Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్తులకును, భాగములకును సరఫరా చేయుటకై వివిధ పంపిణీ పెట్టెలుండును. అంతర్విద్యుత్ప్రతిష్ఠాపన కవసర వడు విద్యుత్ప్రవాహమును గ్రహింప సమర్థములగు రెండు ప్రధాన తంత్రులు (cables) పంపిణీ పెట్టెకు ప్రేషణ చేయును. ప్రధాన స్విచ్చి (main switch), మరియు ఫ్యూజు తీగల ద్వారా ప్రధాన తంత్రులు పంపిణీ పెట్టెకు కలుప బడును. దీని సహాయమున అంతర్విద్యుత్ప్రతిష్ఠాపనము నంతను నిర్జీవముగ ('dead') చేయవచ్చును. తంత్రులను సమాంతర విధానములో నమర్చుటలోగల ముఖ్య ప్రయోజనములు:— 1. విద్యుత్ప్రతిష్ఠాపనములో నొక భాగములో నేదేని మరమ్మతు చేయవలసి వచ్చిన ప్పుడుగాని, మార్పులను చేయవలసి వచ్చినప్పుడుగాని, ఇతరభాగములతో సంబంధము లేకయే ప్రతి ప్రమాణ మును (each unit) ప్రత్యేకింపబడును (isolated). 2. మొత్తము విద్యుద్భారము (Load) వివిధ వలయ ములలోనికిని సర్దుబాటు చేయవచ్చును. దీనివలన ప్రతి వలయములో ఏకరీతియైన పీడన యొక్క పత నము (Pressure drop) సాధ్యపడును. ప్రేషకపు వోల్టేజి (Supply voltage) వినియోగ సాధనముల కవసరమగు వోల్టేజికంటె అధికమగుచో, మరి రెండు కాని, అంతకంటె అధికముగ కాని వినియోగ సాధనములను శ్రేణి విధానమున (In series) సమర్ప వచ్చును. (చూ.ప. 4) -ఉత్పాదన కేంద్రము జీవములు దీపములు ప.4. శ్రేణీ విధానపు వలయము. శ్రేణీ విధానమున ఒకే విద్యుత్ప్రవాహము ప్రతి దీపములోనికి ప్రవహించును కనుక వలయము నందలి 27 అంతర్విద్యుత్ప్రతిష్ఠ ప్రతిదీపమును ఒకే బలమును (Power) కలిగి యుండ వలెను. కాని ఈ శ్రేణీ విధానమున ఒక అననుకూలత ఉన్నది. అది ఏమన, ఏదేని ఒక దీపము చెడిపోయినచో వలయము ఖండింపబడి, అన్ని దీపములును నిష్ప్రయోజ కము లగును. మరియు మనకు ఇచ్చవచ్చిన దీపము నొక దానినే వాడుట కవకాశ ముండదు. విద్యుత్ప్రతిష్ఠాపనములందు తండ్రులకు రంగుల నుప యోగించుట యొకా నొక సాంకేతిక పద్ధతి. ఇట్లు చేయుటవలన ప్రతిష్ఠాపన సమయమున పొరపాట్లకు (స్థాలిత్యములకు) తావుండదు. సులభతరమునుగూడ అగును. సాధారణముగ, వినియోగ ప్రేషక మార్గము లకు నలుపురంగును, స్విచ్చి ప్రేషకమార్గములకు ఎరుపు రంగును ఉపయోగింతురు. స్విచ్చిని దీపముతో కలుపు తంత్రులు ఎరుపు రంగుతోగాని, కొన్ని ప్రత్యేక పరిస్థితు లలో నారింజ (orange) రంగుతోగాని గుర్తింప బడును. (చూ.ప. 5) పంపిణీ పెట్టె నుండి దీపపుప్రేషకము (నలుపురంగు) వచ్చుతండ్రులు స్విచ్ఛి ప్రేషకము స్విచ్చిప్రేషకము (జుపురంగు) స్విచ్చి ప.S. ఒకటే దీపము గల వలయము. పంపిణీ పెట్టెనుండి సరఫరా చేయబడి ఏకధృవ స్విచ్చి (Single pole switch) చే వశీకరింపబడిన వలయము:- దీపపు పాయింటు (Point) నిర్జీవముగ (Dead) నుండ వలెను. అనగా స్విచ్చి తెరువబడినప్పుడు ' (When switch is open) పాయింటుకు ప్రధాన తంత్రుల భూసంబంధము వైపు (Earthed side) కలుపవలెను. ఇట్లు చేయుటవలన ప్రధానతంత్రులకు విద్యుదాయాస ముండదు (Electri- cal strain)మరియు దీపములను మార్చునప్పుడు విద్యుత్తు యొక్క పెనుతాకుడు వలని (Electric shock) అపాయ ముండదు.