Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్బెరూని

కాల్చిన పటికగా మారును. అది అల్యూమినియ గంధకితముగా నుపయోగపడును.

స్ఫటసైకతీయములు  : ప్రమృత్తు (Kaolin), పొటాశీయ భూస్ఫటికము, అభ్రకము -ఇది స్ఫట సైకతీయములకు ఉదాహరణములు. విస్తారముగ దొరకునట్టియు, అధికముగ ఉపయోగింపబడునట్టియు, అల్యూమినియము యొక్క సంయోగద్రవ్యమే రేగడిమట్టి. రేగడిమట్టి జిగటగా సాగును. కాల్చినచో నది గట్టిపడును. ఈ కారణములచే నది పోతపోయు వస్తువులకు ఉపయోగపడును.

అల్యూమినియమును గుర్తించుట : స్ఫట సంయోగ ద్రవ్యమును సోడియ కర్బనితముతో మిశ్రమము చేసి కఱ్ఱబొగ్గుపై ఆమ్లజని హారకమగు జ్వాలలో వేడి చేసిన చో తెల్లని విలక్షణమగు అవశేషము వచ్చును. దానిని తరువాత మణిశిలా నత్రిత ద్రావణపు చుక్కతో తడిపి మరల ఎక్కువగా కాల్చినచో నీలిరంగుగల పదార్థమేర్పడును.

అల్యూమినియముగల ద్రావణమునకు సోడియ ఉదజామ్లజనిదముగాని, పొటాశియ ఉదజామ్లజనిదముగాని కలిపినచో, అల్యూమినియము, అల్యూమినియ ఉదజామ్లజనిదముగా అవక్షేపము నొందును. అది అమ్మోనియా హరిదములో కరగును,

డి. హ.

అల్బెరూని  :- అబుర్ రైహాన్ మహమ్మద్ ఇబిన్ అహమ్మదు అల్బెరూని 973 సెప్టెంబరులో సోవియట్ రిపబ్లిక్ లో ఉన్న టర్కమనిస్తాన్ లో ప్రస్తుతము భివా అని పిలువబడు ఖ్వారిజిమ్ యొక్క పరిసర ప్రాంతములలో జన్మించెను. ఇతడు ప్రస్తుతపు ఆఫ్ గన్ స్థాన్ లోని “గజినీ" పట్టణములో 75 సంవత్సరముల వయస్సులో చనిపోయెను. ఇతని పితృసంబంధమైన గృహము బెరూన్ అను చోటి పరిసర ప్రాంతములలో ఉండుటవలన ఈయనకు అల్ బెరూని అని పేరు వచ్చినది. పురాతనకాలములో మధ్య యుగమునందు ఖ్వారిజిమ్ శాస్త్రములలో, కళలలో, ప్రసిద్ధికెక్కిన పండితులకు జన్మస్థలమైయుండెను. అటువంటి వారిలో బీజగణిత శాస్త్రమును కనుగొన్న ఆల్ ఖ్వారిజిమి అను గణితశాస్త్రజ్ఞు డొకడు. గజినీలోని యామినీ వంశీయుల ఆస్థానములో ఇతని పేరు ఎక్కువగా వినబడుచుండును. సుల్తాన్ మహమ్మదు గజినవి ఆవంశీయులలో ప్రముఖుడై, బాగ్దాదులోని అబ్బాసిద్ కాలిఫ్ వలన "యామినుద్దౌలా" అను బిరుదమును వడయుట వలన అ వంశమునకు యామినీవంశమని పేరు వచ్చినది.

క్రీ.శ. 1000, 1028 సంవత్సరముల నడుమ మహమ్మదు భారతదేశముపై పెక్కుసారులు దాడి చేసెను. తూర్పువైపున తన సామ్రాజ్యమును విస్తరింప జేయుటతో తృప్తిపడని అతనికి పడమటి వైపున కూడ తన రాజ్యమును వ్యాపింప జేయవలెనను ఆశ కలిగెను. 1017 వ సంవత్సరములో అతడు ఖవా పై దాడిచేసి నపుడు అల్బెరూని, అచ్చటి పరిపాలకునకు ముఖ్య సలహా దారుగా ఉండెను. అందువలన అతడు సహజముగా సుల్తాన్ గజినవీ యొక్క తంత్రములకు ఎదురు ఎత్తులు వేయదొడగెను. మహమ్మదు ఆడంబర సహితుడును, నిరంకుశుడును కాడు. అతడు శాస్త్రములను, కళలను ఎక్కువగా పోషించుచుండెను. దూర దేశములనుండి విఖ్యాత పురుషులను యుద్ధ ఖైదీలుగా తన వెంట తీసికొని వచ్చి, తన సామ్రాజ్యమును జ్ఞానసంపన్నముగా చేయవలెనని అతనికి ఉద్దేశము ఉండెను. మహమ్మదు మధ్య ఆసియా రాజ్యమగు ఖ్వారిజిమును జయించి ఖ్వారిజిమ్ నుండి గజినీకి తెచ్చినట్టి ఖైదీలలో అల్బెరూని ఒకడు. స్వస్థలమును విడుచునప్పటికి అల్బెరూని వయస్సు 40 సంవత్సరములు. అతడు తన జీవితములో శేషించిన భాగమును గజినవీ లోనే గడపెను,

గజినవీలో ఎక్కువమంది భారతీయులు అల్బెరూనికి కనిపించిరనుటకు సందేహములేదు. అప్పటికే పంజాబును మహమ్మదు తన సామ్రాజ్యములో చేర్చుకొనేను. 1017 వ. సంవత్సరములో పశ్చిమమున, మహమ్మదు అమూరు దర్యావరకును, తూర్పున పురాతన భారతీయ విజ్ఞానమునకు కేంద్రమైన 'కనూజ్' (కన్యాకుబ్జము) వరకును ఆక్రమించెను. అల్బెరూనియెడ మహమూదు నకు ఒక విధమైన వైరభావము ఉండెను. అందుచేత అతడు బ్రతికి ఉన్న రోజులలో అల్బెరూనికి తగిన ఆస్థాన గౌరవము లభ్యము కాలేదు. కాని అతని పరిపాలన కాలములోనే, అల్బెరూనికి పురాతన భారతీయ సాహిత్యమునందు 'పండితులైనవారిని కలిసికొనుటకు అవకా