Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/624

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రలిపి పరిణామము

సాధారణముగా విజ్ఞాన సర్వస్వములు అకారాది క్రమములో రచింపబడును. కాని విషయానుక్రమణికను బట్టి విజ్ఞాన సర్వస్వ రచన సాగించి, ఒకటితర్వాత ఒకటిగా పండ్రెండు సంపుటములలో ఎల్ల గ్రంథమును ఇమిడ్చి ప్రకటించుటకు సమితివారుపూనుకొన్నారు. “ప్రతిసంపుట మందును మొదటి రెండు మూడు వందల పుటలలోను ఆ సంపుటమునకు చెందిన విషయమును అమూలాగ్రము సంక్షిప్తముగా తెలియజేసి తక్కిన గ్రంథమందు ఆవిషయ మందలి అంశములను సంప్రదాయ సిద్ధమైన విజ్ఞానసర్వస్వ రచనా విధానమును అనుసరించి, నిఘంటువులోని పదములవలె అకారాది క్రమమును పొందుపరచి వివరించినారు. అందుచేత ఒక్కొక్క సంపుటి ఒక్కొక్క పెద్దవిషయమునకు సంబంధించిన విజ్ఞాన సర్వస్వముగా తయారగు చున్నది. ఈ విధానమువలన ఎవరి కేవిషయమందు అభిరుచియుండునో, వారా విషయము నకు సంబంధించిన సంపుటమును చదువుకొనుటకు సౌకర్య మేర్పడుచున్నది.

ప్రపంచదర్శిని  :- దీనినే Andhra Directory and year book అందురు. ప్రతిసంవత్సరమును సంవత్సరాదికి నూతన ముద్రణము వెలువడుచున్నది. ప్రఖ్యాత ప్రపంచ విషయములు, ముఖ్యముగా భారతదేశ విషయములు విషయానుక్రమణికలో వివరింపబడుచుండును. ఏ సంవత్సరమున కాసంవత్సరము నూత్న విశేషములిందు చేర్పబడు చుండును.

ఆంధ్రదర్శిని  :- ఆంధ్ర రాష్ట్రావతరణానంతరము ఆంధ్ర దేశమునుగూర్చిన సమగ్ర సమాచారమును ఏర్చికూర్చి ఆంధ్రప్రజల కందించుట తన కర్తవ్యముగా ఎంచి దీని ప్రచురణమునకు విశాలాంధ్ర ప్రచురణాలయము (బెజవాడ) పూనుకొన్నది. (ఏప్రిలు 1954.)

కే. న. శా.

ఆంధ్రలిపి పరిణామము  :- 'లిపి' అను పదమునకు తెనుగున వ్రాఁత అని అర్ధము. వ్రాయు ధాతువునకు కృదంతరూపమే “వ్రాఁత". వ్రాయు అనుదానికి 'వ్రా’ అనునది తొలిరూపము. ఇదివరై అను ద్రవిడధాతువు నుండి పుట్టినది. కావుననే తోడి భాషలగు తమిళమున 'వరై' అనియు, కన్నడమున 'ఐరె' యనియు, మలయాళమున 'వరె' అనియు, దీనికి రూపములుగలవు. వీటిలో కన్నడమున గల బరె అనునది తెలుగున నేటికిని వ్యవహారమున నున్నది. 'నీ కైదు బర్లు వచ్చినవా ?' అని ప్రశ్నించుట పరిపాటియై యున్నది.

'వరై' అను మూల ద్రవిడధాతువు తెలుగున వా' అయినది. దానికి రేయి ప్రభృతులవలె బహువచన ప్రత్యయము 'లు' చేర్పగా వ్రాలు అయినది. వ్రాత మూలమున భాషలోనున్న, అక్షరముల స్వరూపము మనకు గోచరమగును. కాబట్టి వ్రాలు అనగా అక్షరములు అను సంజ్ఞ యేర్పడినది.

నేటి తెలుగు భాషలోని అక్షరములన్నియు గుండ్ర దనము గలిగి అన్నియును హెచ్చుతగ్గులులేక నొకేతీరుగా నుండి వ్రాతలో ముచ్చట గూర్చుచుండును. తెలుగు లిపిని చూచుటతోడనే యొ కేరకమునకు జెందిన ముత్యము లేక సూత్రమున కూర్పబడినట్లు మనోహరముగా నుండును. తెలుగు వ్రాతను మన పూర్వులొక కళగా పరిగణించిరి. దానిని తీర్చి దిద్దుటకు వారెంతయో పరిశ్రమ చేసిరి. వారి దృష్టిలో మనోహరములైన ఊహలను దాచుటకు తెలుగక్షరములు బంగారపు బరిణెలవంటివి. కావుననే గుండ్రకత్తుగా వాటిని మలచిరి. ఈ అక్షర స్వరూపమునకు తగినట్లే తెలుగుభాషయు మాధుర్య గుణమున మన్నన కెక్కినది. అక్షరముల తీరు, భాష యొక్క తీయదనము అవినాభావసంబంధము గలిగిన వగుటచే తెనుగు తీరు తీయములు గల భాషయైనది. "తీరును తీయముంగలుగు తేట తెనుంగను” వ్రాల పూలతో తెలుగు తల్లిని కవులు పూజించిరి. తీయదనము గలిగియుండుటచే వీనులకు విందు, తీరుదనము గలిగి యుండుటచే కనులకు పండుగ. ఇట్లు శ్రోత్రేంద్రియ, నేత్రేంద్రియములకు ఏక కాలమున నానంద మొద వించునది తెనుగుభాష

మనోహరమగు తెలుగులిపినిగూర్చి ప్రాచీనకాలము నుండియు కవులు విశేషముగ ప్రశంసించియున్నారు.

ఉ. వ్రా లివిగోఁ గనుంగొనుము
       వన్నియమీఱఁగ వ్రాల కేమి నా
వ్రాలు సుధారసాలు కవి
       రాజుల కెల్ల మనోహరాలు వ