Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మామూలుగా వంటలయందు ఉపయోగించు జీలకర్రనే ఉపయోగించవలయును. జీలకర్ర చూర్ణమును, పటిక బెల్లపు పొడియు, ఈ కల్కమునందు కలిపి త్రాగవల యు. ఇది ఉదయము పరగడుపున నే సేవించవలసి యున్నది. ఇట్లు మూడు దివసములు, మూడు ఉదయ కాలములయందు త్రాగవలయును. సేవనవిధి:- ఈ కల్కము త్రాగిన వెంటనే దిగువు చెప్పబడిన విధి ప్రకారము సిద్ధము చేయబడిన "సిరా”ను అయిదునుండి పదునైదు తులముల వరకు తినవలయును. ఆ దినమంతయు ఉప్పు, కారము, పులుపు గల పదార్థము లను తినరాదు. పాలు, పంచదారలతోగాని, తియ్యని చల్లతోగాని వరియన్నము భుజింపవచ్చును. పెనముపై వేపి, పండునిప్పులపై కాల్చిన గోధుమ రొట్టెలను ఈ "సిరాతోగాని పాలు పంచదారలతోగాని యథేచ్ఛగా తృప్తి యగువరకు భుజించవచ్చును. మధుర పదార్థమే యెక్కువగా తీసికొనుట మంచిది. ఈ ఔషధ సేవా కాల మున ఆహారవిధి యి యుండవలయును. నాలుగవ దినము మొదలు పులుపు, ఉప్పు, కారములను కొంచెము కొంచెముగా వాడుకొనుచు నేయి, పాలు, పంచదార లను తృప్తిగా తీసికొనుచు ఏడు దివసముల వరకు క్రమాభివృద్ధితో ఈ విధి ననుసరించవలయును. ఏడు దివసముల పిమ్మట స్వేచ్ఛాహార విహారములతో మెలగవచ్చును. ఆ ఏడు దివసములయందును పులుపు ఎంత తక్కువగ వాడిన అంత మంచిది. అట్లీ ఔషధ సేవ వలన ఆ సంవత్సర మంతయు ఎట్టి భయంకరమైన వ్యాధు లును దరిజేరవు. మరియొక విశేషము. ఈ ఔషధ సేవనము వలన శరీరమునగల ఔపసర్గిక రోగములన్నియు పోవును. బలము, వర్చస్సు కలుగును. ఆరోగ్యము సరిగానుండును. శుక్రరజో దోషములు పోయి సంతానము కలుగును. గర్భిణీస్త్రీలకు మూడవమాసమునందును, ఏడవమాసము నందును ఇచ్చు ఆచారము గలదు. దీనివలన సంతానమున కెట్టి మేహవ్యాధులును కలుగవు. తల్లి దండ్రులకుగల యే యితర వ్యాధులైనను సరే గర్భస్థ శిశువునకు అంట జాలవు. సిరా చేయు విధానము:- 3 1. గోధుమరవ తు 20 17 2. నేయి 3. పంచదార అంటువ్యాధులు(ఆయుర్వేదము) తు. 10 తు, 30 కల్పన :- గోధుమ రవను ఈ నేతియందు దోరగా వేయించి యుంచుకొన వలయును. పంచదారకు తగినట్లు పాకమునకు నీళ్ళుపోసి ఉడికించి, లేతపాకములోనే ఈ పాకును వడియగట్టి అంది రవ కలిపి మందాగ్నియందు తిరిగి పక్వము చేయవలయును. ఇక్కడి కిసిర సిద్ధమైనది. ఈ పరికల్పనచే భాగములను పెంచుకొని, యెంత ఎక్కు వగానైనను సిద్ధము చేసికొనవచ్చును. దీని యందు వచ్చి కర్పూరము (ముద్దకర్పూరము), కుంకుమపువ్వు, ఏల కులు, జాజికాయ, జాపత్రి చేర్చిన సుగంధముగను, పౌష్టికమ పౌష్టిక ముగను ఉండును. ఇందు సీమబాదము పప్పు చేర్చ వచ్చునుగాని అది యీ చెప్పిన భాగము ననుసరించి గోధుమ రవలో నాలుగవ భాగము చేర్చవలయును. అట్లు చేర్చు నెడల బాదము పలుకులను తగినంత నేతితో దోరగా వేయించి, మెత్తగానూరి పై పాకమునందు బాగుగా కలియునట్లు పొయి మీదనే వేసి దింపవలయును. మిగతా చెప్పబడిన సుగంధ ద్రవ్యము లన్నియు పొయి మీద నుంచి దించిన పిమ్మట వేసి, కలిపి, మూత మూయ వలయును. ఇది యే దినమున కాదినము చేసికొనిన మం చిది. అది రుచ్యము, బలవర్ధనము అగుటయేగాక ఔషధ సేవనానంతరము వెంటనే తీసికొనుటవలన పై త్యోద్రేక మును కలుగ నీయదు. పై ఒకటి, రెండు, మూడు యోగములును మచ్చున కీయబడినవి. ఇది గాక ఆయా ఋతువులందుగల కాలదోషముచే వాతోదకములు దూషితములై వ్యాపింపగల దుష్టము లైన శుద్ర వ్యాధు లంకురింప కుండునట్లు నిరోధించుటకై ఆయుర్వేద చికిత్సా సిద్ధాంతమునందు సంగ్రహింపబడిన అనేక దివ్యౌషధీ కల్పములు, సిద యోగములు కలవు. నీటిని, వాయువును శుభ్రముచేయుటకు అనేక ఉపాయ ములు చెప్పబడినవి. నీటిని బావులందుగాని, చెరువులందు గానీ శుభ్రముచేయవలయునన్న కొన్ని ప్రక్షేప ద్రవ్యము లను అందు వేయవలసి యున్నది. వాయువును శుభ్రము చేయుటకై ధూపములు, అగద భేరీ నినాదములు, ఔషధ లేపములతో కూడిన ధ్వజపతాకారోహణములు కలవు. అవి చరక సుశ్రుతములందును, అగ్ని, గరుడ పురాణము