ఆంధ్రదేశ చరిత్రము _ III
ఓడెనని చోడ శాసనములు చెప్పుచున్నవి. 1366 లో అన్న దేవచోడుడు రాజుకాగా అనపోతారెడ్డి అతనిని తరిమి తమ్ముని భీమలింగని సింహాసనముపై నిల్పెను. 1368-70 సం. మధ్య రెండుమార్లు వెలమలు ధరణి కోటపై దండెత్తిరి; రెండవసారి రెడ్లు విజయము గాంచిరి.
అన వేమా రెడ్డి (1371-86) అనపోతా రెడ్డి తమ్ముడు. ఇతని రాజ్యకాలమున దేశము సుభిక్షముగ నుండెను. ఇతడు అన్న దేవచోడుని అడచి, భీమలింగానికి కూతునిచ్చి పెండ్లి చేసెను. 1375 నాటికి దక్షిణ కళింగమున సామంత రాజుల గెలిచెను. 1376 లో వెలమల పై దండెత్తి గెలిచెను. 1385-86 లో కొంత రాజ్యమును విజయనగర రాజులు కోడిపోయెను.
కుమారగిరి రెడ్డి (1386-1404) రాజ్యకాలమున రాజ్యము విస్తృతి నందెను. దేశమున శాంతి నెలకొనెను, ప్రజలు సుఖించిరి; 1395 లో కుమారగిరి విస్తృతమైన తూర్పు రాజ్యమును విడదీసి రాజమహేంద్రవరము రాజధానిగా కాటయవేమా రెడ్డి కిచ్చెను. 1386 లో కాటయవేముడు కళింగముపై దండెత్తి మాక్లేది, వజ్రకూటము, వీరఘట్టము, రామగిరి గెలిచెను. 1387 లో వెలమలకు, విజయనగర రాజులకు సంధి పొసగెను. 1390 ప్రాంతమున రెండవ కళింగ జైత్రయాత్రలో సింహాచల, వింధ్యపర్వతములమధ్య గల రాజులు జయింపబడిరి. గజపతి - వీరనరసింహ IV (18374- 1424) ఓడి కప్పము చెల్లించెను. బహుమతులు పంపెను. కుమారగిరి వసంతరాయ బిరుదాంకితుడయి బహమనీ సుల్తాను (ఫిరోజ్ షా 1397-1428) తో స్నేహముగ నుండెను. హరిహరరాయలు II తన కుమార్తె హరిహరాంబను కాటయవేముని కొడుకు కాటయ కిచ్చి పెండిలి చేసిరి.
పెదకోమటి వేమారెడ్డి (1404-1420): ఇతడు సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదు వహించెను. ఈ వీరనారాయణుడు దిగ్విజయము చేసినట్లు వర్ణనము వేమభూపాల విజయములో కలదు. ఇతడు రాజమహేంద్రవర రెడ్డి రాజ్యముతో శత్రుత్వము పూనెను. వెలమలతోను, విజయనగర రాజులతోను విరోధించి రాజ్య విస్తృతిని జేసేను. అన్న దేవచోడుడు ఉండిరాజులతో స్నేహము నెరపెను. రాజమహేంద్రవరపు రెడ్లపై దండెత్తి అపజయము గాంచెను. బహమని సుల్తానుతో మైత్రి చేసికొనెను. ఉత్తరమున కాశీవరకును, దక్షిణమున రామేశ్వరము వరకును పోయి దానధర్మములను జేసెను. ఇతనికి సర్వజ్ఞ చక్రవర్తి అను బిరుదు కలదు. ఈతని యాస్థానమున శ్రీనాధమహాకవి విద్యాధికారిగ నుండెను. వాణిజ్య వంశధరుడగు అవచి తిప్పయ (తిరుమల నాథ) సెట్టి సుగంధవస్తు భాండాగారమునకు అధ్యక్షుడుగా నుండెను.
రాచ వేమారెడ్డి (1420-1432) : కొండవీటి రాజులలో కడపటివాడు. 1428-29 ప్రాంతమున శ్రీనాథుని వెలమ లింగమనేని కడకంపి 'నందికంత పోతరాజు' అను రెడ్లక త్తిని తెప్పించెను. ఇతడు ప్రజారంజకుడు కానందున ఒక భటునిచే చంపబడెను. విజయనగర దేవరాయలు II కొండవీటి రాజ్యముమ ఆక్రమించెను. 1432 నాటివి విజయనగర శాసనములు కొండవీటిలో గలవు.
'రాజమహేంద్రవర రెడ్డి రాజ్యము (1395-1450) : కాటయవేమారెడ్డి (1395-1416) ఇతడు కుమారగిరి రెడ్డికి ప్రధానియు, సేనాపతియునై యుండెను. తన ప్రభువు మరణించిన తరువాత కొండవీటికి శత్రువయ్యెను. అన్న దేవచోడుడు, పెదకోమటి వేమారెడ్డి యొక్కయు, వెలమ రాజుల యొక్కయు సాయముతో కాటయ వేముని ఓడించి, 'పూర్వ సింహాసనాధీశ్వర అను బిరుదు వహించెను. కాటయవేముడు దేవరాయల సహాయముతో అన్న దేవుని ఓడించెను. అన్న దేవుడు తురుష్కుల సాయమును సంపాదించెను. గుండుగొలను యుద్ధములో కాటయవేముడు హతుడయ్యెను. విజయనగర సైన్యములు ఓడిపోయెను. 1407 లో కాటయ వేముడు కళింగముపై దండెత్తి గెలిచెను. తురుష్కులతోపాటు 'పద్మనాయక రాజులు కాటయవేముని శత్రువులు. హరిహరరాయలు, దేవరాయలు I ఇతని మిత్రులు, బంధువులు.
కుమారగిరిరెడ్డి (1416): కాటయ వేముని కొమరుడు. స్వల్పకాలము పాలించి మృతుడయ్యెను. అంతట అతని సోదరి అనితల్లి రాజమహేంద్రవర రెడ్డి రాజ్యమునకు రాణి అయ్యెను.