ఆంటువ్యాధులు-ఎల్లోపాతి
లందును, వరాహ సంహిత, మానసోల్లాసము, అభిలషితార్థ చింతామణి, కౌటిల్య అర్థశాస్త్రములందును చూడవలయును.
కాలధర్మము ననుసరించి షడ్రుతువు లందును భిన్న భిన్నములగు ఆయా వ్యాధులు కలుగుచున్నను, విశేషముగ విసర్గ ఆదాన కాలములయందు మధ్య ఋతువులగు శరద్వసంతములు మిగుల భయంకరములగు వ్యాధుల కునికిపట్టు లని వర్ణింపబడినవి. విసర్గకాలము వర్షా శర ద్ధేమంత ఋతువులు. ఈ ఋతువులందు సూర్యుడు తన కిరణ ప్రసారమున భూమికిని, అందలి పదార్థములకును బలమొసంగును. ఆదానకాలము శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు. ఈ ఋతువు లందు సూర్యుడు తీవ్రమగు తన కిరణ ప్రసారముచే భూమి నుండియు, అందలి పదార్థములనుండియు సారవంతమగు బలమును లాగుకొనును. ఇది ఆయుర్వేద సిద్ధాంత పరిచయము.
దీని నిట్లుంచి విజ్ఞాన విషయ విశేషాత్మకములగు పురాణేతిహాసములయందు సహితము ఆయా ధర్మములుపదేశించు సందర్భములలో శరద్వసంతములు వ్యాధులకు ఆకరము అని చెప్పబడినది. కొమ్మనామాత్య పుత్రుడగు సోమయాజి తిక్కనామాత్యుడు తన ఆంధ్రీకృత మహాభారతమునం దిట్లు వర్ణించెను:-
అరయన్ సర్వజ నౌఘ నాశనములై
యత్యంత ఘోరమ్ములై
పరమవ్యాధి కరమ్ములయ్యు గడు శొ
భా స్ఫూర్తి నొప్పారి శాం
కరికిం బ్రీతి కరమ్ములై మిగుల వే
డ్కల్ జేయు లోకాళి కీ
శరథారంభ వసంతముల్ శమన దం
ష్ట్రా ప్రాయముల్ భూవరా!
ఇందు శరద్వసంతములు యముని కోరలవలె మహా అపాయకరము లని బోధింపబడినది. శరద్ధేమంతఋతువు అందలి కార్తీక మార్గశీర్ష కృష్ణ శుక్ల పక్షములు యమదంష్ట్రలుగా వర్ణించి "స్వల్ప భుక్తోహి జీవతి" కొద్దిగా ఆహారము చేయువాడే సుఖముగ జీవించునని ఆయుర్వేదమున చెప్పబడెను. అందుకనియే ఏ ఋతువులం దైనను సరే ఏ రోగములచేతను చిక్కకుండునట్లు మంచి నడవడిక కలిగియుండ వలయునని ఆయుర్వేద మాదేశించినది.
నరో హితాహార విహార సేవీ
సమీక్ష్య కారీ విషయే ష్వసక్తః
దాతా సమః సత్యపరః క్షమావాన్
ఆప్తోపసేవీ చ భవ త్యరోగః
చ. శా. 2-46
దేశ కాలములకును, శరీరమునకును హితములగ ఆహారవిహారముల నుపయోగించుటయు, మంచి చెడుల నాలోచించి పనుల జేయుటయు, ఇంద్రియ నిగ్రహము త్యాగ శీలతయు, సమత్వబుద్ధి, సత్యనిష్ఠ, ఓరుపు కలిగి జ్ఞానానుభవములు గల వారిని సేవించు నాతడు రోగముల పాల్పడక సుఖముగా నుండును.
మతి ర్వచః కర్మసుభానుబంధం
సత్వం విధేయం విశదా చ బుద్ధిః
జ్ఞానం తపః తత్పరతాచ యోగే
యన్యా స్తి తం నానుతపన్తి రోగాః
చ. శా. 2-47
భవిష్యద్భాగ్యోదయమును గోరు మనోవాక్కర్మములు కలిగి సాత్వికత, వినయము, వినిర్మల బుద్ధి, ఆత్మ వివేకము, తపోభిరతి, యోగతత్పరత ఎవరికి కలిగి యుండునో అట్టివారిని క్రూరములగు రోగములు వేధింపజాలవు.
మానవ ధర్మతత్వ బోధన మగు ఈ ఆయుర్వేద సిద్ధాంతాదేశమును అనుసరించి నడచినచో భయంకరము లగు అంటు రోగముల పాల్పడక వంశవర్ధనులై, శతాయుష్మంతులై, వీర్యవంతము, మేధాయుష్మంతమునగు సత్సంతాన సౌభాగ్య సంపదలు కలిగి, మనుజులు మనుజులుగా మనుష్యానందము సంపూర్ణముగా ననుభవించి దేవతాత్ము లగుదురు.
వే. తి. వెం. రా. స్వా.
అంటువ్యాధులు-ఎల్లోపాతి
ఘటసర్పి (డిఫ్తీరియా) :- ఇది ఘటనర్పి సూక్ష్మక్రిములవలన సంభవించును. ఇది తుంపరల వలన కలిగిన సంపర్క దోషమువలనను, రోగి ఉపయోగించిన గ్లాసులు,