Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అలంకారశాస్త్ర చరిత్ర


లోకజ్ఞానము, అమంగళశాంతి,ఆనందము, సదుప దేశము అను ప్రయోజనములు కలుగునని వివరించెను.ఆనందము, యశస్సు, సదుపదేశము అనునవి మాత్రమే కలుగునని హేమ చంద్రుని మతము. చతుర్వర్గ ఫలప్రాప్తి. శాస్త్రములవలన కలిగినప్పటికిని శాస్త్రములు నీరసములు, దుర్గమములు కనుక సులభమును, మృదువునైన కావ్యమునే ఫలప్రాప్తి సాధనముగా పలువు రాదరింతురని, రుద్రటుని సిద్ధాంతము. ఏకావ్యము ఏవిధముగ ఉపదేశించినను, రామునివలె నడుచుకొనవలెను, రావణునివలె నడువకూడదు అనియే తెల్పుడు. 'కావ్యపఠనమునకు ఆనందమే ముఖ్యమని ఆలంకారికు అందరును భావించిరి.

2. కావ్య హేతువులు : అలంకార శాస్త్రకర్తలు పలువురు ప్రతిభా, వ్యుత్పత్తి, అభ్యాసములను కావ్యమునకు ముఖ్య హేతువులనుగా వక్కాణించిరి. ఈ మూడింటిని కొలది భేదములతో దండి, భామహుడు, గుద్రటుడు, మమ్మటుడు, ఏకావళి కాగుడు, అలంకార శేఖర కారుడు కావ్య హేతువులనుగా అంగీకరించిరి. సమర్థుడైన కవి యగుటకు ఒక్క ప్రతిభ యేచాలును అని రాజ శేఖరుడు, వాగ్భటుడు, జగన్నాథ పండితుడు భావించిరి. ప్రతిభ యనగా అతి విశిష్టమైన శక్తి. ప్రతిభావంతుడైన కవసహృదయుడైన పఠిత యొక్క హృదయమునకు అతి మధురములు, అపూర్వములు అయిన అనుభవములను కలిగించును.

ప్రజ్ఞా నవనవోన్మేష శాలినీ ప్రతిభామతా'
'ప్రతిభా అపూర్వవస్తు నిర్మాణ తమా ప్రజ్ఞా'

  • స్ఫురంతీ సత్క వేర్బుద్ధిః ప్రతిభా సర్వతోముఖి'

అని బహుముఖముగా అనేకులు ప్రతిభను నిర్వచించినారు. ప్రతిభ యన త్రై కాలికములైన విషయములను గోచరింపజేయు ప్రజ్ఞ. అది సహజము, అనేక జన్మ సంస్కా రజన్యము అని అందరు అంగీకరించినారు. కావ్యపఠితకు గూడ భావనాశక్తి, సంస్కారము ఉండవలెను. అవి కలవానికే కావ్యరసానుభూతి బాగుగా కలుగును. సుకవియైనవాడు కావ్యములందు స్వతంత్రించి అచేతన వస్తువులను చేతనములనుగాను, చేతనములను అచేతనములనుగాను, య థేచ్చముగా వహృదయులకు గోచరింప జేయును అని ధ్వనికారుడు నుడివెను. కావ్య, శాస్త్ర, లోకజ్ఞానములు కలిగియుండుటయే వ్యుత్పత్తి యనబడును. మహాకవుల యొద్ద కావ్యశిక్షను పడయుటయు, నిరంతర కావ్యరచనా వ్యాసంగము చేయుటయు అభ్యాస మనబడును. ఇట్లు ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము, ఈ మూడును సత్కావ్యరచనకు ఆవశ్యకములుగ చెప్పబడుచున్నవి.

3. కావ్యవిభాగములు : పాశ్చాత్యులు కావ్యమును ఇతిహాసము, గేయము, నాటకము అని విభజించినట్లే, సంస్కృతములో కూడ అట్టి విభాగములు వివిధ విషయములనుబట్టి చేయబడినవి. దండి కావ్యమును గద్యము, పద్యము, మిశ్రము అని మూడు విధములుగా విభజించెను. వామనుడు 'గద్యం కవీనాం నికషం వదంతి' అని చెప్పుటవలన, గద్యరచన కవిప్రతిభకు నికషోపలము వంటిదని స్పష్టమగుచున్నది. దండి, తన కావ్యాదర్శములో పద్యకావ్యము, సర్గబంధము (మహాకావ్యము). ముక్తకము (ఒక పద్యము), కులకము (అయిదు పద్యములు), కోళము, సంఘాతము (పరస్పర సంబంధము లేని అనేక పద్యముల కూర్పు), అని అయిదు విధములుగ నుండునని చెప్పెను. మిశ్రకావ్యము, నాటకము మొదఅయిన రూపకములు. గద్యప్రబంధము, కథ, ఆధ్యాయిక మున్నగు భేదములు గలది. సంస్కృత, ప్రాకృత, అపభ్రంశాది భాషాభేదములచే గూడ కావ్యము విభజింపబడుచున్నది. వామనుడు కావ్యము గద్యపద్యాత్మక మని చెప్పి, గద్యము, వృత్తగంధి (పద్యమువలె నుండునది), చూర్ణము, ఉత్కలికాప్రాయము అని మూడు విధములనియు, పద్యప్రబంధము అనేకవిధములుగా నుండు ననియు వచించెను. గద్యపద్యములును అనిబద్ద (సంబంధము లేనివి), నిబద్ద (సంబంధముకలవి) భేదముచే రెండు విధములుగ సూచించి, ప్రబంధము అన్నిటిలోను దృశ్య ప్రబంధము సర్వోత్తమమైనదని 'సందర్భేషు దళరూపకం శ్రేయః' అను వాక్యముచే నతడు స్పష్టపరచెను, హేమ చంద్రాదులు కావ్యము వేశ్యము. శ్రవ్యము అని రెండు విధములుగచెప్పి, వేశ్యమునకు పాఠ్యగేయ రూపములచే ద్వైవిధ్యమును సూచించి, ఈ రెండును అనేక భేదములు కలవి అనిచెప్పిరి. వస్తువును బట్టి కావ్యము