అమెరికను ఇండియనులు
భూమిపై బరువులను మోయుటకు ఉపయోగించెదరు. పెరూదేశస్థులు 'ఇల్మా' అను జంతువును సామానులను మోయుటకు మాత్రమే ఉపయోగించుదురు. సవారి చేయుటకు దానిని వారు వాడియుండలేదు. ఆనాటి ఇండియనులచే పెంచబడి మచ్చిక చేయబడిన గృహ జంతువులు కుక్క ఎల్మా అనునవే. ఆ ప్రజల యొక్క సాంఘిక మత జీవితములలో వాటిలో ఎక్కువ ప్రయోజన ముండెడిది. ఎల్మా అను జంతువు "పెరూ" "బొలీవియా" అను ప్రదేశములందు మాత్రమే పెంచ బడెడిది. 'నవాహో' అను వారి ప్రాథమిక పరిశ్రమలలో గొఱఱెలును, కొందరు దక్షిణ అమెరికను ఇండియనులు పరిశ్రమలలో ఆవులును,మైదానములయందలి ఇండియనులు పరిశ్రమలలో గుజ్జములును పేర్కొనదగినవి.
అమెరికను ఇండియనుల యొక్క పురాణ గాథలను మతమును గూర్చి "ముల్లరు', 'బ్రిస్ టన్', 'పోవెల్ అను వారు విపులముగా వ్రాసియున్నారు. వీరుడు, ప్రవక్త జ్ఞానప్రదాతయు అయిన ఒకానొక దివ్యపురుషుడు తన ముఖ్య క ర్తవ్యమును నెరవేర్చి, ఈప్రపంచమును వీడుట, తిరిగి భావి కాలమున వచ్చెదనని వాగ్దానము చేయుట, అను నంశములతో గూడిన వృత్తాంతము ఈ పురాణ గాథలలో అతి ప్రధాన మైనదిగా కనబడుచున్నది. ఆజిబ్వా, చెరోకు, 'అపచే అను ప్రదేశములకు చెందిన "భిషక్కు"