Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/466

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అస్సామీభాషా సాహిత్యములు


విఖ్యాతుడు రామనారాయణకవిరాజ చక్రవర్తి, అతడు గీతగోవిందమును, బ్రహ్మవైవర్త పురాణమునందలి కృష్ణజన్మ ఖండమును, పురాణాంతర్గత మేయైన ప్రకృతిఖండమునందలి తులసీ - శంఖచూడ ఉపాఖ్యానమును అనువదించెను. అతడు శాకుంతల కావ్యమును కూడ వ్రాసెను. రామచంద్రవర పాత్రుడు అను రాజకీయోద్యోగి యోగినీ తంత్రమును కొంతవరకు అనువదించెను. ఆనందలహరిని అనంతాచార్యుడు అస్సామీ పద్య కావ్యముగా వ్రాసెను. 'మనసా' అను సర్పదేవత యొక్క పూజావిధానము నారాయణదేవుడు రచించిన పద్మపురాణమునందు ప్రశంసింపబడినది. శంకరదేవ కవియొక్క శైలిని మహాదేవకవియొక్క శైలిని, పురస్కరించుకొని వైష్ణవ సంస్థలకు చెందిన పెక్కురు ఉత్తమ పురోహితులు రూపకములను రచించిరి.

దైత్యారిభూషణుడు, వైకుంఠుడు అను కవులు జీవిత చరిత్ర రచనకు ఆరంభకులు. వారందరును శంకర దేవకవియొక్క జీవిత చరిత్రలు రచించిరి. పిమ్మట వచ్చిన కవులు ఆ యాచారమును పాలించిరి. సూర్యఖరి దైవజ్ఞుడును (క్రీ. శ. 1798), రతీకాంతుడును (క్రీ.శ 18 వ శతాబ్ది) తదితరులును అస్సామీయులయిన కోచిరాజుల వృత్తాంతములను పద్యకావ్యములుగా వ్రాసిరి, 19 వ శతాబ్దియందుకూడ "విశ్వేశ్వరుడు, దుతీరాముడు అను నిరువురు కవులు పద్య రూపమున 'ఆహోమరాజ్య పతన చరిత్ర'ను రచించిరి. వ్యావహారిక (useful) కళలను గూర్చి వ్రాయుటకుకూడ పద్యమే ఉపయోగింపబడెను. వకుళ కాయస్థకవి వ్రాసిన కితాబత్ - మంజరి (క్రీ. శ. 1434 సం.) ఇందుల కుదాహరణము. అందు గణితము, ఆయవ్యయ లేఖనము (Book keeping), క్షేత్ర పరిమాపనము (Land Survey) వివరింప బడినవి.

అస్సామీ వచనకావ్యము ప్రజలమైన సంప్రదాయము కలది. ఆ వచనమునకు శంకరదేవుడు, మాధవదేవుడు రచించిన రూపకములు ముఖ్యోదాహరణములు. అవి ప్రజబులి భాషాసంప్రదాయానుసారముగా వ్రాయబడినవి. వైకుంఠ నాథకవి (క్రీ.శ. 1588-1638) భాగవతమును, భగవద్గీతను ప్రౌఢమయిన వచనములో అనువదించెను, వాటిలో నతడు ప్రాచీన కవుల కృతక శైలిని వాక్యప్రక్రియలను అనుసరిం చెను.ఆ కాలమునందే గోపాలచంద్రు డను కవివర్యుడు శంకరదేవకవి రచించిన భక్తి రత్నాకరము అను సంస్కృత గ్రంథమును అతి రమ్యమయిన వచన శైలిలో అనువాద మొనర్చెను. రఘునాథమహంతకృతమయిన (క్రీ.శ. 1658) కథా రామాయణము; పద్మపురాణము; క్రియాయోగసారము(కవి పేరు తెలియదు); కృష్ణానందుని సాత్వతతంత్రము, కథా ఘోష - ఇవి అనంతర శతాబ్దులలో పుట్టిన మత విషయకము లయిన ప్రాచీన వచన కావ్యములు.

వైష్ణవ గురు చరితములయందును బురంజీ (Buranji) అను పేరుగల ఆహోమరాజ్య చరితములయందును, నిత్య వ్యవహారమునగల వచనము ఉపయోగింపబడినది. 17వ శతాబ్దియొక్క అంత్యభాగమునుండి ఈ రెండురకముల వచన వాఙ్మయములు ఎడతెగకుండ పెంపొందినట్లు కనిపించును. పురణి, అసమ, బురంజీ అనుగ్రంథములకు సంపాదకుడు గోస్వామి (క్రీ. శ. 1922). అసమ బురంజీ అనుకృతికి సంపాదకుడు డాక్టరు భూయాన్ (క్రీ.శ. 1945) అనునాతడు. కథాగురుచరితమునకు ప్రకాశకుడు లేఖరు (క్రీ. శ. 1952) అనునాతడు. ఈ కృతులు రచనా సౌందర్యమును బట్టియు; విషయ ప్రతిపాదనమును బట్టియు తొలుదొల్త రచింపబడిన చరిత్ర. బురంజీ వచన కావ్యములకు ఉత్తమ నిదర్శనములు. ఈ రీతిగల చరిత్ర రచనము 19 వ శతాబ్ది ఆరంభమువరకును కొనసాగు చుండెను. ఈ కాలమున కాశీనాథ ఫుకన్ కవియు, మణిరామ, దివాన్ బారువా హరకాంతబారువా అనువారు అస్సామీ చరిత్ర గ్రంథములను సంకలన మొనర్చిరి.

వ్యావహారిక కళలను గూర్చిన గ్రంథములందు కూడ ఈ నూత్న వచనరీతి ఉపయోగింపబడెను. సుకుమార బరకాథు అను కవి వ్రాసిన హ స్తివిద్యార్ణవము (క్రీ.శ. 1734 - ఇది ఏనుగులనుగూర్చి తెలుపు గ్రంథము. దీనికి మూలమొక సంస్కృత కృతి); అశ్వచికిత్సను బోధించు ఘోరా. నిదానము (ఘోటక నిదానము) అను గ్రంథము; గణితమును ప్రతిపాదించు నట్టి కాశీనాథక విరచితమైన అంకర్ ఆర్యా అను గ్రంథము=ఇవి ఈ జాతికి చెందిన వచన కావ్యములు. ఈ కాలమునకు చెందిన మరియొక