Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికను ఇండియనులు


కనబడుచున్నది. ఈ సన్నిహితజాతులను గురించి మన కేమియు విశేషాంశములు తెలియవు. భిన్నభిన్న జాతులుగా కనబడువారుకూడ వారిలో చేరిన అవాంతర శాఖలుగానే పరిగణింపబడవలెను. ఈ ఐక్యమే అమెరికను ఆదిమ ఇండియనుల చరిత్రకు సంబంధించిన మానవజాతి శాస్త్ర ముఖ్య సంఘటనము. ఇండియను జాతుల భాషా పరిశీలనము, పురావస్తు శేషములు, కళలు, పరిశ్రమలు, ఆటలు, సాంఘిక మత సంస్థలు, పౌరాణిక గాథలు, జానపద విజ్ఞానము మున్నగునవివారి మానసిక ఐక్యతనే చాటుచున్నవి. ఈ జాతులలో 'శారీరకములైన భేదములు కన్పించు చున్నను, అవి ప్రపంచమునందలి ఇతర గొప్ప జాతులలో కానిపించు భేదముల కంటే మించినవి కావు.

అమెరికను ఇండియనులు అనేకమయిన తెగలుగా విభజింపబడి యున్నారు. అలాస్కా యొక్క ఉత్తర పశ్చిమ ప్రాంతములను ఆక్రమించిన ఎస్కి మోలులను వారు వీరిలో ముఖ్యులు. 'ఏతిపాస్కన్సు' (Athepascans) అనువారు ఉత్తర కాలిఫోర్నియా, ఎరిజోనా, మెక్సికో ప్రాంతములను ఆక్రమించి యున్నారు.'ఇరాకీస్'(Iraquies) అను జాతివారితో సమ్మిశ్రితులైన 'ఆల్గోకీయన్' జాతివారు, సెంటు లారెనుసు భూములందును అంటారియో సరస్సునకు తూర్పుననున్న భాగమందును నివసించియున్నారు. ముస్కోజియన్ తెగవారు ఎప్లాచియను పర్వత ప్రాంతమునను అట్లాంటికు, మెక్సికో సింధుశాఖ, మిసిసిపి ప్రాంతములందును నివసించు చున్నారు. కడ్జోయను తెగవారు, సియోనులు, సొషోనియనులు లేక, ఉటో అజ్ టియనులు (Vio-Agteean), మాయనులు, అరవాకనులు, టుపియనులు, చిబిహానులు, క్వెచియనులు అను వివిధ జాతులవారు అమెరికాలోని వివిధ ప్రాంతము లందు నివసించియున్నారు. వీరు మంగోలియ౯ జాతీయులు. వీరు మధ్య ప్రమాణముగల పొడవును, గోదుమవన్నెగల శరీరములను, వెడల్పయిన ముక్కులను ముఖములను ఏటవాలు కండ్ల ను కలిగి యుండు మంగోలియా జాతికి జెందుదురు.

అమెరికను ఇండియనుల యొక్క కళలు వారు కనిపెట్టిన విషయములు తమ పరిసరముల యొక్క పరిమితికిని వైవిధ్యమునకును అనుగుణమైనవిగా నున్నవి. ఈ ఖండమును కనుగొనునాటికి, అచ్చటనున్న జనులు రాతియుగమునకు చెందిన వేటగాండ్రుగాను, చేపలు పట్టు వారుగాను, వ్యవసాయదారులుగాను ఉండిరి. వారిలో పెక్కుమంది కుండలు చేయుట కొంతవరకు ఎరిగినవారే. 'అల్ గోకియన్ ఎట్ చెమిన్స్' అనువారు అక్షరాల తేలిక పడవలను నడుపు మనుష్యులు. ఈ సందర్భమున సముద్రముపై తేలిక పడవలను నడుపుచు చేపలను పట్టుకొను 'అలాస్కా' తీరవాసులును, బ్రిటిష్ కొలంబియా వాసులును పేర్కొనదగినవారు. అమెరికను ఇండియనులలో ఎస్కిమోలు కుక్కలను, ఆల్గోకియనులు జారుడు బండ్లను