Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్వశాస్త్రము


అశ్వశాస్త్రము  :- భారతీయులకు మిక్కిలి ప్రాచీన కాలమునుండియు అశ్వములు పరిచితములై యున్నవి. వైదికముగాను, లౌకికముగాను అశ్వములు ప్రాధాన్యము వహించినవి.అశ్వమును ప్రధానముగా గ్రహించి చేయునట్టి అశ్వమేధమను మహాయజ్ఞము వేదములలోనే వర్ణిత మగుట వేదకాలమునకు పూర్వమే అశ్వపరిజ్ఞానము భారతీయులకు లెస్సగానుండెనని తెలియుచున్నది. తైత్తిరీయ వాజసనేయి సంహితలు, తైత్తిరీయ, శతపథ, ఐతరేయ బ్రాహ్మణములు, ఆపస్తంబ, కాత్యాయన, సాంఖ్యాయన శ్రౌతసూత్రములు అశ్వమేధ ప్రశంస గావించినవి. అశ్వమేధీయమైన యశ్వమునకు 'యయు' వని పేరట. దానినే శ్యామకర్ణమని యందురనియు, అది యొడలెల్ల తెల్లనై చెవులు మాత్రము నల్లనై యుండుననియు శివతత్త్వ రత్నాకరము పేర్కొన్నది. అశ్వసంబంధముగల అశ్వినీదేవతలు ఋగ్వేదములో పేర్కొనబడినారు. సూర్యుని భార్యయయిన సరణ్యు ఆడుగుఱ్ఱము రూపము ధరింపగా సూర్యుడు మగగుఱ్ఱమై వెంట దవి లేననియు వారికి అశ్వినీకుమారులు పుట్టిరనియు వర్ణింపబడినది. పురాణేతిహాసాదులలోను అశ్వముల ప్రశంస యెక్కు వగా గలదు. లౌకికముగా రాజుల చతురంగ బలములో అశ్వము ముఖ్యమైనది. అశ్వపతులకు ప్రసిద్ధిగలదు. దండ యాత్రారంభములో 'వాజి నీరాజనవిధి' చెప్పబడినది.

అశ్వశాస్త్రము  :- తమ కనేక విధములుగా అవసరములైన గజములను గురించియు, అశ్వములను గురించియు, భారతీయులు ప్రత్యేకముగా కృషిసలిపి గ్రంథములను రచించిరి. గజశాస్త్రములు, అశ్వశాస్త్రములు ఇట్టివే. వీనిలో గజాశ్వముల స్వభావ స్వరూపాహారాదులు వివరింపబడినవి.· ఆయాగ్రంథములు సప్రమాణములుగా నేటికిని స్వీకరింపబడుచున్నవి. అశ్వశాస్త్ర ప్రవర్తకులలో శాలి హోత్రుడు ముఖ్యుడుగా కనబడుచున్నాడు. శివతత్త్వ రత్నాకరములో శాలిహోత్రుడు పేర్కొనబడినాడు. అశ్వలక్షణసార కర్త మనుమంచినట్టు 'అనఘుడు శాలిహొత్రుడు హయంబులకున్ మునుజెప్పినట్టి యా యనుపమ లక్షణంబులు... తెనుగున నెల్లవారలకుఁ దేటపడన్ రచియింతు' నని శాలిహోత్రుడు అశ్వలక్షణ శాస్త్రమును చెప్పియున్నట్లు నుడివినాడు. మహాభారతమున ద్వితీయాశ్వాసములో 'ఈతండు శాలిహోత్రుడో, మాతలియో, నలుడోయని హయనీతి కోవిదులలో మునుముందుగా శాలిహోత్రుడే యుగ్గడింపబడినాడు. నలుడు, నకులుడు, అశ్వశాస్త్ర పారంగతులుగా ప్రసిద్ధి చెందినారు. నల మహారాజునకు అశ్వ హృదయమను విద్య తెలిసి యున్నట్లుగా భారతము చెప్పినది.

అశ్వోత్పత్తి  :- అశ్వములకు అమృతము, బాష్పము, అగ్ని, దేవతలు, అండము, గర్భము, సామ అనునవి యుత్పత్తి స్థానములుగా చెప్పబడినవి. దేవదానవు లమృతార్థము సముద్రమును త్రచ్చునపు డమృతముతోగూడ ఉచ్చైశ్రవ మను అశ్వము పుట్టెను. అదియే యమృత సంభవము. యుగముల కాదిని బ్రహ్మదేవుని ముఖము నుండియు, అగ్ని దేవుని నాలుకనుండియు బాష్పములు రాలెను. వానినుండి కొన్ని యశ్వములు పుట్టెను. అవి బాష్పజాశ్వములు. తొల్లి పద్మజుడు హవనము చేయుచుండగా ఆహోమాగ్నినుండి యొక వాహముద్భవించెను. అది యగ్నిసంభవ హయము. దేవతలు సృష్టింపబడగనే యందు ముఖ్యులైన ఇంద్రాద్యష్ట దిక్పాలకులు తమకోరకు గుఱ్ఱములను సృష్టించుకొనిరి. అవి దేవసముత్పన్నము లనబడినవి. ప్రజాపతి యొకప్పుడు ఉలూకరూపమును పొందెను. దాని యండముల నుండి యశ్వము లుదయించెను. అవియే యండజాశ్వములు. మగ గుఱ్ఱము వలన ఆడుగుఱ్ఱము నందు కలిగిన యశ్వము గర్భజము. సృష్టికాలమున సామలతో సృష్టి కర్త అశ్వములను సృజించెను. అవియే సామజములు,

గుఱ్ఱములకు తొల్లి రెక్క లుండెనట  : తొలుత అశ్వములకు పక్షము లుండెను. అశ్వములకు పక్షము లుండె నని మన వాఙ్మయములోను, ప్రాచీన చిత్రములలోను, కన్పడుచున్నది. అవి యాకాశమున యథేష్టముగా సంచ రించుచుండెను. అవి దేవతలకును లోబడక తిరుగుచుండెను. ఇంద్రుడు కోపించి వీని రెక్కలను గొట్టుమని శాలిహోత్రు డను ముని నాజ్ఞాపించెను. శాలిహోత్రుడు ఇషీ కాస్త్రమును ప్రయోగించి యశ్వముల రెక్కలను ముక్కలుచేసెను. పాప మా గుఱ్ఱములు జాలీగొలువ ఆ శాలిహోత్రుని ప్రార్థించెను. దయాళు వగు నా ఋషి 'మీ రెక్కల బలము పిక్కలకు వచ్చును పొండని వర