ఆంధ్ర విశ్వవిద్యాలయము
ములో నున్న ఆంధ్రులకు చిరవాంఛితములు మూడు. ఇవి వారి భాషా సంస్కృతి వికాసముల కొరకొక విశ్వవిద్యాలయము, ఆంధ్ర జాతీయ సైనికదళము (Andhra Regimental corps), వారి భాషాప్రాంతములతో కూడిన
ఆంధ్రరాష్ట్రము. ఈ మూడింటిలో మొదటి వాంఛకు ఫలసిద్ధి 1926 నాటివరకు కలుగనేలేదు.
పూర్వ రంగము : అధునాతన భారతీయ విద్యాచరిత్రములో మొట్టమొదటి విశ్వవిద్యాలయములు మూడు. మద్రాసు, బొంబాయి, కలకత్తా. వీటిని 1857 లో స్థాపించిరి. అర్ధ శతాబ్ది అనుభవముపైన విశ్వవిద్యాలయములు కేవల పరీక్షాధికార సంస్థలుగా మాత్రమే గాక బోధనా సంస్థలుగా కూడ పెంపొందవలయునన్న అభిప్రాయము ప్రబలమైనది. అది కారణముగా 1919 లో సర్ మైకేల్ శాడ్లర్ (Sir Michael Saddler) అధ్యక్షతను కలకత్తా విశ్వవిద్యాలయ పర్యవేక్షక సంఘము నియమింపబడినది. వారి సూచనల ప్రాతిపదికపై లక్నో, ఢక్కా, ఢిల్లీ, అలీఘర్ విశ్వవిద్యాలయములు వెలసినవి. మద్రాసు ప్రభుత్వము వారు కూడ తమ రాష్ట్రములోని ప్రతి భాషా ప్రాంతమునకు ఒక్కొక్క విశ్వవిద్యాలయ ముండవలయు ననియు, ముఖ్యముగా తెలుగు భాషా ప్రాంతమునకు ఆంధ్ర విశ్వ విద్యాలయము అత్యవసరమనియు నిర్ణయించిరి. శ్రీ ఎల్. ఏ. గోవింద రాఘవయ్యర్ గారి అధ్యక్షతను 20 మంది సభ్యులు గల ఒక సంఘమును నియమించిరి. అదే సమయమున ప్రాచ్య పాశ్చాత్య ఖండములందలి విశ్వవిద్యాలయముల నన్నిటిని సందర్శించి వచ్చి స్వదేశ రాజకీయములందు అడుగిడిన శ్రీ కట్టమంచి రామలింగారెడ్డిగారిని కూడ ఒక సభ్యునిగా పునరాలోచనా ఫలితముగ నియమించిరి. ఆ సంఘపు నివేదికను రచించు బాధ్యత సర్వము వారిపైననే బడినది. గోవింద రాఘవయ్యర్ సంఘము వారు తమ నివేదికను ప్రభుత్వమున కంద జేసిరి.
శాడ్లర్ నివేదిక నమసరించి మద్రాసు విశ్వవిద్యాలయ చట్టమును సవరించిరి గాని ఆంధ్రవిశ్వవిద్యాలయ నిర్మాణ విషయమును గూర్చి ప్రభుత్వమువారు ఉదాసీనత వహించిరి. 1923 సంవత్సరమున శ్రీ (తరువాత సర్) ఆర్. యం. స్టాధవ్ గారు తమ నివేదికను ప్రచురించుచు ఆంధ్ర విశ్వవిద్యాలయ నిర్మాణ ఆవశ్యకతను, ఏతత్పురోభివృద్ధికి వలయు మార్గములను స్పష్టముగా వివరించిరి. ఇప్పటికి విశ్వకళా పరిషత్తు స్థాపన నిర్ధారణమైనది. కాని దాని స్వరూప నిర్ణయమును గూర్చి ఎన్నియో తగవులు వచ్చినవి. ఇది ఏకైక బోధనా సంస్థగా నుండవలయునా లేక కేవల పరీక్షాధికార సంస్థగా నుండవలయునా లేక ఉభయ బాధ్యతలను నిర్వహింపవలయునా యన్నది ఇదమిత్థమని నిర్ణయము కాలేదు. చివరకు ఆనర్సు యమ్.ఏ., యమ్.యస్.సీ. మొదలగు పట్టములకు వలయు శిక్షణము కేంద్రమునందు మాత్రమే యొసంగి బి.ఏ. వరకు శిక్షణ నొసంగు కళాశాలలు ఎల్లెడల నెలకొల్పుటకు నిశ్చయించిరి, ఐనను కేంద్రమును గూర్చి పెక్కు తగవులుండుటచే విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, అనంతపురము పట్టణములు మూడు కేంద్రములుగను, విశ్వవిద్యాలయ కార్యస్థానము బెజవాడలో నుంచుటకును నిర్ణయించిరి. ఇంతవరకు వచ్చిన తరువాత నామకరణ విషయములో “ఆంధ్ర" శబ్దమునకు బదులు "తెలుగు" నుపయోగింపవలె నను వాదము చెలరేగెను. ఈ సందర్భములో ప్రసంగించుచు శ్రీ రామలింగా రెడ్డిగారు ఇట్లు నుడివిరి. “ఆంధ్ర మహాభారతకర్తల నాటినుండియు ఆంధ్రశబ్దము తెలుగు మాట్లాడువారిని గూర్చియే ఉపయోగింపబడినది. ఇది సర్వజనాంగీకారము వడసినది. ద్రావిడాభి మానమును పురస్కరించుకొని భాష, సంస్కృతి ప్రాతిపదికగా గల సంకుచితాదర్శములు లేకయుండుటయే మేలు" అనిరి. దానితో తెలుగువారి విశ్వవిద్యాలయమునకు "ఆంధ్ర విశ్వవిద్యాలయము" అని పేరు స్థిరపడినది.
ప్రథమ ఘట్టము : ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టము 1926 వ సం. ఏప్రిలు 26 వ తేదీన గంజాము, విశాఖ పట్టణము, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, బళ్లారి, అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో, అమలులోనికి వచ్చినది మొదటి ఛాన్సలర్ మద్రాసు గవర్నరైన లార్డ్ గోషన్ మొదటి ప్రోఛాన్సలర్ శ్రీ బొబ్బిలి రాజావారు, విశ్వ విద్యాలయ నిర్వహణకు గౌరవ ఉపాధ్యక్షులు కాక సర్వవిధముల సమర్థుడైన ఒక వైస్ ఛాన్సలర్ను ఉద్యోగిగా నియమించుట అవసరమని గుర్తెరింగి ప్రభుత్వమ