Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(7) కర్దమవిసర్పము : కఫపి త్తజనితము. నోటి యందును అంగుటినుండి గొంతునందును కలు గును, దీనిని "డి ఫ్రీ రియీ” యని పాశ్చాత్యు లనిరి. ఇది గొంతునుండి పెద్ద పేగు ద్వారా హృదయము, ఆమాశయమువరకు వ్యాపిం చుటయు ప్రత్యేకముగ ఆమాళయమునందే జనించి గొంతు మూసికొనిపోవుటయు, ఆమా శయమునందును, గొంతునందును తీవ్రవేదన కలిగించుటయు గలదు. మహా భయంకర మగు వ్యాధి. 4. విస్ఫోటము : ఇది మూడు విధములు. (1) కాలస్ఫోటము: వాతోత్తరముగా కలది. శరీర మంతయు వేద నాత్మక ముగ ఉసిరిక కాయల వలె పెద్ద బొబ్బలు లేచును. (2) గళస్ఫోటము : వాతకఫోద్భవము. పైలక్షణ ములు కలిగి కంఠమునందు మాత్రమే బహిః ప్రదేశమున కలుగును, (8) విషస్ఫోటము: త్రిదోషజనితము. వీపునందును, వశుస్థలమునందునుకలుగును. దుశ్చికిత్సితము. ఇట్లీ మొ త్తము పూర్వోక్తములు 18 209 ఉభయము ఏకరాశిగా ధ్రువాంకము 222 ఇట్లు రెండువందల ఇరవై రెండుగా పరిగణనకు తేలిన ఈ అంటువ్యాధులలో రెండువందలతొమ్మిది వ్యాధులు తీవ్ర వేద నాత్మక ములుగాని, సద్యః ప్రాణహర ములుగాని కావు. ఇవి తెలియని బాధలను కలిగించుచు కాలాంతర ప్రాణహరణములుగా నుండును. జనవదోద్వంసకములగు పదుమూడు వ్యాధులును ఆరుచికిత్సావశ్యకత కలవి, తీవ్ర వేదనాత్మకములును, సద్యః ప్రాణహరణములును అయి యున్నవి. ఈ వ్యాధులకు "ముద్ర వ్యాధులనియు వాడుక. ఇందొక "మశూచికము” తప్ప మిగిలిన “విస్ఫోట, విషూచి, విసర్పములు” మహాత్వరితముగ ప్రాణములు తీయును. "మశూచికము” కొలది దినములు బాధించి చంపుటగాని, మనుజుని సౌందర్యహీనునిగా చేయుటగాని, చేయి, కాలు, కన్ను, ముక్కు, చెవి మొదలగు అవయవ ములయం దేదేని చెడగొట్టుటగాని చేసి విడుచును. 15 అంటువ్యాధులు (ఆయుర్వేదము) మిగిలిన విస్ఫోట, విసర్పములు, నాలుగైదు దినముల నుండి ఒక వారము వరకు మనుష్యుని చంపుటకు గడు విచ్చును. “విషూచి” మాత్ర మీ చంపుటయందు నిర్దాక్షిణ్య ముగ కొన్ని గంటలకన్న ఎక్కువకాల మవకాశమీయడు. భయంకరములగు ఈ వ్యాధుల నిదాన చికిత్సలన్నియుచరక, సుశ్రుత, వాగ్భట, బృందమాధవ, మాధవనిదాన, బసవరా తీయ, యోగరత్నాకరములందును, దైవవ్యపాశ్రయ చికిత్సాధారముగ కర్మవిపాకమునందును చూడనగును. జనపదోద్ధ్వంసక ములగు ఈ వ్యాధులు పుష్యమాసాం తము వరకుగల వర్షాశరద్ధేమంత కాలములయందు తరుచు కలుగుచుండుటయు, ప్రతిపల్లెపట్టులను, విశేషముగా పట్టణములను, సంగులసమరమువలె అల్లకల్లోలముగ చేయుటయు జరుగుచుండును. ఫాల్గున చైత్రము లాదిగా గల శిశిర వసంత గ్రీష్మములందు విషూచి మహాభయంకర ముగ వ్యాపించి తాండవ మాడుచుండును. శీఘ్రముగ బలమగు చికిత్స లభించనిచో ఈ విషూచి నూటికి మార్గు రను చంపియే తీరును. శాక్తేయు లీజనపదోర్ధ్వంసక ములగు వ్యాధులు దేవతా మహత్వము కారణముగా కలుగు నని దేవీతంత్రముల యందు వర్ణించిరి. దేవీభాగవత, త్రిపురా సిద్ధాన్తశేఖర, బిన్దులక్షణము లిందుకు ప్రమాణము. అందీవ్యాధులకు గ్రామదేవతా రాధనము, జంతుబలి, జపహోమాదికములు, శాంతి కరములుగా చెప్పబడినవి. కొలుపులనియు, జాతరలనియు ఈ విశ్వాసమున జనబాహుళ్యమునం దీనాడును వాడు కగ జరుపబడుచునే యున్నవి. అందుచేత వ్యాధులు దేశ వ్యాప్తములు గాకుండుటయు, శాంతిచెందుచుండుటయు చూడబడుచున్నది సత్య మేరైనను దేవతారాధనమును, ఈ జపహోమాది శాంతికర్మముల నాచరించుటయు ఆయుర్వేద మంగీకరించినది. ఇందు చరక ప్రమాణ మీట్లు కలదు. విమానస్థానము, 3 వ అధ్యాయము, పదు మూడవ శ్లోకమునుండి 214 శ్లోకము వరకునుగల అభి ప్రాయమిచట సూచింపబడినది. ప్రమాణమును కాంక్షించు వారు మూలమును చూడనగును. ఆ అభిప్రాయమిది: వికృతిచెందిన వాయు, జల, దేశ, కాలములు స్వభావ ముగ ఒక దానికంటే నొకటి బలమైనవిగా నుండును. గాలి