Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/681

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర వాణిజ్య మండలి

నూతన మార్గముల నన్వేషించి అనుసరింప యత్నించిరి. సంప్రదాయ సిద్ధమైన కవితావాహిని ఏదో యొక విధముగా ప్రసరించుచునే యున్నను వారి అన్వేషణ ప్రయత్నములకు ఫలితముగా నూతన కవితా ప్రవాహము లేర్పడి దేశము నలుమూలల వ్యాపించినవి. వాని పరిణాము వికాసముల వివరణమే ఆధునికాంధ్ర వాఙ్మయ చరిత్రమున ప్రధానస్థాన మాక్రమించును.

ది. వేం. అ.

ఆంధ్ర వాణిజ్య మండలి  :- ఒక దేశము యొక్క ఆర్థిక జీవితము'లో వాణిజ్యమునకుగల ప్రాముఖ్యమును ప్రత్యేకముగా నొక్కి చెప్ప నవసరము లేదు. ఆంగ్లదేశ చరిత్ర చదివిన వారెల్లరికిని వాణిజ్య మొక జాతిని ఎంతటి మహత్తర స్థితికి తేగలదో సుస్పష్టమే. ఒక ఆంగ్లేయ రచయిత చెప్పినట్లు ఆంగ్లేయుడు త్రాగు ప్రతి కప్పు తేనీటిలోను పడు దినుసులలో ఒక్క నీరు తప్ప తక్కినవన్నియు విదేశములలో పండించబడి ఆంగ్లేయుల వాణిజ్య నైపుణ్య మూలమున సంపాదింపబడినవే.

అనాదిగా ప్రాచీన కాలమునుండియు మన దేశీయులు వాణిజ్య నిపుణులై విదేశములతో కూడ వర్తకము సాగించిరి. ఐతే విదేశ ప్రభుత్వము మన దేశమునుపాలించు కాలమున మన వర్తక వాణిజ్యములు దెబ్బతినినవి.

నేడు వర్తక వాణిజ్యముల విషయములో అనేక నూతన సమస్య లుద్భవించినవి. ప్రభుత్వము ఆర్ధిక పునర్నిర్మాణ కార్యక్రమములో నిమగ్నమగుటచే ప్రభుత్వమునకు వాణిజ్యమునకు గల సంబంధము సన్నిహితమైనది. వర్తకము కేవలము వ్యక్తుల సంపాదనామార్గము అను భావము పోయి అది జాతిసంపదను పెంపొందించు సాధనముగా పరిగణింపబడుచున్నది. దీనికి తోడు పన్నుల విధింపు కార్మిక సమస్యలు మొదలగునవి నూతన ప్రాముఖ్యమును వహించినవి. అట్టి పరిస్థితిలో వాణిజ్యములో నిమగ్నులైనవారు ఒక సంస్థగా నేర్పడుటవలన వారికినీ, వారితో సంప్రదించుటకు ప్రభుత్వమునకును సౌకర్యకరము. ఆ యుద్దేశముతోనే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛేంజర్స ఆఫ్ కామర్పు (భారత వాణిజ్య మండలుల కూటమి) అను సంస్థ దేశమంతటకును కలిసి వ్యవహరించుచున్నది.

అయితే భారతదేశము మిగుల పెద్దదేశము. ప్రతి ప్రాంతమునకును ప్రత్యేక అవసరములు, ప్రత్యేక అవకాశములు, ప్రత్యేక సమస్యలు గలవు. ఉదాహరణమునకు ఆంధ్రదేశమున పుగాకు పంటకు సంబంధించిన ప్రత్యేక సమస్యలున్నవి. ఆంధ్ర ప్రాంతములో ముడిసరుకునకు కొదువలేకున్నను పెట్టుబడిఅవకాశములు పరిమితములు.కావున స్థానికావసరములకై స్థానిక వాణిజ్య మండలులు ప్రతి ప్రాంతమునందును ఉండుట అవసరము.

ఈ అవసరము 1928 వ సం. నందే గుర్తింపబడి ఆంధ్ర వాణిజ్యమండలి స్థాపింపబడెను. ఈ సంస్థ ప్రథమ అధ్యక్షులు కీ. శే. కొమ్మిరెడ్డి సూర్యనారాయణ మూర్తి గారు, ఆ పిమ్మట వరుసగా కీ.శే. నారాయణ దాస్, గిరిధర దాస్ (1930, 1935-43), కీ.శే. శ్రీ పి.టి. కుమారస్వామి చెట్టి (1931-34), శ్రీ సి. శేషాచలం, (1944-46) శ్రీ యన్. రామారావు, (1947), శ్రీ గుంటూరు నరసింహారావు (1948-50). శ్రీ టి.వి. యతిరాజులు చెట్టి (1951), శ్రీ పి. సూర్యనారాయణ (1952-53) శ్రీ జె. వి. సోమయాజులు (1954) గార్లు అధ్యక్షులైరి. 1953 వ సంవత్సరములో ఈ వాణిజ్యమండలి రజతోత్సవము జరుపబడెను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయుత్సవముల కగ్రాసనాధిపతులుగా నుండిరి. ఈ సందర్భమున కీ. శే. డాక్టర్ బి. వి. నారాయణస్వామి నాయుడుగారి అధ్యక్షత నొక ఆర్థిక మహాసభయు జరుపబడెను. ఈ సంస్థ ఆంధ్ర వాణిజ్యమండలి యను పేరున పిలువబడినప్పటికిని ఇందు మదరాస్, హైదరాబాద్, ఒరిస్సా, తిరువానూరు, కొచ్చిన్, పశ్చిమబెంగాలు, బొంబాయి రాష్ట్రములకు చెందిన సభ్యులు కూడ గలరు. 1954 వ సంవత్సరపు వార్షిక సమావేశ అధ్యక్ష ప్రసంగమున చెప్పబడినట్లు ప్రాంతీయ సమస్యలను అఖిలభారత దృక్పథముతో పరిష్టరింప వలసిన ఆవశ్యకతను ఈ మండలి ఎన్నడును విస్మరించి యుండలేదు. చెన్నపురిలో నుండియే వ్యవహరించుట మూలమున ఇదివరకటివలెనే ఆంధ్ర, మద రాసు రాష్ట్రములనడుమ సంధానకర్తయై, యావత్తు దక్షిణ భారత దేశ శ్రేయస్సునకు పనిచేయగలననిఈ సంస్థ ఆశించుచున్నది.

1954వ సంవత్సర ప్రారంభము నాటికి మండలి సభ్యుల సంఖ్య 649. అందు 4 గురు గౌ. సభ్యులు. 40 మంది