Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అండమాన్ దీవులు వాటిల్లును. ఇది తీవ్రముగను దీర్ఘముగను ఉండు లక్షణ ముగల వ్యాధి. ఈ వ్యాధి తీవ్రమైన పరిస్థితిలో— నిద్ర, మత్తు, కనురెప్ప వాయుట, మెల్ల, ఒకే వస్తువు రెండుగ కనబడుట, జ్వరము, అధికనిద్ర ఉండును. ఇది అంటు వ్యాధిగ వ్యాపించినచో పెక్కుమంది మృతికి కారణ కానీ సాధారణముగ ప్రారంభమునుండియు సాధువుగనేయుండి కష్టనష్టములు లేకుండగనే గడచి పోవును. తర్వాత రోగియందు వణుకు రోగము (పార్కిం సన్ వ్యాధి) లక్షణములు కనుపించును. రోగలక్షణాను సారముగ ఇందుకు చికిత్స చేయవలెను. మగును. పొంగు, మసూచి, గవదబిళ్ళలు, రసులు కూడ మెదడు వాపు వ్యాధికి కారణములు కావచ్చును. ప్రాథమిక మైన టీకాలు వేసిన 6 మొదలు 14 దినముల తరువాత రోగి మెదడు వాపు వ్యాధికి గురియై చనిపోవుటగాని, శారీరకమైన లేక మానసికమైన స్వస్థతను కోల్పోవుట కాని జరుగవచ్చును. ఇందు సాధారణముగ క్లిష్టపరి స్థితులు రావు. ప్రాథమికమైన టీకాలను ఆలస్యముగా వేయించుట ఇట్టి పరిస్థితుల రాకకు దారితీయును. శిశువు నకు మొదటి సంవత్సరములోనే టీకాలు వేయించుట ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్య. (ఇతర అంటువ్యాధులు ఉష్ణమండల వ్యాధులు అను వ్యాసములో వర్ణింపబడినవి). డా. వెం. రా. అండమాన్ దీవులు- ఈ దీవుల గుంపు బంగాళా ఖాతపు తూర్పుభాగమున నున్నది. అగ్నిపర్వత సంబంధ ములగు నీదీవులు హుగ్లీ ముఖద్వారమునకు 580 మైళ్ల లోను, ఆసియా భూభాగమున మిక్కిలి సమీప స్థలమగు బర్మాలోని సెయిస్ అగ్రము (Cape Negrais) నకు 120 మైళ్లలోను కలవు. 1955 భారత ప్రభుత్వపు లెక్కల ననుసరించి, వీని వైశాల్యము 8,148 చదరపు మైళ్లు, బ్రిటిష్ ప్రభుత్వకాలములో 1858 నుండి యావ జీవ దేశాంతరవాస శిక్షితుల కిది నిర్బంధ ప్రదేశముగా (Penal settlement) నుపయోగింప బడెను. ఈనాడు భారత ప్రభుత్వ రాష్ట్రములలో నొకటియై, ఇవి దక్షిణ ముననున్న నికోబార్ దీవులతో కలసి "అండమాన్ మరియు నికోబారు దీవులు" అను పేరుతో, డి-విభాగ 22 రాష్ట్రములకు చెంది, "ఛీఫ్ కమిషనర్ " అను అధికారిచే పాలింపబడు చున్నవి. భారత జాతీయ పతాకచ్ఛాయ క్రింద నేడిచ్చట 30,948 మంది ప్రజలు నివసించు చున్నారు (1951). బంగాళా ఖాతము ఈ అండమాన్ అండమాన్ ద్వీపసమూహము రండు దీవి డంకన్జులోమార్గము చిన్న అండమాన్ పోర్ట్పుబ్లైర్. అండమాన్ దీవులు 50 100 పెద్దవియు చిన్న వియును కలసి, ఇందు మొత్తము 204 దీవులు కలవు. వీనిలో దగ్గరగా చేరియున్న ఐదు పెద్దదీవులు కలసి మహా—అండమాన్ (Great Andaman) అని పిలువబడు చున్నవి. వీటిలో ముఖ్యములై నవి:- (1) ఉత్తర-అండ మాన్ (2) మధ్య—అండమాన్ (8) దక్షిణ-అండమాన్. చిన్న దీవులు దాదాపు 200 కలవు. వీనిలో ముఖ్య ములై నవి. (1) అండమాన్ ద్వీప సమూహము (Anda- man Archipelago) (2) లేబిరిన్ ద్వీపము (Labyrinth Island). మహా—అండమాన్ 219 మై. పొడవును, 82 మై. వెడల్పును గలిగియున్నది. నాలుగు ఇరుకైన జలసంధులు ఈ దీవులను విడదీయు చున్నవి. చిన్న అండమాన్ (Little Andaman) ఈ దీవుల సమూహములో దక్షిణపు కొస నున్నది. దీని పరిమాణము దాదాపు 26 మైళ్ళ పొడవును, 16 మైళ్ళ వెడల్పును నైయున్నది. ఇది రట్ లండ్ దీవికి (Rutland Island)