ఆశ్వశాస్త్రము
మిచ్చెను. అప్పటినుండి అశ్వములు దేవేంద్రునకును, భూమీంద్రునకును వాహనము అయినవి. జంతువులలో
వేనికాళ్ళకును లేనిబలము, వేగము అశ్వములకు గలుగుట కిదియే కారణము. పరిణామ శాస్త్ర నిష్ణాతు లయిన
యాధునికులే పెద్ద పెద్ద జంతువులకు తొలుక రెక్కలుండెననియు, కాలక్రమ పరిణామ దశ వలన వానికి రెక్కలు
పోయె ననియు సిద్ధాంతీకరించు చున్నారు. ఇటీవలి బెల్జియన్ కాంగోలో వేటాడిన యొకమ త్తేభమునకు నాలుగు దంతము లున్నవట!
అశ్వములలో చాతుర్వర్ణ్యము : గుణకర్మ విభాగమును బట్టి అశ్వములలోను బ్రాహ్మణాది చతుర్వర్ణములు గల వని శాస్త్రజ్ఞులు చెప్పినారు. (1) మంచిగుణముకలవి, మంచి యలవాట్లుగలవి, శూరములయినవి, గంధర్వ బలము గలవి, తెల్లనివి, ఎఱ్ఱనివి, తేనెవన్నెగలవి, ఉసిరిక -నేయి, పేలాల వాసనవంటి వాసనగలవి, అలంకారము లందును, పాయసాజ్యములందును ఆసక్తి గలవి బ్రాహ్మణ జాతి హయములు (2) తేజస్సు గలవి, కొంచెము కోప స్వభావము గలవి, పెద్ద ధ్వనిగలవి, పెద్ద శరీరముగలవి, బలముగలవి, తెల్లనిదిగాని, నల్లనిధిగాని యగునట్టి మంచి వన్నెగలవి, పువ్వుల వాసనగలవి, మల్లెపూవులవంటి కన్నులుగలవి, సువిభ క్తములయిన యవయవములుగలవి క్షత్రియజాతి గుఱ్ఱములు. (3) ఎండకు, గాలికి ఓర్చునవి, మిక్కిలి బరువు మోయజాలినవి, సంతోషమునుగాని, దుఃఖమునుగాని ప్రకటింపనివి, మధ్య వేగము గలవి, పానప్రియము అయినవి, చిగురుటాకు రంగుగలవి, మేక కంపు, కోతికంపుగలవి, రాక్షసతత్త్వము గలవి, వైశ్య జాతి తురంగములు. (4) దుర్గుణములు గలవి, ఇతర జంతువులు తినివదలిన యాహారమునుగూడ తినునవి, అపరిశుభ్ర వస్తువులనుగూడ విడువనివి, తన్ను పోషించువానినే తన్నునవి, చెట్టు విరుగునప్పటి సవ్వడి గలవి, తాటికంపు గొట్టునవి శూద్రజాతి తురగములు. ఆయా జాతివానిని గుణచేష్టాదులవలన గుర్తించి వేరు వేరుగా నుంచుట మేలు.
అశ్వముల ప్రకృతి -ఋతువులు : గ్రీష్మాంతమున సారహీనమైన గడ్డి, తీగలు, ఆకులు తినుటవలన అశ్వములు వాతప్రకృతి గలవి యగును. వాని కప్పుడు వాతరోగములు వచ్చును. అవి బలముడిగి కృశించి, వికిరరోమములు గలిగి నిద్రమత్తు గలవియై యుండుము. వర్షర్తువు అంతమునను, హేమంతమునను హయము లెక్కువగా పచ్చగడ్డి తినును. అపుడవి పిత్తప్రకృతిగల వగును. వీని కీఋతువున శూలరోగములు కలుగును. అవి నీటి నెక్కువగా త్రాగును, హయముల కి సమయమున కోప మధికముగా నుండును. శిశిరర్తువులో గుఱ్ఱములు కండపట్టి మిక్కిలి బలముగల పై కార్యదక్షములై యుండును. ఎంతపని చేసినను అలసట చెందవు. ఏ రోగములకును గురికావు. అవి చూచుట కెంతయు నింపుగా నుండును. శ్లేష్మప్రకృతిగలవై యొప్పారును.
అష్టవిధములయిన యశ్వలక్షణములు : శరీరము, సుడులు, కాంతి, గతి, వాసన, స్వరము, వర్ణము,సత్త్వము అని యశ్వలక్షణము లెనిమిది విధములుగా నున్నవి.
శరీరము : సర్వలక్షణములకును స్థానము శరీరమే గావున ముఖ్యమైనది హయశరీరము. తొలుత దానిలక్షణ మెరుంగుట యవసరము. కొంచెము ఎఱ్ఱనివియు, గట్టివియు, ముడుతలు పడనివియు నగు పెదవులును, ఎఱ్ఱని దియు, పల్చనైనదియు నగు నాలుకయు, ఎఱ్ఱని దవుడలును ప్రశస్తములు. దంతములు గట్టిగను, నున్ననైనవి గను, ఒకదానితో నొకటి చేరినవిగను, హెచ్చుతగ్గులు లేనివిగను ఉండవలెను. మిక్కిలి పెద్దవియు, పొడవైన వియు గానట్టి చెక్కిళ్ళు మంచివి. మెత్తని రెప్పలు గలిగి విశాలములై, తేనె రంగు గల కనులు శోభావహములు, మంచి సుడి గలిగి, విశాలమై యున్న నుదురు, సమమై, గుండ్రమై రెండు సుడులతో వెలయు శిరస్సు శుభప్రదములు. చెవులు పొట్టివియై, పల్చనివియై, సూటిగా నిక్కి నవియై యున్న మేలు. మిక్కిలి దృఢమై, దీర్ఘమై యున్న మెడ శ్రేష్ఠ మయినది. పొడవైనట్టిదియు, జడలుగట్టని దియు నగు జూలు మేలు. మూపు మేలు సుడులు గలిగి గట్టిదియై యుండవలెను. ఱోమ్ము సువిశాలమై, దీర్ఘమై యొప్ప దగును. చంకలు ఎత్తుగను, నిడుదలుగను నుండ నొప్పును. తొడలు గుండ్రమైనవియు, సమమైనవియునై యుండవలెను. మోకాళ్ళు గూఢముగా నుండుట తగును. గుండ్రముగా నుండి కండలేని పిక్కలు శ్రేష్ఠములు. గట్టివియు, 'నున్న నివియు, గుండ్రనివియు, పెద్దవియు నగు గిట్టలు ప్రశస్తములు, కొంచెము వ్రేలుచుండి