ఆళియ రామరాయలు
దిగెను. తన తమ్ముడైన వేంకటాద్రిని గోల్కొండ పైకి బంపి రామరాయలు కల్యాణిపై సేనలను నడిపించెను. ఇది విని నైజాంషా, కుతుబ్ షాలు ముట్టడిని విరమించి తమతమ రాజ్యముల కేగిరి. రాయలు అహమ్మదు నగరము వరకు నేగి, నిజాంషా తన ఆధిపత్యమును అంగీకరించున ట్లొనరించి గోల్కొండపైకి మరలెను. ఇంతలో రాయలు ఆజ్ఞపై కొండవీటి ప్రభువైన సిద్ధిరాజు, తిమ్మరాజు, కొండపల్లి, మచిలీపట్టణములమీదను, వేదాద్రి, సీతాపతు (చిత్తావఖాను) లు ఏలూరు, రాజ మహేంద్రవరములమీదను దండెత్తిరి. ఇట్లు తన రాజ్యము నాలుగు మూలలపై శత్రువులు దండెత్తుటను కుతుబ్ షా గమనించి రాయలదృష్టి మరలించుటకు కొండవీటిపై దండయాత్రకు ఉద్యమించెను. కాని గోల్కొండ సైన్యమును ఓడించి తరుముచు యెర తిమ్మరాజు, వెలుగోటి చినతిమ్మరాజు అనువారు దేవరకొండ, దేవులపల్లి, నల్లగొండ, ఇంద్రకొండ మున్నగు దుర్గములను ఆక్రమించిరి. కోవిలకొండ, పానగల్లు, గణపురము రాయల స్వాధీనమయ్యెను. గత్యంతరములేక కుతుబ్ షా రాయలకు గణపురమును, పానగల్లును ఒసగి ఆతనితో సంధి చేసికొనెను.
ఈ విధముగ దక్కను సుల్తానులందరును రామరాయల శౌర్య పరాక్రమములకు దోసిలొగ్గి, ఆతని ఆధిపత్యమును అంగీకరింపవలసినవారైరి. దక్షిణ రాజకీయములందు ఆతనికత్తికి ఎదురుకత్తి లేకుండెను. కాని ఈమహోత్కృష్ట బల గౌరవములే విజయనగర సామ్రాజ్యపతన హేతువులు అయ్యెను. రామరాయల విశృంఖల వీరవిహారములను అరికట్టనిచో తమకు ముప్పుతప్పదనియు, దినదినాభివృద్ధిని పొందుచున్న విజయనగర సామ్రాజ్యము తమ రాజ్యము లను కబళింపగలదనియు, దక్కను సుల్తానులు భయపడి పరస్పర విద్వేషములను మాని హుస్సేన్ నిజాంషా, ఇబ్రహీంకుతుబ్ షాల ప్రోత్సాహముతో, ఒక కూటమిగా ఏర్పడిరి, ఆలీ ఆదిల్ షా కూడ కృతఘ్నుడై వారితో కలిసెను.
రాక్షసి = తంగడియుద్ధము : 1565 :- సుల్తానుల కూటమి రామరాయలపై యుద్ధమును ప్రకటించి దండెత్తి వచ్చెను. రాయలు ఆ వర్తమానమును విని అపార సైన్యముతో వారి నెదుర్కొనేను, కృష్ణానదికి దక్షిణమున 10 మైళ్ళ దూరమునందున్న రాక్షసి - తంగడి అను గ్రామములకు మధ్యనున్న మైదానముపై ఉభయసైన్యములును తారసిల్లెను. 1564 డిశెంబరు 26 నుండి 1565 జనవరి 24 వరకు యుద్ధము జరిగెను. దీనినే తళ్ళికోట యుద్ధమని సాధారణముగ వ్యవహరింతురు. రామరాజు వృద్ధుడైనను యుద్ధభూమిలో వీరవిహార మొనరించి, సైనికులలో ధైర్యోత్సాహములను ఇనుమడింప జేసెను. ప్రథమమున విజయలక్ష్మి రాయలనే వరించెను. నిజాంషాకుతుబ్ షాలు యుద్ధభూమి నుండి సుమారు ఇరువది మైళ్ళు వెనుకకునడచి, మాయోపాయమున రామరాయలను జయించుతలంపుతో, సంధికై సంప్రతింపులు ప్రారంభించిరి. విజయనగర సైన్యములు ఈ మోసమును గ్రహింపక విజయగర్వముతో శిబిరరక్షణ విషయమున ఏమరియుండిరి. ఇంతలో రామరాయల పక్షమందలి మహమ్మదీయ సర్దారు లిద్దరు సుల్తానులతో చేరిరి. తుదకొక అర్ధరాత్రమున మహమ్మదీయులు విజయనగర సైన్యము పై బడిరి. హిందువులు ధైర్యసాహసములతో పోరాడిరి కాని, లాభము లేకపోయెను. రామరాయలు పట్టుబడి నైజాం షా చేత వధింపబడెను. మహమ్మదీయులు భయభ్రాంతులైన హిందూ సైనికులను చుట్టుముట్టి వధించిరి. అనాయకమై, రక్షణరహితమైన విజయనగరము మహమ్మదీయులకు వశమై నామరూపములు లేకుండ ధ్వంసము చేయబడెను. ప్రపంచమున సాటిలేనిదని కీర్తి నార్జించిన మహానగరము రామరాజు మరణముతో హఠాత్పరిణామమును బొంది శ్మశానముగ మారిపోయెను.
రామరాజుకుటుంబము : రామరాజునకు నలుగురు భార్యలుండిరి. అందు కృష్ణరాయల కుమార్తెయగు తిరుమలాంబ అగ్రమహిషియై యుండెను. జిల్లేళ్ళ పెద నంది రాజయ్య - దేవమహారాజు పుత్రికయగు అప్పలాంబయు, పోచిరాజు తిమ్మరాజయ్య కుమార్తె అయిన కొండమ్మ, లక్ష్మమ్మలును, ఇతర భార్యలు. రామరాయలకు కృష్ణరాజు, పెదతిమ్మరాజు, కొండరాజు అనుకుమారులుండిరి. రాయలతోబాటు వీరు సుల్తానులతో జరిగిన యుద్ధములందు పాల్గొనిరి. రాక్షసి - తంగడి యుద్ధానంతరము పెదతిమ్మరాజు విజయనగరమున అధికారము