Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మహాకుష్ఠములు శుద్రకుష్ఠములు 7 11 2. జ్వరములు 3. క్షయలు 4. నేత్ర వ్యాధులు 5. ఔవసర్గిక ములు మొత్తము 18 8 20 96 67 209 ఈ సంఖ్యయందుగల ఔపసర్గికరోగముల వివరము కొంత విపులముగ తెలిసికొనవలసి యున్నది. స్త్రీపురుష సంసర్గములవలన కలుగు సంతానమార్గిక ములగు వ్యాధు లకు ఔపసర్గికము లని శాస్త్రపరిభాషయందు వాడుక. ఇవి సుఖసంకటములని తెలుగునాట ప్రసిద్ధ ములు. కొరుకు, సవాయి, (శ్వవాయువనునది సవాయిగామారి యీ నాడు వాడుక కలిగినది. ఈ వ్యాధి కుక్కల సంసర్గత వలన వ్యాప్తికి వచ్చినది. దీన ఈ పేరు కలిగినది.) బట్టంటు అను నవి ఇవియే. ఈశులమునందు అ నేక భేదములతో చిలవలు పలవలుగా ప్రాకిపోవు స్వభావముగల వ్యాధులు నానా నామరూపభేదములతో బహుముఖములుగ గలవు. ఇది వరకు అరువది యేడుగా చెప్పబడిన యీ వ్యాధుల పరి కల్పన మిట్లు చికిత్సాసౌకర్యమునకై చేయనైనది. ఔపసర్గిక వ్యాధులు 1. శుక్రదోషమువలన కలుగునవి. 2. రజోదోషమువలన కలుగునవి. 8. యోని వ్యాపత్తులవలన కలుగునవి. 4. అయోనిసంపర్కమువలన (నోరు, గుదము, హస్తము, మంచము) కలుగు వ్యాధులు. 5. విజాతియోని (ఆవు, గేదె, గుఱ్ఱము, గాడిద, మేక, కుక్క) సంపర్కము వలన కలుగువ్యాధులు. 6. దుష్టయోని సంపర్కమువలన కలుగు వ్యాధులు. మొత్తము 8 8 20 5 5 21 67 సాధారణముగ నీ యంటు వ్యాధులన్నియు భయంకర పరిణతి చెందునవియే. ఇవి యన్నియు విరూపంకరణము లును, బాధాకరములును, కాలాంతర ప్రాణహరము లును, వంశక్షయకరములును అయియున్నవి. అనగా ఈ వ్యాధులు తమ కాశ్రయ మొసంగినవారిని విడువక 13 అంటువ్యాధులు (ఆయుర్వేదము) ఆ జీవితమును బాధించుచు కొన్ని తరములవరకును వారి కుటు ంబములయందు నిలిచి అల్పాయుష్కము, దుర్బ లేంద్రియము, ఆజన్మ రోగపీడితము, విరూపము, కుడాప మును అగు సంతానమును కలిగించుచు తుదకు వంశ నిర్మూలన మొనరించి యంతరించును. కావుననే శుక్ర మును చెడగొట్టుకొనరాదని ఆయుర్వేదమున హితము ఉపదేశింపబడి యున్నది. "న వా సంజాయతే గర్భః పతతి ప్రస్రవత్యపి శుక్రం హి దుష్టం సాపత్యం సదారం బాదఠే నరం" “గర్భమే కాక పోవచ్చును. గర్భము నిలిచినచో స్రావ మగుటగాని లేక పిండము జారిపోవుటగాని సంభవించును. అందువలన చెడునడతలచే శుక్రము చెడగొట్టుకొనిన పురు షుడు స్వయముగ రోగపీడితు డగుటయేకాక భార్యను సంతానమునుగూడ సదారోగపీడితులనుగా చేయును" అని భారతీయఆరోగ్యశాస్త్రము సిద్ధాంతముగూడ చే సెను. ఇందుకనియే స్త్రీపురుష సంయోగములందు వయసు, కాలము, ఆహారము, వంశశుద్ధి (ఇచట వంశశుద్ధి యనగ వివాహమునకుముందు వధూవరుల కుటుంబములయందు తల్లిపక్షమున అయిదుతరములనుండియు తండ్రి పక్షమున అయిదు తరములనుండియు ఏవిధమగు చెడు వ్యాధులును లేకుండునట్లు చూచుకొనవలయుననుట. ఇట్లయిన మాతృ పితృపక్షములుకలిసి దశ పురుషాంతరములగును. ఇది వంశ శుద్ధియనబడును. వివాహ నిర్ణయము నందు మను, వామదేవ, గౌతమ, వసిష్ఠ, అగస్త్య, పులస్త్యాదులగు పదు నెనమండుగురు ఈ సిద్ధాంతమును జేసిరి. ఈ విష యములను శౌనక సూత్రములందును నృసింహ పారిజాత ప్రయోగమునందును చూడనగును.) మొదలగు విధి ని షేధము లనేకములు చెప్పి నీరోగము, వీర్యవంతము, తేజోవంతము, మేధావంతమును అగు సత్సంతానముతో విశుద్ధమగు జాతిని నిర్మించుటకై భారతధర్మర శాధికారు లగు పరిపాలకులు మంచి కట్టుదిట్టములు చేసిరి. మచ్చున కీప్రమాణములు చూడనగును. స్త్రీసంబంధే దళై తాని సుతరాం పరివర్జయేత్ హీనక్రయం నిష్పురుషం నిశ్చందో రోమశా ర్శనం