Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అండమాన్ దీవులు సంవత్సరమునకు 1,50,00,000 కొబ్బరికాయలు ఎగుమతి అగుచున్నవి. అడవులు బర్మా అడవులజాతికి చెంది, కొన్ని మలయాజాతులనుగూడ కలిగినవై యున్నవి. చిత్తడినేలలో పెరుగు రావిచెట్లవంటి చెట్లు (Mangrove swamps) నుండి ప్రశస్తమగు వంటచెరకు దొరకు చున్నది. రెండవ ప్రపంచ సంగ్రామము తరువాత 'షార్ట్ లీవర్ ఆయిల్' పరిశ్రమ అభివృద్ధి చెందసాగినది. జంతు జాలము విషయములో నిచటి అడవులు కొరవడి యున్నవి. చిన్నరకపు పంది (Sus andenesis) ఒకటి ఇచటి ఆదిమ వాసులు ఆహారమునకు ఉపయోగ పడుచున్నది. ఒక మాంసాహార జంతువు (Paradoxirus tytleri) కూడ కనబడు చున్నది. మొత్తము 19 రకముల జంతుభేదము లిచ్చట కలవు. గబ్బిలములును, ఎలుకలును జంతువులలో 75 శాతముగానున్నవి. ఇట్లు జంతుజాలము తక్కువగా నుండుటను బట్టి ఈ దీపు లొకానొకప్పుడు ఆసియా భూభాగముతో కలిసియుండెడివన్న సిద్ధాంతము సంశ యాస్పద మగుచున్నది. డేగ, బుల్ బుల్ మొదలగు అనేక పక్షిజాతులు కనబడుచున్నవి. కాని ఇవే నికోబార్ దీవులలో వేరురకముగా నున్నవి. చేపలలో ప్రత్యేక జాతులు లభ్యమగు చున్నవి. తాబేళ్లు (Turtles) సమృ ర్ధిగా దొరకుచు, కలకత్తా మార్కెటుకు ఎగుమతి చేయ బడుచున్నవి. వీరు ప్రజలు:- నీగ్రోజాతి భేదమునకు చెందిన ఆదిమని వా సులు ఇచట కలరు, మగవారి సగటు ఎత్తు 4 అ.10 అం. ఆడువారి సగటు ఎత్తు 4అ. 6 అం. మరుగుజ్జు వా రై నను సుపరిమాణములైన శరీరములు కలిగియుందురు. కారు నలుపు రంగు, కొంచెము గుండ్రముగా నుండు తల; చిన్నదియై, వెడల్పుగల ముఖము; వెడల్పు ముక్కు ఆ కారముగలవారు. పొట్టిగా నల్లగా నుండు వీరి జుట్టు ఉంగరములు తిరిగి, మిరియపు గింజలవలె కనబడును. తీరవాసులు, దేశాంతర్భాగ వాసులు అని ప్రజలు రెండు తెగలుగా నున్నారు. తిరిగి వీరు 12 ప్రత్యేక వర్గములు (Tribes) గా కనబడుచున్నారు. మలయాలోని ' సెమాంగ్ (Semangs) లకును, న్యూగినీలోని 'పాపువాను' (Papuans) లకును వీరు పోలిక కలిగి యున్నారు. వీరిలో ప్రభుత్వ వ్యవస్థ లేదు. కాని కొందరి నాయకులను 24 (Heads) వీరు అనుసరించుచుండుట కలదు. సంగీతము, నాట్యము సాధన చేయబడుచున్నవి. విండ్లు, బాణములు వీరి ఆయుధములు. తాళ్ళు పేనుటలో, తట్టలు, చాపలు అల్లుటలో వీరికి నేర్పుగలదు. నిప్పు రగుల్చుట వీరికి తెలియదు. కాన, వీరు దానిని పదిలపరచుకొని, కుండలు చేయుటకును, వంటకును ఉపయోగింతురు. తీర ప్రదేశము లను దాటి, వారు సముద్రపు దూరప్రదేశములలోనికి పోరు. చనిపోయిన వారిని చెట్టు తొఱ్ఱలలో భద్రపరచుట, మృతుల యెడగల ప్రత్యేక గౌరవమును సూచించు ఆచారము. భాషాశాస్త్రదృష్టితో, వీరి భాషలు మిక్కిలి గమనింప దగినవిగా నున్నవి. సంధి ప్రధానములై ఇవి వ్యాకరణ సంబంధమగు వికాసములేనిపై యున్నవి. వ్యుత్పత్తితో గూడిన వృద్ధిమాత్రము కనబడుచున్నది. ధా తు వు లు, ప్రత్యయములును భాషనునిర్మించు అంగములై యున్నవి. సామాన్య ధాతువులు తరచు నామవాచకములై యున్నవి. మికిలి సామాన్య భావములను వెల్లడించుచు, మాట్లాడుటకు మాత్రమే ఉపకరించుచు, ఈ భాషలు వ్రాతకు కావలసిన సవరణల విషయములో కొరవడి యున్నవి. ముఖవైఖరిని బట్టియు, సంజ్ఞలను బట్టియు చాలవరకు వారి భావములు వెల్లడియగుచుండును. "ఇచటి ప్రజలు ఉత్సాహవంతులుగాను, ఆనంద శీలురుగాను, ఆటపాటలయందు ఆసక్తి గలవారుగాను ఉన్నారు. వీరు అసూయాపరులును, మోసకాండ్రును, పగబట్టువారును అయియున్నారు. కోపము వచ్చినచో ఎంతటి ఘోరమునకయినను తలపడెదరు. అభిమాన ముతో చూడదగిన వారేకాని, నమ్మదగినవారు కారు” అని బ్రిటీషువారు తమ అనుభవముల ననుసరించి ఆదిమ వాసులను గూర్చి అభిప్రాయము వెల్లడించియున్నారు. 1858 నుండియు కొన్ని చారిత్రక విషయములు:- బ్రిటీషు వారిచే నీ దీవులు ప్రభుత్వ శిక్షితుల ఆవాస భూములుగా వాడబడెను. ఫిబ్రవరి 8, 1872లో రాజు ప్రతినిధియగు మేయో ప్రభువు ఈ దీవులకుపోగా, అప్పుడు ఆయనను ఒక బైదీ చంపెను. 194 2 నుండి, రెండవ ప్రపంచ యుద్ధము ముగియువరకును ఇవి జపాను వారిచే ఆక్ర మింపబడియుం డెను.