ఆంధ్రులు - వాణిజ్యము
వర్ణింపబడినది. కాని క్రమముగా జనసంఖ్య అభివృద్ధిచెంది పల్లెలు, పట్టణములు ఏర్పడి, పరిపాలనా విధానము
నిర్మితమయి, ఆంధ్ర శాతవాహన రాజుల కాలములో ఉజ్జ్వలమైన నాగరికతను ఆంధ్రదేశము అనుభవించినది.
నాగరకతతోపాటు వర్తక వ్యాపారాదులు అభివృద్ధిచెంది స్వదేశములోనే కాక విదేశాలలో కూడ అభిమానింపబడిన
వస్తువులను ఉత్పత్తిచేసి ఓడలలో వాటిని ఇతర దేశాలకు ఆంధ్రదేశము పంపినట్లు తెలియుచున్నది. దక్షిణాపథము
నకు తూర్పున, పశ్చిమమున ముఖ్యమయిన రేవుపట్టణాలు అభివృద్ధి చెందినవి. ఆంధ్ర సముద్ర తీరాలలో ఓడలను కట్టుట, వాటిని మరమ్మతు చేయుట, క్రొత్త ఓడలతో సముద్రయానము సాగించుట మున్నగు పనులు విరివిగా జరిగినవి. శాతవాహనుల రాజధాని కృష్ణాజిల్లా లోని శ్రీకాకుళము. శాతవాహన రాజుల నాణెములపై ఓడను చిత్రించుటవలన విదేశీయానము, వ్యాపారము విశేషముగ అభివృద్ధిగాంచినట్లు మనముఊహించవచ్చును.
శాతవాహనుల కాలమునాటి వర్తక వ్యాపారములకు ఆస్పదమైన రేవు పట్టణములు ఇప్పుడు శిథిలావస్థలో కనుపించు చున్నను ఆనాడు వైభవోపేతములైన వర్తక కేంద్రాలుగా ఉండినట్లు చరిత్రకారుల రచనలనుబట్టి తెలియుచున్నది. క్రీ. శ. 174-203 వరకు పరిపాలించిన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి విదేశ వ్యాపారమును విరివిగా ప్రోత్సహించినాడు. ఘంటసాల రేవు, గూడూరు రేవు ప్రసిద్ధిగాంచినవి. పెరిప్లస్ అను గ్రంథములోను, టాలెమీ అనునతడు రచించిన ఆనాటి భూగోళ గ్రంథములోను ఈ రేవులు పేర్కొనబడినవి. ఘంటసాలను 'కొంట కొల' అనియు, గూడూరును 'కొడ్డూరు' అనియు వారు పేర్కొనిరి. కృష్ణానదీ ముఖద్వారమును మసేలియా అనియు, మచిలీపట్టణము రేవును 'మైసోలస్' అనియు వ్యవహరించినారు. ఆంధ్రదేశములో దొరకిన రోమను చక్రవర్తుల బంగారు నాణెములు ఘంటసాల రేవుపట్టణ మున జరిగిన వ్యాపారములో వచ్చినవే. పెరిప్లసు అను గ్రంథములో పశ్చిమమున 'భృగు కచ్చ'ము అను నేటి బ్రోచ్ రేవుపట్టణమును 'చారి గాజా ' అని పేర్కొని దక్షిణదేశ వ్యాపారము ఇక్కడినుండికూడ విరివిగా జరిగినట్లు తెలిపిరి. ఈ దేశమును తెలిపిరి. ఈ దేశమును 'అరియకం' అనిరి. అందులో
లంబోదరు డను శాతవాహన రాజు. దీనిని అందులో పరిపాలించినట్లు చెప్పబడి ఉన్నది. రోము నగరము తోడనేగాక ఈజిప్టుతో కూడ సన్నిహిత వర్తకము జరిగినది. ఈజిప్టు దేశములోనికి వర్తక వ్యాపారాలకోశము 'సుబ' JJ' అను భారతీయుడు వచ్చినాడని ఈజిప్టు శాసనములలో పేర్కొనబడి ఉన్నది. దక్షిణమున కావేరి పట్టణ మనబడు 'కమరా' రేవు విదేశ వ్యాపారములో ఘనత కెక్కినది. ఇదిగాక క్రీస్తు పూర్వమునుండి జైన బౌద్ధమత ప్రచారమునకై విదేశాలకు యాత్రీకులను చేర వేసిన కళింగపట్టణము రేవు కూడ ప్రాచీనమైనదే. ఈ రేవులో ఓడలను ఎక్కి విజయుడను కళింగరాజు 700 మంది బౌద్ధ బిక్షువులతో సింహళము చేరినాడని ఔద్ద గ్రంథములు తెలుపుచున్నవి. కాకినాడకు పదిమైళ్ళదూర ములో కోరంగి అను ప్రాచీన రేవుపట్టణము ప్లినీ కాలమునాడు ప్రసిద్ధికెక్కినది. ఇక్కడ నౌకా నిర్మాణము విరివిగా జరిగినది. శాతవాహన రాజ్యములో ఒక భాగమైన నేటి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరీ ముఖద్వారములో ప్రాలూరు అను రేవుపట్టణముండెను. దీనిని టాలెమీ తన భూగోళములో పేర్కొనెను. శాతవాహనుల కాలములో చైనా, బర్మా, మలయా, రోము, ఈజిప్టు మొదలగు దేశాలతో ఆంధ్రదేశము విరివిగా విదేశవ్యాపారము జరిగించినట్లు స్పష్టముగా తెలియు చున్నది. వ్యాపార వస్తువులలో ఆంధ్రదేశమునుండి వజ్రములు, అద్దకపు బట్టలు, డక్కా మజ్లినులవంటి సన్న బట్టలు, బియ్యము, ఎగుమతి అగుచుండెను. దిగుమతులలో బంగారము, వెండి ముఖ్యముగా చెప్పదగినవి. వస్తువుల వ్యాపారముతోబాటు, ఆంధ్రదేశము నుండి బర్మా, మలయా, సయాం దేశాలకు కోడూరు రేవునుండి వెడలిన యాత్రిక నౌకల ద్వారమున బౌద్ధమతము వ్యాపించినది.
శాతవాహనుల తరువాత ఆంధ్రులను సామ్రాజ్య స్థావనకు తయారుచేసి ఆంధ్ర సామ్రాజ్యమును సుమారు మూడువందల ఏండ్లు పరిపాలించినవారు కాకతీయులు. వీరి రాజ్యకాలములో గణపతిదేవుడను రాజు విదేశ వ్యాపారమును ప్రోత్సహించి నట్లు మోటుపల్లి శాసనము వలన తెలియుచున్నది. కాకతీయ సంచికలో శ్రీ రాళ్ల