Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/441

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్లూరి సీతారామరాజు


టెమన్ హోరుకు బాణములు తగిలెను. అందరును పిరికిపడి ఎవ్వరి అనుమతిలేకయే పరుగిడిపోయిరి. విప్లవకారులు మందుగుండ్లు, తుపాకులు, కత్తులు, దుస్తులు నూడబెరికి తీసికొనిపోయిరి. దీనిని ప్రథమ సమర మని యెదరు.

మోటువారిని సత్యపథమున నడిపించుటకు దేవీ భక్త్యారాధనలు మహోపకారకములుగా నుండెను. కావున సీతారామరాజు "గూడెము" అను గ్రామములో దేవీపూజలు సలుపుటకు ఏర్పాటు చేసెను. ఈ సంగతి తెలిసి శాండర్సుదొర సైన్యముతో గూడెమునకు బయలుదేరెను. ఇతనికి సహాయముగా టాల్బర్టుదొర రిజర్వు దళముతో "పెదవలస" అను గ్రామములో మకాం చేసెను. దేవీ పూజ నిర్విఘ్నముగా సాగుటకై ఒక యుక్తి చేసి రామరాజు కొందరు విప్లవ కారులను టాల్బర్టు మీదికి పంపెను, వారు ఏమరుపాటుననున్న సైనికులపై బడి బాగుగ మర్దించి తరిమివైచిరి. విప్లవకారులు వేగులవాడు శాండర్సును సమీపించి టాల్బర్టు పరిభవము ఎరింగించెను. శాండర్సు వెనుకకు మరలేను. పెదవలసకు పోయి విప్లవ కారులను పట్టుకొన తలంచెను. కాని గూడెముకుపోయి దేవీ పూజలో పాల్గొనిరి.

ఒకనాడు దమనపల్లిలో విప్లవ కారుల వంట చేసికొనుచుండిరి. సైన్యములరాక వారికి తెలిసెను. వెంటనే గాముసోదరులు అనుచర సమేతముగా త్రోవగాచిరి, కొండల నొరసికొని ఒక ఏరుపారుచుండును. ఏటి యొడ్డుననుండి బాట పోవును. ఆ బాట మిగుల ఇరు కయినది. గాముసోదరులు ఈ బాటప్రక్కన కొండలపై గుబుగుచెట్టుల చాటున తుపాకులు బారువెట్టి కూర్చుండిరి.

ఒకరి వెనుక నొకరుగా సైనికులు పోవుచుండిరి. నల్లసిపాయిలు దాటిపోయిన తరువాత కవర్లు, హైటరు అను నిద్దరు సేనానులు నడచుచుండిరి. వీరిద్దరు విప్లవకారుల తుపాకుల గుండ్లకు గురియై నేలకూలి దొర్లి, ఏటిలోబడి కొట్టుకొని పోయిరి. మిగిలినవారు పారిపోయిరి. గాముసోదరులు చేసిన హత్యావ్యవహారము రామరాజునకు తెలియదు. ఆతడప్పుడు పర్వతము పై తపస్సు చేయుచుండెను.ఈ హాత్యావిషయ మాతనికి తెలిసినప్పుడు గాముసోదరులను కోపగించి, చీవాట్లు పెట్టెను. రామరాజు అహింసాప్రియుడు.

కవర్డు, హైటరుల మరణము తెల్లవారిలో గొప్ప అలజడిని కలిగించెను. ప్రబల సన్నాహముతో మలబారు పోలీసులతో, పటాటోపముతో మిస్టర్ నాఫ్ దొర దిగి వచ్చెను. ఇట్టి బ్రహ్మాండమయిన ప్రయత్నమంతయు నెందులకు? రామరాజు యొక్క ఎనుబదిమంది అనుచరులను పట్టుకొనుటకే. “రామరాజు రాజత్వవాది. గూడెము తాలూకాకు తాను ప్రభువు కాదలచి యీ పితూరీని లేవనెత్తెను. గ్రామములను దోచి ప్రజలను హింసించుచున్నాడు" అని ప్రభుత్వమువారు పచ్చి అబద్దపు ప్రకటన చేసిరి.

రామరాజు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి 'స్టేషనులను హఠాత్తుగా ముట్టడించెను. కాని తరువాత తరువాత కలెక్టరుకు నోటీసు ఇచ్చి, ఆప్రకారము చేయుచుండ మొదలు పెట్టెను. గ్రామోద్యోగులకు తాను ఎచ్చటెచ్చటికి పోవుచుండెడిది, ఎప్పుడెప్పుడు పోవుచుండునది తెలుప సాగెను. అడ్డతీగల, పైడిపుట్టి, రంప చోడవరము, ఏనుగగుంట, పాత మల్లు పేట, అనుమలపూడి, అన్నవరము మొదలగు గ్రామములలోని ఠాణాలను ముట్టడించి దోపిళ్ళు జరిపెను. కాని రాజు కార్యక్రమము ముందుగా తెలిసియుండియు అధికారులుగాని, సేనానులుగాని జంకి రాకపోయిరి. వచ్చిన వారు విప్లవకారులను చూడగనే పలాయనము చిత్తగించెడి వారు.

రామరాజు ప్రభుత్వపు గూఢచారులను బట్టుకొని, భయపెట్టి వదలెడువాడు. వస్తుసామగ్రి, ఆయుధాలు,