Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అబ్రహామ్ లింకన్ నిశ్చయించుకొనెను. ఈ యుదారమైన ఆశయము సఫల మగుననియు ఆవిధమున తనకు శాశ్వతమగు కీర్తి లభించుననియు అతడు అప్పుడు అనుకొనియుండడు. కీ. శ. 1832 వ సం. లో లింకను ఇలినాయిస్ రాష్ట్ర శాసన సభకు అభ్యర్థిగా నిలబడి ఎన్నికలలో ఓడి పోయెను. రెండు సంవత్సరముల తరువాత తిరిగి పోటీ చేసి ఆతడు విజయమును కాంచెను. ఆతరువాత మరి మూడు పర్యాయములు వరుసగా శాసనసభా సభ్యు డుగా ఎన్నుకోనబడెను. ఈ సభలో అతని రాజకీయ సామర్థ్యము వ్యక్తమయ్యెను. ఈ కాలములో ఆతడు నిరంతరముగా కృషిచేసి తన రాష్ట్రమునకు రోడ్లు, రైలు మార్గములు, జలమార్గములు, మొదలైన సౌకర్యములు కల్పించెను. ఈ కాలములోనే న్యాయవాద వృత్తిని అవలంబించి ధర్మ బద్ధములైన వ్యవహారములలో నే సంబంధము కలిగించుకొని ఆ వృత్తికి ఒక గొప్పతన మును కల్పించెను. ఒకసారి ఒక వ్యవహారములో పని చేయుచు అది సక్రమమైనది కాదని తెలియగానే మధ్య లోనే దానిని వదలుకొనెను. లింకను యొక్క వివాహము మేరీ టాడ్ అను నా మెతో 1842 వ సం. లో జరి గెను. ఈ వివాహ సందర్భములో లింకనుకు స్టీఫెన్ డగ్లసు అనే ఆయనతో పోటీ ఏర్పడెను. పెండ్లిలో పోటీ చేసిన డగ్లసు తరువాత అమెరికా అధ్యక్ష పదవికి కూడ లింకనుతో పోటీ చేసెను. కొంతకాలమునకు లింకను అమెరికా కాంగ్రె సులో శాఖ అయిన ప్రజా ప్రతినిధి సభకు ఎన్నుకో బడెను. ఆ సమయములో నీగ్రో బానిసత్వ సమస్య తీవ్రరూపమును ధరించియుండెను. ఈ పరిస్థితిలో “బానిసత్వమే తప్పు కాకపోయినచో, ఇక తప్పు అను నది లేనేలేదు" అని ఘోషించి అప్పుడే అభివృద్ధిలోనికి వచ్చుచున్న అమెరికాలోని పశ్చిమ ప్రాంతములకు ఈ బానిసత్వము వ్యాపించకుండ చేయుటకును, కొలం బియా ప్రాంతములోని బానిసలకు విముక్తిని కలిగిం చుటకును అతడు చాల ప్రయత్నము చేసెను. తరువాత జరిగిన కాంగ్రెసు ఎన్నికలో ఓడిపోయి లింకను తిరిగి న్యాయవాది వృత్తి సాగించెను. 1858 సంవత్సరములో ఆతడు రాష్ట్ర సభకు Senate) డగ్లసునకు ప్రత్యర్థిగా 'నియోగింపబడెను. ఈ సందర్భములో జరిగిన ఎన్నికల యాత్రలో లింకను “ఏ మానవునికిని మరియొక మాన వునిపై అధికారము నెరపుటకు హక్కులేదు, కాని సత్వము అక్రమము. దానిని నిర్మూలించుట అత్యవస రము. సగము స్వతంత్రముగాను, సగము అస్వతంత్రము గాను ఉన్న అమెరికా ప్రభుత్వము చిరకాలము మన జాలదు." అఛి అన్ని చోట్ల ప్రచారము చేసెను. తుదకు ఎన్నికలో ఓడిపోయినను అతనికి గొప్ప వక్త అనియు, మానవ స్వాతంత్ర్య సంరక్షకుదనియు దేశమునం దంత టను పేరు వచ్చెను. 1860 30. omo అబ్రహాం లింకను అమెరికా సంయు క్త రాష్ట్రములకు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను, ఇంతలో బానిసత్వములేని ఉత్తర రాష్ట్రములకును బానిసత్వమును అమలుపరుచు దక్షిణ రాష్ట్రములకును వైషమ్యము ప్రబలి, దక్షిణ రాష్ట్రములు సమాఖ్యనుండి వైదొలగి ఒక ప్రత్యేక సమాఖ్యగా ఏర్పడెను. ఈ సమాఖ్యవారు జెఫరసన్ డేవిస్ యొక్క అధ్యక్షత క్రింద ' వ సంవత్సరములో ఉత్తర రాష్ట్రములతో 1861 230