Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

81 మైళ్ళదూరములో నున్నది. దీనికి సమీపమున (రట్లాండ్ దీవికి) నున్న మేనర్సు జలసంధి (Manners Strait) మద్రాసు తీరప్రాంతమునకును, అండమాన్ దీవులకును మధ్య ప్రధానమైన వర్తకపు రహదారీ (Coinmercial Highway) గా నున్నది. పేరు :— అండమాన్ అను పేరు మలయా భాషలో "హన్ డుమాన్" (హనుమాన్. సం.) నుండి ఏర్పడియుండుట సంభవమని చెప్పబడుచున్నది. వర్ణన (Topography); భౌతికలక్షణములు:- మహా-- అండమాన్ దీవులు కొండల పరంపరలచే నిండియున్నవి. వీటి మధ్య మిక్కిలి ఇరుకైన లోయలున్నవి. మిక్కిలి దట్టములైన ఉష్ణమండలారణ్యములచే ఈ భాగము లన్నియు ఆవరింపబడి శ్యామవర్ణము (Lush green) గా కనబడు చుండును. తూర్పు తీరమున ఈ కొండలు ఎక్కువ ఎత్తుగలవిగా నున్నవి. వీటిలో "సేడిల్ శిఖరము" (Saddle Peak) ఎత్తు 2,400 అడుగులు. ఇది ఉత్తర అండమానులో నున్నది. "చిన్న అండమాన్” (Little Andaman) దాదాపు చదునుగా నున్నది. సెలయేరులుగాని, ఎడతెగక పారు నదులుగాని ఈ దీవులలో లేవు. ఎల్ల తావులయందును ప్రకృతి దృశ్యము హృదయా కర్షకమైన సౌందర్యముగలిగి, వైవిధ్యముతో గూడి యుండును. నౌకాశ్రయముల దాపునగల అఖాతము లందు పగడపు తలములు రంగు రంగులతో, సమ్మోహన కరములై యుండును. తీర రేఖ చీలియుండుటచే చక్కని నౌకాశ్రయము లేర్పడి యున్నవి. వీటిలో పోర్టు బ్లెయిర్ (Port Blair), పోర్టు కారన్ వాలిస్, బోలింగ్టన్ అనునవి ప్రసిద్ధికెక్కి నవి. వీనిలో పోర్టు బ్లెయిర్ (దక్షిణ అండమాన్) దక్షిణ ఆసియాలోని ఉత్తమ నౌకాశ్రయములలో నొకటియై ఈ దీవులకు రాజధానియై యున్నది. బర్మాలోని ఆరశాన్ యోమా (Arakan yoma) పర్వత పంక్తులలో నున్న నెగెయిస్ అగ్రము (Cape Negrais) నుండి సుమత్రా దీవిలోని పన్ హెడ్ (Ach- in Head) వరకు 700 మై. పొడవుగల ఎత్తైన పర్వత వంక్తులు సముద్రములోనుండి అడ్డముగా వ్యాపించి 23 అండమాన్ దీవులు యున్నవి. అండమాన్ దీవులు ఈ పర్వత శ్రేణిలో ఒక భాగమై యున్నవి. 'నూతన జాతి' శిలానిర్మాణములు (Newer Rocks) అండమాన్ ద్వీపసమూహములోను, నికోబార్, సుమత్రా దీవులయందును కనబడుచున్నవి. శీతోష్ణస్థితి:- అండమాను దీవులు ఉష్ణమండలములో చేరి, ఎప్పుడును వెచ్చదనము గలిగియున్నను, చక్కని సముద్ర వాయువుల ప్రభావముచే, ఆరోగ్యవంతముగా నున్నవి. ఉత్తరాయణ కాలములో ఇచట అధికమైన వేడిమి యుండును. వర్షపాతము క్రమము లేక హెచ్చు తగ్గులతో గూడి యుండును. నైరృతి ఋతుపవన కాల ములో అత్యధికములైన వర్షములు కురియుచుండును. తుపాను అంతగా ఈ ప్రాంతమునకు తగులవు. కానీ బంగాళాఖాతములో వీచెడి ప్రతి తుపాను యొక్క ప్రభా వమును ఇక్కడ కనబడు చుండును. వీచెడి తుపానులు దిక్కును, తీవ్రతయును తెలిసికొని, బంగాళాఖాతములో తిరిగెడి అనేకములైన ఓడలకు తెలియజేయుటకు మిక్కిలి అనుకూలమైన స్థానములో నీ దీవులున్నవి. అందుచే 1868 సం॥ నుండి, పోర్టు బ్లెయిర్ లో నొక చక్కని వాతావరణ పరిశీలనా కేంద్రము నెలకొల్పబడి యున్నది. సహజవృక్షసంపద, జంతుజాలము :- 1883 సంవత్స రములో ఆటవిక శాఖా కార్యాలయ మొకటి ఇక్కడ నెలకొల్ప బడినది. పోర్టు బ్లెయిర్ చుట్టును 158 చ.మై. అటవీ పరిశోధన కార్యకలాపమునకు ప్రత్యేకింప బడినది. ఖైదీలను కూలీలగా నుపయోగించి, ఈ పని సాగింప బడెను. "పేడౌక్" (Padouk) (pterocorpus dalber- gioides) అను ఒక జాతివృక్షము ఇచ్చట పెరుగుచున్నది. ఇది కేవల మీ ప్రాంతజన్య మైనట్టిది. ఇండ్లు, పడవలు, కఱ్ఱసామగ్రి మొదలగు వానికి టేకు, మెహాగనీలవలె నే ఇది ఉపయుక్త మగుటచే, ఇది యూరపులోని వర్తక కేంద్రములకు విరివిగా ఎగుమతి చేయబడు చున్నది. కోకో (koko), 'సేటిన్ ఉడ్' మొదలగు మేలిజాతి కలప ఇచ్చట లభ్యమగు చున్నది.. తేయాకు, నైబీరియాకాఫీ, కోకో, మేనిలాజనుము, టేకు, కొబ్బరి, పూలజాతులు, పండ్ల చెట్లు, కూరగాయలు మొదలగునవి ఫలసాయము చేయుటకయి ఇచ్చట ప్రవేశ పెట్టబడినవి. కొబ్బరి ఇచటి ప్రజల ముఖ్యాహారము.