ఆంధ్ర లక్షణగ్రంథములు
(గుంటూరుజిల్లా) వాడని ఇంతవరకు ప్రకటించిన విమర్శలయం దన్నిటను గలదు, కాని ఇటీవల ప్రకటితమైన “వ్యాస ముక్తావళి" అను గ్రంథమునందు డాక్టరు బూర్గుల రామకృష్ణారావుగారు అప్పకవి గ్రామమును గురించి చర్చించి స్థల నిర్దేశమును చేసినారు. వారి యభిప్రాయము ప్రకారము 'కాకునూరు' హైద్రాబాదు రాష్ట్రమునందలి మహబూబు నగరము జిల్లాలో చేరుచున్నది. అంతేకాక మహబూబునగరము జిల్లా వేదుల గ్రామములో "కాకునూరు" ఇంటి పేరుగాగలవారున్నా
రనియు, అప్పకవి తమ వంశీయుడైనట్లు వారు చెప్పుకొందురనియు తెలియవచ్చుచున్నది. ఈ విషయము పైవాదమును బలపరచుచున్నది.
అప్పకవి గొప్ప లక్ష్య లక్షణవేత్త. ప్రాచీనములైన లక్షణ గ్రంథముల నన్నింటిని పరిశీలించి, తత్సార భూతముగా అప్పకవీయమును రచించెను. ఆతడు తాను పరిశీలించిన పెక్కు గ్రంథములను పేర్కొనుటయేకాక ప్రథమాశ్వాస ప్రారంభమునందు లక్షణ గ్రంథములు లక్షోప లక్షలు గలవనెను. అప్పకవి పేర్కొన్న గ్రంథము లన్నియు మనకు లభింపలేదు. వ్యాకరణాంశముల యందును, యతివి స్తృతి యందును నేటి విమర్శకులు కొందరు అప్పకవి సిద్ధాంతములను విమర్శించియున్నారు. మత భేదములు, విమర్శలు, నిరవధికములు గనుక మనకున్న ఛందో గ్రంథములలో కవితాభ్యాసము చేయువారికి అప్పకవీయము కల్పతరువువంటి దనుట నిర్వివాదాంశము.
IV నిఘంటువులు :- సంస్కృత భాషయందువలెనే తెనుగునందు పూర్వలాక్షణికులు కొందరు నిఘంటువులను రచించిరి. అవియన్నియు పద్యాత్మకములు. కంఠస్థము చేసికొన్న వారికే వాటియుపయోగము. అవసరమువచ్చి నప్పుడు చూచుకొనుట కాధునిక నిఘంటువులవలె అవి ఉపయోగింపవు.
ఆంధ్రనామ సంగ్రహము :- ఇది పద్యాత్మకమై ఆంధ్రుల జిహ్వారంగమున తాండవించునట్టి నిఘంటువు. "తెనుగు పేళ్ళరసికూర్చి” అని చెప్పుకొనుటచేత గ్రంథకర్తయైన పైడిపాటి లక్ష్మణకవి ఈ గ్రంథమును స్వోపజ్ఞముగ రచించెనని ఊహించుటకు వీలున్నది.
ఆంధ్రనామ శేషము : అడిదము సూరకవి ఈ నిఘంటువును రచించెను. ఆంధ్రనామ సంగ్రహమునకిది పరిశిష్ట రూపము. దానియందు చెప్పబడని తెనుగుమరుగుములను కూర్చెదనని గ్రంథకర్తయే చెప్పుకొన్నాడు. సూరకవి 18వ శతాబ్దివాడు; లక్ష్మణ కవి తత్పూర్వుడు. . సాంబ నిఘంటువు :- ఇది కస్తూరి రంగకవిచే రచింప బడినది. ఇతడీగ్రంథమును గణపవరపు వేంకటకవి ప్రణీతమైన వేంకటేశాంధ్రమును జూచి రచించి యుండునని విమర్శకుల యభిప్రాయము. ఆంధ్రనామ సంగ్రహము నందువలెనే దీనియందును దేవ, మానవ, స్థావర, తిర్యక్, నానార్థవర్గులు కలవు. కాని వేంకటేశాంధ్రమువలె ఇది ప్రౌఢముకాదు. ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్రనామ శేషము, సాంబనిఘంటువు నను నీ మూడును ఎక్కువ ప్రచారమును పొందిన నిఘంటుత్రయము. ఇవి మూడును కలిపియే ముద్రితములగుచున్నవి. పైడిపాటి లక్ష్మణకవి ఆంధ్రనామ సంగ్రహమునేకాక “ఆంధ్ర రత్నాకరము" అను మరియొక నిఘంటువును సైతము రచించినాడు. అదియు పద్యాత్మకమే. గణపవరపు వేంకటకవిచే రచింపబడిన " వేంకటేశాంధ్రము" సాంబనిఘంటువుకన్న విపులము, ప్రౌఢము, సలక్షణమునై యున్నది. ఇతడు "దేశీయాంధ్ర నిఘంటువు" అను మరియొక్క నిఘంటువును గూడ రచించెను. పూసపాటి వీరపరాజు "ఆంధ్రపదాకరము” అను నొక పద్యాత్మక నిఘంటువును రచించెను. ప్రెగడపువారి కందము లొక కాలమున నిఘంటుజ్ఞానమునకు ఉపయోగించునవియై ప్రచారమునందుండినవి. చౌడప్పసీసములు సయితము తెనుగుపదముల నెరుక పరచునవియై యొక నాడాంధ్రుల జిహ్వారంగమున తాండవించెను. నుదురుపాటి వేంకటకవి రచించిన “ఆంధ్ర భాషార్ణవము" ఉత్తమమైన ప్రాచీనాంధ్ర నిఘంటువు. దీనికి అకారాది క్రమములో పట్టిక తయారుచేసినచో ఎక్కువగా ఉపయోగపడగలదు. ఇది అమరకోళ పద్ధతిలో రచింపబడినది. మన పూర్వులు విద్యాత్మక ములుగా రచించిన నిఘంటువులలో ఇంతవరకు బేర్కొన్నవి మనకు లభించినవి. వీటిలో ముద్రితములు, అము ద్రితములును గలవు. ఇక మనకు లభింపక ఎన్ని కాల గర్భమున గలిసిపోయెనో తెలియదు. పై నిఘంటువు