అస్సీరియా
నొక మధ్యమతరగతి కుటుంబమునకు చెందిన రెండుతరముల వారికి ఘటిల్లిన భావసంఘర్షణము చక్కగా వివరింప బడినది.
అస్సామీ వాఙ్మయమునందలి జానపద కవితాసంపత్తి చెప్పదగినది. అది గుణముచేతను, విషయముచేతను వైవిధ్యము నొందినది. వనగీతములు, బిహుగీతములు, వివాహగీతములు, జోలపాటలు, బాలక్రీడా గీతములు, బారమాహీగీతములు, ద్వాదశమాసగీతములు, పడవ పాటలు మున్నగునవి ప్రకృతమునకు ఉదాహరణములు. అనేక జానపదకథలును కలవు ! వాటికి నడుమ నడుమ లలితములును కరుణ రసాత్మకములు నైన పాటలు ఇమిడియుండును. అస్సామీ వాఙ్మయమున వీరగీతములును పెక్కులు గలవు. చరిత్రాత్మక గీతములలో వదన -బరఫు కనరగీతము పేర్కొనదగినది (క్రీ. శ. 19-వ శతాబ్ది). అస్సామీ వాఙ్మయమున సారస్వత వ్యాసములను వ్రాసిన వారిలో మహేశ చంద్రదేవ గోస్వామియు,తదితరులైన యువకులు అనేకులును కలరు. ఈ వాఙ్మయమున సారస్వత విమర్శనముకూడ విశేషముగా పెంపొందినది. ఉపాధ్యాయ వృత్తికి చెందిన కొందరు విమర్శకులు ఆధునిక సమస్యలపై వ్రాయుటకు బదులుగా ప్రాత విషయములను గూర్చి మాత్రమే వ్రాసిరి. మొత్తము మీద ఆధునిక సారస్వత వాతావరణము సజీవముగా, వీర్యవంతముగా, ఆశాజనకముగా నున్నదని చెప్పనగును, {{right|డా. మ. ని.
అస్సీరియా :- అస్సీరియాయను నామముతో నేడు మనము వ్యవహరించుచున్న దేశమునకు అస్సీరియా భాషలో "అషుర్" అనియు, పారసీక భాషలో "అధుర” అనియు పేళ్లు ఉండెను. ప్రాచీన కాలమున ఈ దేశీయులు గొప్ప రాజ్యమును స్థాపించి వీరులని పేరుగాంచుటయే గాక, చక్కని నాగరికతను పెంపొందించుకొనిరి. ఐరోపాఖండ చరిత్రలో రోమకజాతివారి కెట్టి ప్రశస్తి గలదో, ఆసియా ఖండమునందు అస్సీరియావారికీ కూడ అట్టి విఖ్యాతియే కలదు.
అస్సీరియా నేటి మెసొపొటేమియా దేశములోని ఉత్తర భాగము. దీనికి ఉత్తరమునను, తూర్పునను కొండల వరుసలును, దక్షిణమున ప్రాచీన బాబిలోనియా రాజ్యమును, పశ్చిమమున సిరియా ఎడారియు కలవు. అస్సీరియా రాజ్యముగుండ టైగ్రిసునది తన ఉపనదులతో కూడ ప్రవహించి, అచ్చటి భూమిని సారవంతముగా చేయుచున్నది. పురాతన కాలమునుండియు అచ్చటి జనులు ఆవులు, గొజ్జెలు మున్నగు పాడి జంతువులను గుఱ్ఱములు, ఒంటెలు మున్నగు భారవాహక జంతువులను పెంచెడివారు. అస్సీరియా దేశమున భరింపరాని వేడిమి కాని, చలికాని లేక సమశీతోష్ణస్థితి యుండును. కావున ఇచ్చటి ప్రజలు దృఢగాత్రులుగను వీరులుగను ఉందురు.
ప్రాచీనకాలపు అస్సీరియా నగరముల శిథిలములు ఇటీవలనే బయలుపడినవి. ఇందు టైగ్రిస్ నదీతీరమున నెలకొనిన అషుర్ పట్టణమును, అస్సీరియా రాజ్యమునకు ముఖ్య పట్టణముగ నుండి విఖ్యాతిగాంచిన నైనివా నగరమును, కాలా, దుర్ షరూకిన్, అను ప్రాచీన నగరములు ప్రత్యేకముగ పేర్కొనదగినవి. ఇచటి శిధిలావశేషములను పరీక్షించుటవలన, అస్సీరియా దేశపు ప్రాచీన చరిత్రను గూర్చి అనేక నూతనాంశములు తెలియవచ్చినవి. ఆ ప్రాచీనయుగమువా రొక ప్రత్యేకమగు లిపినివాడెడి వారు. ఇటుకలవంటి మట్టిదిమ్మలపై ఆ లిపితో అనేక ముఖ్యాంశములు వ్రాయబడియున్నవి. ఆ వ్రాతల నుండియు, పురాతనయుగమునాటి కట్టడములనుండియు వాటి యందలి శిల్పములనుండియు, అస్సీరియా జాతి చరిత్ర సంగ్రహింపబడినది.
సుమారు ఆరువేల సంవత్సరములకు పూర్వము అస్సీరియా దేశమున జనులు నివసించుచుండినట్లు నిదర్శనములు కలవు. ఈజాతి వారికిని బాబిలోనియాలోని సుమేరు జాతివారికిని పెక్కు సామ్యములు కలవు. కావున వీరు సుమేరులై యుండవచ్చును. ఈప్రజలు మిక్కిలి ప్రాచీనమగు "అషుర్" అను పట్టణమును నిర్మించిరి. కొన్ని శతాబ్దులు గడచిన వెనుక ఈ పట్టణము అగ్నిపాలై నశించెను. క్రీ. పూ. 2500 ప్రాంతమున అస్సీరియా దేశమునకు అక్కాడులు అను ఒక నూతన జాతివారు వలస వచ్చిరి. వీరు స్థానికులగు ప్రజలతో కలసిపోయి ఒక నూతన జాతిగ మారిరి, ఈ నూతనజాతి వారు స్థానికపరిపాలనములలో స్వతంత్రులుగనుండియు, బాబిలోనియా రాజుల