Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అంటువ్యాధులు (ఆయుర్వేదము) యందు చేర్చిన మొత్తము అంటువ్యాధులు రెండువందల యిరువది రెండుగా లెక్కకు తేలును. ఈ వ్యాధుల యొక్కయు కారణముల యొక్కయు వివరము లిట్లు తెలియన గును: మొద లీ యంటు వ్యాధులు కలుగుటకు చెప్పబడిన కారణములు తొమ్మిదియు, పదునెనిమిది భాగములుగా విభజింపబడును. ఆవివర మివిధముగ తెలియగలదు: (1) ప్రసఙ్గము: విశేషముగ కలిసియుండుట. ఈకలిసి యుండుట యనునది మూడువిధములు. 1. కౌగిలించుకొనుట. 2. మిథునధర్మమున రమించుట. 3. క్రీడించుట. (వనవిహారము, ఆటలాడుట, జలక్రీడ. ) (ప్రెసఙ్గమాలింగన రతిజలక్రీడాదీని.) స్మరదీపనము, ప్ర-3-సు 12. (2) గాత్రసంస్పర్శనము: పదేపదే శరీరమును తాకు చుండుట. ఇది మూడు విధములు. 1. ముద్దులాడుట. 2. ఒకరినొకరు కలిసికొని తిరుగులాడుట. 8. మాటిమాటికి రహస్యావయవములను ముట్టు కొనుచుండుట. దీనివలన రక్తమునందు ఉష్ణ తయు, శుక్రశోణితములయందు తేజనతయు, అవయవములయందు ఉద్రేకతయుకలుగును. (8) నిశ్వాసము : రోగినోటితో విడుచుగాలిని పీల్చుట. (నిశ్వాసమనగా పనివలన శ్రమచెందిగాని, లేక వ్యాధివలన అలసట చెందిగానీ నోటి వెంట విడుచు శ్వాసమునకు పేరు.) (4) సహభోజనము : కలిసి భుజించుట, ఇది నాలుగు విధములు. 1. రోగితో కలిసి ఒకేపాత్రయందు భుజించుట. 2. రోగి తిని విడిచిన ఆహారమును భుజియించుట. 8. రోగి చే పెట్టబడిన ఆహారమును భుజియించుట. 4. రోగితో సరసన పంక్తియందు భుజించుట. (5) సహళయ్య : ఒకేపడక నుపయోగించుట. ఇది రెండు విధములు. 1. రోగి పండుకొనుచున్న పక్క యందు పండు కొనుట. 2. రోగితో కలిసి పండుకొనుట. (6) సహాసనము : ఒకే వేదిక నుపయోగించుట. రెండువిధములు. 1. రోగి కూర్చుండుట కుపయోగింపబడుచు పీట, చాప, అరుగు వీటిపై కూర్చుండుట 2. రోగితో కలిసి ఒకేయాసనమున కూర్చుండు (1) వస్త్రము : రోగి ఉపయోగించిన బట్టలను ఉపయోగించుట. (8) మాల్యము : రోగిధరించిన పూవులను, మాలల ధరియించుట. అ (3) అనులేపనము : రోగి ఉపయోగింపగా మిగి గంధము, సున్నిపిండి మొదలగు మైపూతల వాడుక చేయుట. ఈ పదు నెనిమిది కారణములను ఆధారముగా చేసికొ శరీరమున గల వాతపిత్తకఫము లనబడు త్రిదోషము ఎగుడు దిగుడులై పెడత్రోవలను బట్టి, అనులో మవిలో గతులచే (అనులోమగతి-వాతాదిదోషము లొక దానియ దొకటి కలిసి లీనమై పుష్టినొందించుకొనుచు తిరుగు విలో మగతి—ఒక దానినొకటి రెచ్చగొట్టి ఉన్మార్గగాము సంబంధములేక చరించుట. దోషములకు అనులోమ, యనునది ఆరోగ్యమునకు కారణము, విలోమ గతి య నది అనారోగ్యమునకు కారణము.) త్వగ్రక్తమా మేదోస్థిమజ్జా శుక్రము లను సప్తధాతువులను చెడగొ రెండు వందల తొమ్మిది గతులు గలవిగా అంటురోగమ వ్యాప్తికి వాహకము లగును. వీటి విభజన మిట్లు గల ' దీనికి అంశాంశ కల్పన మని పేరు. ధాతువికల్పము 1. కేవల వాతాంతర్జనిత ములు 2. కేవల పిత్తాంతర్జనితములు 3. కేవల కఫాంతర్జనితములు 4. సప్త ధాతుపరిణామాంతర్జనితములు 5. దేశ భేదాంతర్జనితములు 1. కుష్ఠములు మొత్తము 1( 1 2( వ్యాధివికల్పము

12