Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధము ప్రారంభించిరి. ఈ యుద్ధము నాలుగు సంవల్సి రములపాటు సాగినది. యుద్ధమున మొదట ఉత్తర రాష్ట్రములకు ఓటమి సంభవించుచు వచ్చెను. యుద్దము జరుగుచుండగనే దక్షిణ రాష్ట్రములనుండి ఉత్తర రాష్ట్ర ములకు పారిపోయివచ్చిన నీగ్రో బానిసలకు స్వాతంత్య్ర మొసంగుచు అమెరికా కాంగ్రెసు ఒక శాసనము చేసెను. 1863 జనవరిలో లింకను 40 లక్షల మంది నీగ్రోబానిసలకు శాశ్వతముగ స్వాతంత్ర్య మొసగు ప్రకటన మొకటి కావించెను. 1864 వ సంత్సరములో లింకను రెండవసారి అధ్యక్షుపదవికి ఎన్నుకొనబడెను. మరుసటి సంవత్సరము జనవరిలో అమెరికా సంయుక్తరాష్ట్రములో ఎచ్చటను కూడ బానిసత్వము ఉండరాదు అను సవరణ ఒకటి రాష్ట్ర పరిపాలనా ప్రణాళికలో చేర్చబడెను. ఈ విధము. లింకను యొక్క చిరకాల వాంఛిత మీడేరెను. కాని ఈ విము క్తినొందిన బానిసల పురోభివృద్ధిని చూచు భాగ్యము మాత్రము లింకనుకు లభింపలేదు. 1865 వ సంవత్స రము ఏప్రిల్ నెల 14 వ తారీఖు రాత్రి సకుటుంబముగా ఫోర్డు థియేటరులో, ఒక నాటకమును చూచుచుండగా ఒక దుష్టుడు తుపాకి పేల్చి లింకనును హత్యచేసెను. అమెరికాలో జన్మించిన మహనీయులలో ఒకడును, నిన్ను మానవోద్ధారకులలో అగ్రగణ్యుడును అయిన అబ్రహాము లింకను ఈ విధముగ కీర్తి శేషుడయ్యెను. ఆర్. న. రావు. అభినయదర్పణము :- 'అభినయదర్పణము' నంది కేశ్వర ప్రోక్తమైనది, అది నృత్యమునకు సంబంధించిన చిన్న గ్రంథము. నందికేశ్వరుడు 'శంభు రౌరీ తథా బ్రహ్మా, మాధవో నందికేశ్వరః ... ఏతే భరతకర్తారో భువనేషు ప్రకీర్తితాః' అని పేర్కొనబడిన భరతశాస్త్ర కర్తలతో, అయిదవవాడు. ఆతడు తననుగూర్చి సూటిగా చెప్పుకొనక ప్రకరణమును కల్పించుకొని, గ్రంథారంథ మున, ‘కల్యాణాచలవాసాయ కరుణారస సింధవే నమో ఒస్తు నంది కేశాయ, నాట్యశాస్త్రార్థ దాయినే.' అని దేవేంద్రునిచే చెప్పించెను, అతడు శివభక్తుడు. సాత్విక స్వభావుడు. ఈశ్వరతత్వమును చక్కగా నెరిగిన వాడు, కావుననే, 231 " అభినయ చర్పణము 'ఆంగీకం భువనం యస్య, వాటికి నిర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్రతారాది, తం వందే నాత్వికం "మం.' అని శివుని- కరశాస్త్రకర్తలలో ప్రథముడైన శివుని- తనకు వఁయ్యు డైన శివుని సర్వ 'శుఖ' ప్రదాతయ్య దేవుని గ్రం థాగం) ముని మింగళాచరణ రూపముగా - స్తుతించి, తాను 'నట రాజగు శివుని ఎట్లు జగి ద్రూపునిగా నుపాసించెనో తెలుపుచు నాట్యాభిమానులందరును వలె నాట్యోవాసనచే శ్రీ శివదయాపాత్రులు కాగలరని సూచించినవాడయ్యెను. అందుచేత నాట్యము కేవలము వినోదాత్మకమగు కళమాత్రమేగాక, యోగులకు, జ్ఞాను లకువలె, ఈశ్వరప్రాప్తికి ఉపాసనారూపమగు ఒక సాధన మనికూడ అతడు నిరూపించినవాడయ్యెను. ఈ గ్రంథా రంభ శ్లోకము నాట్యోపాసకులకు ఇనుప పెట్టెకు తాళి పు చెవి వంటిదని చెప్పిన చాలును. గ్రంథారంభము కథారూపమైనది. పూర్వ మొక నర్తనశాలను నందికేశ్వరు డలంకరించి, తన కిచ్చుకు దానికి తనను అధిపతిని చేసినందులకు ఇంద్రుడు సంతో షమును వెలిబుచ్చెను. ఒకనాడు నందికేశ్వరుని వద్దకు వచ్చి, “స్వామీ! అసురనాట్యశాలయందు 'నట శేఖరు’ డను నటుడు గొప్ప కీర్తిశాలియై ప్రకాశించుచున్నాడు. నేను నాట్యప్రదర్శనాదులచే అతనిని జయింపవలయునని యున్నది. మీరు రచించిన 'భరతార్ణవము' అను గ్రంథ మును నాకు దయచేసితిరేని, దాని నధ్యయనముచేసి తెచ్చుకొని, నట శేఖరుని దలచి తిని” అని ఇంద్రుడు ప్రార్థించెను. అందుకు నంది కేశ్వరుడు, అనుభవమునకు జయింప 'చతు స్సహస్రసంఖ్యాకై, ర్గంథైశ్చ పరిపూరితం భరతార్ణవశాస్త్రంతు, సుమతే! భ్రుణు సాదరం.” అని దయాళువై ధరతార్ణవమును బోధించుటకు పూనుకొనగా, ఇంద్రు డేలనో కొంచెము వెనుదీసి, 'విస్త రాత్ సంవిహాయ మే, సండిప్య వాట్యశాస్త్రార్థం, క్రమపూర్వ ముదాహర' అని భరతార్ణవమును సంగ్ర హించి చెప్పునట్లు ప్రార్థించెను. అప్పుడు నందికేశ్వరుడు, 'సండిప్య భరతార్ణవం, దర్పణాఖ్య మిదం సూర్ము మవధారయ' అని 'అభినయ దర్పణ'మును బోధించినట్లు. అవతారికవలన తెలియుచున్నది.