Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశోకుడు

అంతరమైన హేతువును ఆశ్రయించునది. మీరు మున్ముందు కాళిదాస కవితా వైశిష్ట్యమునందు మగ్న మనస్కులు కండు. పిదప ఆకసమును తిలకింపుడు. అపుడు నిత్య నూతనమైన మేఘ సందేశము యొక్క శాశ్వత సౌభాగ్యమును మీరు గ్రహింప గలుగుదురు. మొదట వాల్మీకి కృతమైన సముద్ర వర్ణనమున మగ్నులు కండు. పిదప యథేష్టముగా సముద్రమును చిత్రింపుడు.”

అవనీంద్రనాథుడు దివికేగినాడు. అతని మరణముచే ఆధునిక చిత్రకళోద్యమమున నొక మహానాయకుని, ఒక దేశాభిమానిని, ఒక చిత్రకళా ప్రబోధకుని భారతదేశము కోల్పోయినది. చిత్రకళోద్యమమున మిక్కిలి ప్రతిభావంతుడును, సమకాలిక మహాపురుషులలో నొక్కడును, మానవ సంస్కృతి చరిత్ర పత్రములందు మాసిపోని చిహ్నములను నిలిపినవాడును అగు అవనీంద్ర నాథునకు భారతదేశము స్తుత్యువహారాభివందనములను అర్పింపవలసి యున్నది.

అవనీంద్రనాథునకు కీర్తిని తెచ్చిన శిష్యులు పెక్కురు కలరు. వారిలో నందలాల్ బోసు, అసితకుమార్, హాల్దారు, వకీలు, దేవీప్రసాదరాయ్ చౌదరీ, ప్రమోద కుమార్ చటర్జీ పేర్కొన దగినవారు.

వి. ము.


అవిసెన్నా - క్రీ.శ. 980-1037 :- ఇతడు పర్షియా దేశస్థుడు, బొఖారాకు సమీపమునగల ఒక ప్రదేశమున జన్మించెను. వైద్యులందు అగ్రేసరు డని పేరు పొందెను. ఇరువది నాలు గేండ్ల లేబ్రాయముననే ఆస్థాన వైద్యపదవిని పొందిన ప్రతిభాశాలి. ఇతనికి సాహిత్యాభిలాష మెండు. యూరపుఖండమునందలి వైద్యశాస్త్రముపై కనపరచిన ఇతని కృషి ప్రాబల్యము మిక్కుటము, 1650 సంవత్సరము వరకు కూడ 'కానకా' అను పేరుగల ఇతని వైద్యశాస్త్ర గ్రంథము వైద్యశాస్త్ర బోధనాలయములందు పాఠ్యగ్రంథమై యుండెను. నీటిసరఫరా, శీతోష్ణస్థితి. ఋతువులు, వీనిఫలితముగ మానవుల ఆరోగ్యమునందు కనబడు మార్పులను ఇతడు గుర్తించెను. ప్రయాణించు వారికి సలహాలు, వృద్ధుల విషయమై వహించవలసిన శ్రద్దగూడ ఈ గ్రంథమున పేర్కొనబడినవి.

డా. వే. రా.


అశోకుడు - క్రీ. శ. 273-232:- అశోకుడు మౌర్యచక్రవర్తులలో అగ్రగణ్యుడు. సుమారు క్రీ. పూ.804 వ సంవత్సరమున రెండవ మౌర్యచక్రవర్తి యగు బిందుసారునకును, సుభద్రాంగికిని జన్మించెను. ఇతడు తండ్రి జీవిత కాలములో తక్షశిల రాజధానిగాగల ఉత్తరా పథమునకు రాజప్రతినిధిగా నుండి క్రీ. పూ. 278 లో తండ్రి మరణాంతరము చక్రవర్తి యయ్యెను. కాని క్రీ. పూ. 289 వరకు అనగా తండ్రి మరణించిన నాలుగు సంవత్సరముల వరకు పట్టాభిషిక్తుడు కాలేకపోయెను. ఈ మధ్యకాలములో అతనిపై కత్తిగట్టిన అతని సోదరులతో యుద్ధము చేయవలసివచ్చుట ఈవ్యవధికి కారణము కావచ్చును. అతని మంత్రియగు రాధాగుప్తుడు అతడు చక్రవర్తి యగుటకు చాల సహాయపడెను.

కళింగయుద్ధము: చక్రవర్తి అయిన పిమ్మట అశోకుడు ఒక యుద్ధము చేసెను. క్రీ. పూ. 262 వ సంవత్సరమున అనగా పట్టాభిషిక్తుడయిన 8 సంవత్సరములకు అతడు కళింగదేశముపై దాడి వెడలెను. ఈ యుద్ధములో 1 న్నర లక్షమంది జై దీలుగా పట్టుబడిరి. 1 లక్షకు పైగా మరణించిరి. దీని కెన్నో రెట్లు మిక్కుటముగ జనులు యుద్ధ కారణమున చనిపోయిరి. ఇట్టి ప్రాణహాని, హింస అతని జీవితములో గొప్పమార్పును తెచ్చెను. ఈ విజయము వేరు దిగ్విజయములకు పురికొల్పుటకు బదులు అతనికి

386