Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశ చరిత్రము . III

రెడ్డిరాజ్యము (క్రీ. శ. 1320-1450): శైలపుర నామాంతరముగల కొండవీడు, నగరమని ప్రసిద్ధిగాంచిన రాజమహేంద్రవరము ముఖ్య రాజధానులుగ రెడ్డి రాజులు ఒక్కశతాబ్దము పైగా దాదాపు ఆంధ్రదేశము నంతయు స్వతంత్రముగా పరిపాలించిరి. క్షత్రియులతో సంబంధ బాంధవ్యములు కలిగియున్నప్పటికిని రెడ్డిరాజులు చతుర్థ కులజులు. వీరి మూలపురుషుడు దొంతి అల్లాడ రెడ్డి స్పర్శ వేధిని సంపాదించి ధనికుడయ్యెనను నొక కథ కలదు. ఈ వంశకర్త వేమారెడ్డి. అతని కొడుకు కోమటి ప్రోలా రెడ్డి ; మనుమడు ప్రోలయ వేమారెడ్డి.

ప్రోలయ వేమా రెడ్డి (1320- 56) రెడ్డిరాజ్య స్థాపకుడు. ఇతడు 1820 ప్రాంతమున ధరణికోటలో ప్రతాపరుద్రుని అధికారము ధిక్కరించి స్వాతంత్య్రమును ప్రకటించెను. తమ్ములసాయముతో రాజ్యమును విస్తరింప జేసెను. రాజధానిని అద్దంకికి మార్చెను. శత్రువులనుండి మోటుపల్లిని గెల్చెను. 1335 నాటికి తూర్పుతీరమంతయు జయించి కళింగమున విజయములను గాంచెను. 1345 ప్రాంతమున తురుష్కులనుండి బ్రాహ్మణాగ్రహారములను గెలిచి బ్రాహ్మణుల కిచ్చెను. 1352 లో కొంత రాజ్యము విజయనగరాధీశులకు ఓడిపోయెను.

కళింగ విజయములనాటికే, వేమారెడ్డి, కోరుకొండ రెడ్లను, పిఠాపుర కొప్పుల నాయకులను జయించియుండును. 1345 నాటికి కాపయ నాయకుని గెలిచెను. 'కళింగరాయమాన మర్దన' అను బిరుదు నరసింహ చక్రవర్తి (1328 - 54 ) పై విజయము సూచించును. ఇతని ప్రశస్తికి తార్కాణములుగ పాండ్యరాజ గజ కేసరి, రాచూరి దుర్గ విభాల, చెంజిమల చూరకార మున్నగు బిరుదులు కలవు. ఇతని ఆస్థానమున రామాప్రెగడ మహా మంత్రిగను, ప్రబంధ పరమేశ్వరుడగు ఎఱ్ఱాప్రెగడ ఆస్థాన కవిగను, కొండవీటి రాచవారి సుగంధవస్తు భాండా గారాధ్యక్షుడుగ ప్రసిద్ధికెక్కిన తిప్పయసెట్టి తండ్రి అవచి దేవయసెట్టి ప్రాపుగను ఉండిరి.

అనపోతా రెడ్డి (1356-1371) తండ్రి తరువాత రాజ్యమునకు వచ్చెను. ఇతని కాలమున రాజ్యపు ఉత్తర భాగమున తెలుగు చోళులు తిరుగబడిరి. ఇతని మోటుపల్లి వర్తక శాసనములు దేశ సౌభాగ్య సూచక ములు• అనపోతా రెడ్డి రాజ ధానిని కొండవీటికి మార్చెను.

1358 లో అనపోతా రెడ్డికి, ముమ్మడి ప్రోలవరము రాజధానిగపొలించుచున్న ఏరువ తెల్గుచోళులతో ఘర్షణము వచ్చెను. మూరవరము యుద్ధములో అనపోత రెడ్డి