అస్సామీ భాషా సాహిత్యములు
హరణము' లోక ప్రసిద్ధమైనది. అందు ఉషానిరుద్ధుల ప్రణయకథ వర్ణితమైనది. అతడు భాగవతమునందలి అనేక
స్కంధములను అనువదించెను. రామాయణమును స్వతంత్ర కావ్యముగా రచించెను. మాధవ కందళి కవి యొక్క భావాది చౌర్య మీతని కృతులందు కొంతవరకు కనుపించును. రామసరస్వతి కవి ప్రచురముగా మహా భారత విషయములను చేపట్టి వ్రాసెను. వాటిలో నతడు ముఖ్యముగా వనపర్వమును విపులముగా పెంచుచు కొన్ని విషాదాంత కావ్యములుగా రచించెను. (ఇట్టి రచనయందు అతనికి 'సాగర్' ఖరి' వంటి అనుయాయులు అనేకులు కలరు. సాగర్ ఖరి కవి 'ఖటాసుర వధ'ను వ్రాసెను.) సరస్వతీకవి 'భీమ చరితము, అను మృదుహాస్య భరితమైన కావ్యమును రచించెను, శ్రీధర కందళికవి రచించిన 'కాన్ భొవా' (కర్ణభక్షకుడు) అను రచన మరియొక రమ్యమై హాస్యరస విశిష్టమైన కావ్యము. ఇక్కవి ఘును (గుండి) చా= యాత్రా అను కావ్యమును కూడ నిర్మించెను.
గోపీనాథ పాఠకకవి (క్రీ. శ. 17 వ శతాబ్ది ప్రారంభము), దామోదర దాసకవి, లక్ష్మీనాథ ద్విజకవి, పృథురామ ద్విజకవి మున్నగు నితర రచయితలు మహాభారత భాగములను పద్యరూపమున అస్సామీ భాషలోనికి అనువదింప గడగిరి. హృదయానంద కాయస్థ కవియు తదితరులయిన అప్రధానకవులును రామాయణ భాగములను భాషాంతరీకరించిరి. 19 వ. శతాబ్ది యొక్క ఆదియందు శ్రీకంఠ సూర్య విప్రకవి, హిందీభాషలోని తులసీదాసు యొక్క 'రామచరిత మానస' మను గ్రంథమును పద్య కావ్యముగా అస్సామీ భాషలో వ్రాసెను. గోవింద మిశ్రుడు, రత్నాకర మిశ్రుడు, భగవద్గీతను అత్యంత సామర్థ్యముతో పద్యరూపమున రచించిరి. గోపాల చరణ ద్విజుడు (క్రీ. శ. 16. వ. శతాబ్ది), భవానంద మిశ్రుడు (క్రీ. శ. 16 వ. శతాబ్ది), విద్యాచంద్ర భట్టాచార్యుడు (18 వ. శతాబ్ది) అను కవులు హరివంశమును చక్కగా అనుసరించి వ్రాసిరి. పిదప పురాణములు అనేక పద్య రచయితల దృష్టి నాకర్షించెను. కాని అత్యుత్తమకవులు తమ దృష్టిని భాగవతపురాణముపై ప్రసరింపజేసి రని చెప్పవచ్చును. శంకరదేవకవి, అనంతకందళికవి, అనిరుద్ధ
కాయస్థకవి, కేశవదాస కాయస్థ కవి, నిత్యానంద కాయస్థ కవి (క్రీ. శ. 17 వ శతాబ్ది), తదితరులును భాగవత పురాణ రచనా నిమగ్నులైరి. ఇతర పురాణములను అనువదించిన వారును, అనుసరించి వ్రాసిన వారును ఈ క్రింద పేర్కొనబడు చున్నారు. విష్ణుపురాణమును భాగవత మిశ్రుడును (క్రీ. శ. 17 వ శతాబ్ది); బృహన్నారదీయ పురాణమును భువనేశ్వర వాచస్పతి మిశ్రుడును (క్రీ. శ. 18 వ శతాబ్ది ఆదియందు): ధర్మపురాణమును కవిచంద్రద్విజుడును (క్రీ. శ. 18 వ శతాబ్ది); బ్రహ్మ వైవర్తపురాణమును బలరామద్విజ- దుర్గేశద్విజులును(క్రీ. శ. 18 వ శతాబ్ది); మార్కండేయ పురాణమును రుచినాథ కందళియు (కీ. శ. 18 వ శతాబ్ది), రంగనాథ చక్రవర్తియు (క్రీ.శ. 17 వ శతాబ్ది) వ్రాసిరి.
ప్రాచీనమైన అస్సామీ సాహిత్యమునందు పెక్కు పద్యకథా కావ్యములు (Verse Romances) ను కలవు. కలాప చంద్ర కృతమైన 'రాధా చరితము,' రామద్విజ కవి రచితమైన మృగావతీ చరితము, ద్విజవర ప్రణీతమైన మాధవసులోచనో పాఖ్యానము, ప్రకృతమునకు ఉదాహరణములు. సంచారకవియగు రాజసూర్య విప్ర కృతమైన శియాల్ గోసాయీ (The fox-Saint C 1616) అనునది ఒక అద్వితీయమైన పద్యకథా కావ్యము. రామానందద్విజకవి వ్రాసిన మహామోహకావ్యము కృష్ణ మిశ్రుని ప్రసిద్ధమైన ప్రబోధ చంద్రోదయము నాధారముగా చేసికొని వ్రాయబడినది. హితోపదేశమును. 'ద్వాత్రింశత్పుత్తళిక'ను రామమిశ్రకవి అనువదించెను. (1654-63)
శంకరదేవుడును, మాధవదేవుడును రచించిన వర గీతములను అస్ఫామునగల వైష్ణవ మహంతులు ఆనేకులు అనుకరించిరి. ఇట్టి అనుకరణమునందు గోపాలదేవుడు, అనిరుద్ధుడు, శ్రీరాముడు, యదుమణి, రామానందుడు. అను కవులు కొంత విశిష్టతను గాంచిరి. ఈ కృష్ణగీతములకు 18 వ శతాబ్ది ఆరంభమున రచితములైన శాక్త గేయములును, రాధాకృష్ణ గేయములును చేరినవి. ఈ గేయములను రుద్రసింహుడు (క్రీ.శ. 1696-1714), శివసింహుడు (క్రీ. శ. 1714- 44) అను రాజులును, వారి రాజ్య కాలములందున్న కవులును వ్రాసిరి. అట్టి కవులలో