Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకుడు

యుద్ధముపై ద్వేషమును జనింపజేసెను. యుద్ధమువలన పెక్కుమందు సైనికులు మరణించుటయో' గాయపడుటయో. శత్రువులచే జిక్కుటయో తటస్థించును. వారి కుటుంబములకు మిక్కిలి కష్టనష్టములు కలుగును. ఇవి వారి సన్నిహితులను కలచివైచి పెక్కు విషాదములకు దారితీయును. ప్రజానీకమును ఇట్టి కష్టములపాలు చేయుట అశోకుని కెంతమాత్రమును ఇష్టములేదు. కావున కళింగ యుద్ధానంతరము ఆతడు రణభేరికి బదులు ధర్మభేరిని మ్రోగించెను. కొన్ని ఆధారములనుబట్టి కళింగ యుద్ధానంతరము బౌద్ధసన్యాసి ఐన ఉపగుప్తుడు అశోకునకు చేసిన బౌద్ధ మతోపదేశము ఈ పరివర్తనమునకు చాలవరకు తోడ్పడేనని తెలియుచున్నది. తత్ఫలితముగా నతడు జీవిత శేషమున రణరంగమున కాలిడ నని ప్రతినపట్టుట యేగాక మానవకల్యాణమునకు మార్గమును చూపునట్టి అహింసను, నిగ్రహమును, సచ్ఛీలమును ప్రజలందరి అలవరుచుటకు పూనుకొనెను, ఈ విధముగ తన జన్మమును సార్థకము చేసికొని,"దేవనాం ప్రియ” "ప్రియదర్శి" అను బిరుదములను పొందెను. అశోకుడు క్రీ. పూ. 282 సంవత్సరమున మరణించెను.
అశోకుని పరిపాలనము: అశోకుని రాజ్యము మిక్కిలి విస్త్రీర్ణము కలిగియుండెను. దక్షిణమున కొంతగథాము తప్ప భారత దేశమునంతను ఆతడు పరిపాలించెను. మన దేశముతో పాటు ఆరియా, ఆరోకోషియా, గెడ్రోషియా పారోపానీసా దై రాష్ట్రములుకూడ అతని అధీనమున నుండెను. వెషావర్ లోని మనసహోరా షాలజ్ గర్హా, లోను, డేరాడూను దగ్గరనున్న ఆశోకుడు లోని సోపారాలోను, కథియవాడులో నున్న గిర్నారు లోను, పూరీ జిల్లాలోని ధేలీలోను, గంజాములోని జౌగడలోను, మైసూరులోని చితల్ దుర్గములోను, జబ్బల్ పూరు దగ్గరనున్న రూవ్ నాథ్ లోను, బీహారులోని సహస్రనామ్ లోను, తదితర ప్రదేశములలోను ఉన్న అశోకుని శాసనముల ఆధారముగా అతని రాజ్య విస్తీర్ణము నిర్ణయించుటకు వీలై యున్నది. కాని కళింగ దేశముతప్ప మిగతాసామ్రాజ్య మంతయు అశోకుని తండ్రి యగు బిందుసారుడును, తాతయగు చంద్రగుప్తుడును జయించినదే.
అశోకుని సామ్రాజ్యమునకు పాటలీపుత్రము రాజధానిగా నుండెను. అశోకుడు తన రాజ్యమును నిరంకుశముగా పరిపాలించినను తన ప్రజలను తండ్రి వలె నాదరించెను. స్మృతులను గమనించి, శిష్టాచార పరాయణుడై, పెద్దల సలహాలను మన్నించుచు. తన ప్రభుత్వమును మంచి పునాదులపై నిలిపెను. కాల్సీలోను. ధారో రాష్ట్రము మరియు హిందూరాజ్య సంప్రదాయము ననుసరించి అశోకుడు ప్రజల యోగ క్షేమములను తెలిసికొనుటకు వివిధ ప్రాంతములకు యాత్రలు వెడలుచుండెను. అతనిక్రిందనున్న సామంతులు ప్రజలను కష్ట పెట్టుకుండ, వారికి క్షేమకరములగు పనులు చేయుటయందు అలసతను వహింపకుండ, కనిపెట్టుటకు గూఢచారులను నియమించెను. ఇన్ని ఏర్పాట్లు గావించినను ఒక్క ప్రభువు రాజ్యమంతయు స్వయముగా పరిపాలించుటకు వీలు కాదని యెరిగి అశోకుడు తన రాజ్యమును అనేక రాష్ట్రములుగా విభజించి సరిహద్దు రాష్ట్రములలో తన రాజకుటుంబములోని వారిని రాజప్రతినిధులుగ నెలకొల్పి తక్కిన రాష్ట్రముల పరిపాలనకై బిరుదుగల

387