అస్సామీ భాషా సాహిత్యములు
తాలూక్ దార్ మున్నగువారు నవలారచయితలలో పేర్కొనదగినవారు.
ఇయ్యుగమున కథానికా (Short Story) రచనము విశేషముగా పెంపొందెను. శరచ్చంద్ర గోస్వామి నిరంతర శ్రద్ధతో నీవాఙ్మయ ప్రక్రియ నారాధించెను. 1930 వ సంవత్సర ప్రాంతమున ఉత్తమకథకు లనేకులు బయలుదేరిరి. మహిచంద్రవరా, హలిరామడేకా అను కవులు హాస్యరస విశిష్టములును, అవహేళనాత్మకములును అయిన కథలను రచించిరి. బిణా బారువా, రమాదాసు, మునీన్ బర్కటకీ, కృష్ణభూయా. నగేంద్ర నారాయణ చౌధురీ, త్రైలోక్యనాధ గోస్వామి అను వారు కథారచనయందు ప్రసిద్ధినొందిన మరికొందరు. లక్ష్మీధర శర్మ వ్రాసిన కథలలో వివేక గాంభీర్యము, అసాధారణ భాషాపటిమ తేటపడును. అబ్దుల్ మాలిక్ అనునతడుతన కృతులందు ప్రవ్యక్త ములయియున్న బీద వారియందలి సానుభూతి, అనర్గళ భాషా విభుత్వము అను గుణములచే అత్యంత సమర్థుడగు కథకుడుగా గణుతికెక్కెను.
లక్ష్మీనాథ బజ్ బారువా అను కవి రచించిన సారస్వత వ్యాసములకు పిదప చిత్ర సేన జఖరియా అనునాతడు సుబోధ మగు వ్యాసగుచ్ఛమును వ్రాసెను. తరుణరామ్ పుకను అనుకవి వేటను గూర్చి వ్రాసిన కథలు రమ్యమయిన ధారాశుద్ధితో నలరారుచున్నవి. సూర్య కుమార భూయా, సోణారామ, చౌధురీ, ఆనంద చంద్ర ఆగర్వాలా మున్నగు రచయితలు విశిష్టములైన పెక్కు వ్యాసములను వివిధములయిన పత్రికలలో ప్రచురించిరి. వాణీకాంత కాకతికవి ప్రాచీనమును, అర్వాచీనము నయిన అస్సామీసారస్వతమును ఆధునిక విమర్శనదృష్టితో పరామర్శించెను. విరించికుమార్ బారువా, ఉపేంద్ర చంద్రలేఖారు, తీర్థనాథశర్మ, మహేశ్వర్ నియోగ్ మొదలగు యువకవులు 1930-40 సారస్వత రంగమున కృషి చేయగడగిరి.
సుమారు 1940 వ సంవత్సర ప్రాంతమున నూతన విమర్శన దృష్టిగల క్రొత్తతరమునకు చెందిన కవులు అప్పటికి అమలులోనున్న సారస్వత నియమములపై తిరుగుబాటు కావించిరి. అప్పటికే కథానికారచన యందు మానసికవృత్తి పృథక్కరణమునకు (psycho-analysis) స్థానము లభించెను. స్వేచ్ఛా వృత్తములను అల్పసంఖ్యాకు లయిన కవులు వాడిరి. లక్ష్మీనాథ బజ బారువా రచించిన నూతనజీవిత చరిత్రయందు ఈ నూత్న విమర్శన దృక్పథము ప్రకాశము నొందెను.
ద్వితీయ ప్రపంచ సంగ్రామమువలన అస్సామీజనుల సుఖమయ జీవితమున నొక విలక్షణమయిన అలజడి కలిగెను. సారస్వతాభివృద్ధి కుంఠిత మయ్యెను. మరల ప్రచురింపబడదొడగిన పుస్తకముల యొక్కయు, పత్రికల యొక్కయు—— ధోరణినిబట్టి చూడ వాటి యందలి ప్రాచీన సారస్వత - ఆదర్శభంగము భయావహమయి కన్పట్టెను. కృశించిన అస్సామీ సారస్వతముపై దూరస్థములును, సమీపస్థములు నయిన అనేక సారస్వతముల యొక్క ప్రభావము పడుటచే నది మిక్కిలి వికృతి నొందెను. అట్టి వికృతి ముఖ్యముగా కవిత యందు గోచరించెను. ఈకవిత్వమును కవులు ఉత్సాహముతో జయప్రదముగా సాగించిరి. అమూల్య బారువా, నవకాంత బారువా, హేమ బారువా, హరివర కాకతి మున్నగు కవులు విశ్వవాఙ్మయము యొక్క భిన్న భిన్న ప్రక్రియలను సోత్సాహముగ ప్రచురింపదొడగిరి. ఈ కవి బృందములో నవకాంత బారువా అను కవి అత్యుత్తముడుగా ప్రశంసనొందెను. వీణా బారువా అనునతడు రచించిన జీవనర్ బాటాత్ అను రచనయు, రాధికా మోహన గోస్వామికృత మైన చాక నైయా అనుకృతియు, నవకాంతబారువా అను కవిచే రచింపబడిన కపిలి పరీయా సాధు అను రచనయు, అత్యుత్తమ నవలలుగా నెన్నదగి యున్నవి. మహమ్మదు పియారు మొదలగువారు చిన్న చిన్న నవలలను ప్రచురించిరి. కథానికా రచనము ఇప్పటికిని ప్రబలముగానున్నది. జోగేశ దాస ప్రభృతులు కథానికా రచనయందు కృతహస్తులైరి.
అస్సామీ వాఙ్మయమున ఏకాంకికా రచనమింకను పరిణతినొందియుండలేదు, కళాభిమానులయిన (Amateur) నటకులు దీనిని ప్రదర్శన యోగ్యముగా గ్రహించిరి. ఆలిండియా రేడియో గుహావాటి (Gauhati) వారొసగిన దోహదముచే 'ఏకాంకికా రచన పెంపొందుచున్నది. వీణాదేవి' రచించిన 'ఏబేలార్ నాట్' అనునది ఒక అత్యుత్తమ కృతియై యున్నది. అందు ఒక చిన్న సంఘటనము అనగా