అల్యూమినియము
వంతమగు బంగారు కాంతి ఉండును. అది హరించిపోదు. అది ఫోటో చట్రములు చేయుటకును, ఇతర అలంకరణపు పనులకును ఉపయోగపడును. ఫ్రెంచి ప్రభుత్వము వారు ఈ మిశ్రలోహమును నాణెములు చేయుటకు ఉపయోగించు చున్నారు.
స్థిరస్ఫటము (డ్యురాలుమిన్) :- దీనిలో 95 శాతము అల్యూమినియము, మిగిలినది రాగి, మగ్నము, మాంగ నము ఉండును. ఇది సముద్రపుటోడల నిర్మాణమునకును శస్త్రచికిత్ఛోపకరణములు చేయుటకును ఉపయోగపడును.
అల్యూమినియము స్ఫట తాప విధానమునందు కూడ ఉపయోగపడును.
గోల్డష్మిట్ యొక్క స్ఫటతాస ప్రక్రియ :- క్రుమము (Chromium), మాంగనము వంటి ధాతువుల యొక్కయు టంకము, సైకతమువంటి అధాతువుల యొక్కయు, ఈ ధాతువులు ఇనుము కలిసిన అయోమాంగనము, అయోక్రుమము వంటి మిశ్రలోహముల యొక్కయు కర్బన రహితము లగు నమూనాలను సంపాదించుటకై గోల్డుష్మిట్ విధానము ఉపయోగింప బడును. హెచ్చు ఉష్ణోగ్రతలలో అల్యూమినియమునకు తనకంటే తక్కువ ధనాత్మక విద్యుల్లక్షణముగల ధాతువులను వాటి ఆమ్ల జనిదములనుండి వేరుచేయు శక్తి కలదు. ఈ క్రియలో ఉష్ణ విసర్జనము చాల బలముగా నుండుటచే వేరు చేయబడిన ధాతువు కరగి ద్రవరూపమున లభించును. ఈ ప్రక్రియ స్ఫటా కామ్ల జనిదముతో ఉక్కును అతుకుటకును, సముద్రము పై ఓడలను మరమ్మతు చేయుటకును వినియోగింపబడును.
స్ఫటకామ్ల జనిదము :- ఇది 'అల్యూమినా' అనబడును. స్ఫోడిజమును (Bauxite) ధనురాకారపు విద్యుత్కో లిమిలో 3000° ల ఉష్ణోగ్రత వద్ద కరగించి పెద్ద మొత్తముపై స్ఫటవిందము (స్ఫటము+కురువిందము) అను కృత్రిమ మగు ఒరపిడి రాతిని ఉత్పత్తి చేయుదురు, అది సహజమగు కురువిందముకంటె కఠినముగా నుండును. అది ఆత్మవహము లగు బండ్ల కవాటికలను (volves) ఉక్కుతో చేయబడిన ఇతర యంత్రభాగములను తరిమెన పట్టుటకును ఒరపిడి చక్రములను తయారు చేయుటకును ఉపయోగింపబడును. అది వక్రీభవన (Refractory) పదార్థముగా కూడ ఉపయోగపడును.
ఖనిజ కురువింద రూపమున స్ఫటకామ్ల జనిదము ఒరపిడి చేయుటకును, మెరుగు పెట్టుటకును చాల ఉపయోగింప బడును. ఇప్పుడు సూక్ష్మముగా చూర్ణము చేయబడిన అల్యూమినా, ఒక రంగు పదార్ధములతో కృత్రిమ రత్నములు తయారుచేయబడు చున్నవి.
అల్యూమిన ఉదజామ్ల జనిదము నీటిని శుభ్రపరచు విధానమున ఆతంచన ప్రక్రియ (Coagulation process పేరుకొనునట్లు చేయుటకును, కాగితమును సజ్జీకరణము చేయుటకును, వస్త్రములను జలప్రవేశ నిరోధకములుగా చేయుటకును ఉపయోగింపబడును. అది వస్త్రములకు రంగు వేయుటయందును, వానిపై క్యాలికో ముద్రణము చేయుటలో వర్ణస్థాపకముగా ఉపయోగపడును; రంగు చక్కెరను విరంజనము చేయుటకుగూడ అది ఉపయోగించును.
రంగువేయుటలో స్ఫటసంయోగద్రవ్యముల ఉపయోగము :- రంజక ద్రవ్యములలో ఉన్ని, పట్టువంటి జంతు సంబంధమగు పోగులకు నేరుగా రంగువేయుటకు వీలగును. కాని ఉద్భిజ సంబంధమగు పోగులకు “వర్ణస్థాపకములు" అను కొన్ని పదార్థములలో ముంచిన తరువాతనే రంగు వేయుదురు. వస్త్రమును మొదట స్ఫట సంయోగ ద్రవ్య ద్రావణములో ముంచెదరు. తరువాత రంగు వేయుదురు. దీనివలన వస్త్రమునకు రంజక ద్రవ్యము పట్టును. ఇట్టి స్ఫట సంయోగ ద్రవ్యములను “వర్ణస్థాపకములు" అందురు.
పటిక ; రెండుధాతువుల ద్విలవణము 24 అణువుల నీటిని స్పటిక జలముగా కలిగియున్నచో అది 'పటిక' అన బడును. పొటాశియము, అల్యూమినియముల, గంధకితములచే నేర్పడిన ద్విలవణమును 'పొటాష్ పటిక' లేక 'సాధా రణ పటిక' అందురు.
పటిక తయారుచేయుటకు పొటాళియ, అల్యూమినియ గంధకితముల అణుప్రమాణములను, మరగుచున్న నీటిలో కరగించి, చల్లారనిచ్చినచో పటిక స్ఫటికములు వేరుగా నేర్పడును.
పటిక తెల్లగా, స్ఫటికాకారమున నుండు పదార్థము. వేడిచేసినచో అది కరిగి, స్ఫటిక జలమును పోగొట్టుకొని