవలెను. దీనివలన లోహపు తొడుగు భూపీడనమునం దుంచబడి (Earth potential) విద్యుత్తు యొక్క ఘాతమునుండి (Electric shock) రక్షణ సమకూరును. లోహపు తొడుగునకు లేక కాండ్యూ టునకు విద్యుత్ప్రేషకముయొక్క ఉత్పాదన స్థానమువద్ద (Entry of the supply) భూసంబంధమును కల్పింతురు. ఒక కొనకు రాగి వాహకముతో బిగింపబడిన భూసంబంధ మును కల్పించు క్లిప్పును (Earthing clip) (చూ.1.22) మరి యొక కొనకు జలవాహక మును (Water supply mains)గాని, భూమినిగాని భూసంబంధమును కల్పించు పళ్ళెమును గాని (Earth- ing plate) కలిపి, భూసంబంధమును కల్పింతురు. భూసంబంధమును కల్పించు క్లిప్పు కల్పించు వాహకముయొక్క ఛేదన విస్తృతి (Cross sectional area) 0.0045 చ. అం (7/0.029 లేక 14 యస్. డబ్ల్యు. జి. లకు తక్కువ పటము 22 భూసంబంధమును కాకుండ లేక రక్షణమును పొంస వాహకముల మంద ములో సగము నుందమునకు తక్కువ కాకుండ గాని యుండవలెను. భూసంబంధమును కల్పించు పళ్ళెము యొక్క వైశాల్యము 1 నుండి 2 చ. అంగుళముల వర కును ఉండవలెను. ఇది కనీసము భూమిలో 6 అడుగుల లోతున తడియైన లేసుతో (Damp lace) బంధింప బడ వలెను. విస్తృత ప్రతిష్ఠాపనములలో ఒకటికన్న ఎక్కువగ భూసంబంధమును కల్పించు పళ్ళెములు ఉపయోగింప బడును. మఱల ఈపళ్ళెముల నన్నిటిని అంతర సంబంధు లుగ చేసెదరు. నియమముల ననుసరించి లోహపుతొడుగు లేక కాం డ్యూట్ యొక్క నిరోధమును; భూమియొక్క విద్యు ద్వారము (Earth electrode) తో సంబంధ ప్రదేశము నుండి సంపూర్ణమైన ప్రతిష్ఠాపనలోని ఏ స్థలమున కుగాని మధ్యగల భూసంబంధమును కల్పించు సీసపు ప్రమాణము యొక్క నిరోధమునుకలిపి ఒక ఓము కంటె మించరాదు. ప్రతిష్ఠాపనములను పరీక్షించుట (Testing electrical Installations).. నియమముల ననుసరించి ప్రతిష్టాప నమును పరీక్షించుట అత్యవసరము. ప్రతిష్ఠాపన యొక్క సామాన్య స్థితిని తెలిసికొనుట కొఱకు విద్యుద్బంధనము యొక్క నిరోధమును (Insulation resistance), భూ సంబంధము యొక్క వాహకత్వమును (conductance), విద్యుద్వాహకము స్విచ్చిల సంబంధములను పరీక్షించుట అవసరము. దీనికై ఈక్రింది పరీక్షలు చేయబడుచుండును: భూనిక్షిప్త విద్యుద్భంధనము యొక్క నిరోధము :-- మెగ్గర్ (Megger) అను సాధనముతో ఈ పరీక్షను కొన సాగింతురు. విద్యుద్వలయములందు సాధారణముగా నుండు వోల్టేజికి సుమారు రెండు రెట్లున్న ఋజువిద్యుత్ప్ర వాహపు వోల్టేజి (D.C. Voltage) పరీక్షకుపయోగింతురు. (త్రిదశా వికల్ప విద్యుత్ప్రవాహము వాడినట్లయినచో ఆర్. యమ్. యస్. (వికల్ప) విలువకు రెండు రెట్లు అవసరము). ఈ పరీక్షను ప్రతిష్ఠాపనమున కంతటకును కంపెనీవారి ప్రధాన ప్రేషక తంత్రులను కలుపు ద్విధ్రువ ప్రధాన తంత్రులు 34 మెగ్గరు ప. 23 భూమికిని, సర్వవాహకములకును మధ్య పరీక్ష (దీపములు తీసివేయవలెను. స్విచ్చిలు తెరచియుంచవలెను.) స్విచ్చి వద్ద కొనసాగింపవలెను. 'మెగ్గరు' యొక్క భూసంధి కొన (Earth terminal) జలవాహక మునకో